breaking news
-
ఛా.. నిన్ను తీసుకుని తప్పు చేశా.. నటుడిపై సెటైర్లు
కబీర్ సింగ్.. కోట్లు కొల్లగొట్టిన ఈ మూవీ కొందరికి నచ్చింది. మరికొందరికి నచ్చలేదు. ఇందులో కాలేజీ డీన్‌గా నటించిన అదిల్ హుస్సేన్‌కు కూడా సినిమా నచ్చలేదట! తన సినీ కెరీర్లో ఎందుకు నటించాన్రా దేవుడా.. అని ఫీలైన సినిమా ఏదైనా ఉందంటే.. అదే కబీర్ సింగ్ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. 'అందులో యాక్ట్ చేయనని చెప్తే కేవలం ఒక్క రోజే రమ్మని అడిగారు. భారీ పారితోషికం డిమాండ్ చేస్తే వాళ్లే సైలెంట్‌గా ఉంటారనుకున్నాను. డబ్బులెక్కువ డిమాండ్ చేశా కానీ నేను డిమాండ్ చేసిన మొత్తం ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. దీంతో తప్పనిపరిస్థితిలో నేను సినిమా చేశాను. నేను నటించిన సన్నివేశం బాగానే ఉంది. సినిమా అంతా కూడా అలాగే ఉంటుందనుకున్నాను. మూవీ రిలీజైన తర్వాత చూస్తే.. ఇలాంటి సినిమా చేశానా? అని సిగ్గుతో చచ్చిపోయాను. నా భార్యను కూడా సినిమా చూడమని అడగలేదు. తను చూసుంటే ఇలాంటి మూవీలో యాక్ట్ చేశావా? అని నాపై కోప్పడేది' అని చెప్పుకొచ్చాడు. ఒక్క బ్లాక్‌బస్టర్‌తో గుర్తింపు ఇది చూసిన కబీర్ సింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియాలో సదరు నటుడిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. 'మీరు గొప్పగా భావించి యాక్ట్ చేసిన 30 సినిమాలతో రాని గుర్తింపు.. ఎందుకు నటించానా? అని బాధపడుతున్న ఈ ఒక్క బ్లాక్‌బస్టర్ చిత్రంతోనే వచ్చింది. మిమ్మల్ని సినిమాలోకి తీసుకున్నందుకు నేను బాధపడుతున్నాను. మీకు నటనపై అభిరుచి కంటే దురాశే ఎక్కువుందని అర్థమవుతోంది. మీరు బాధపడక్కర్లేదు మీరు సిగ్గుతో తలదించుకోకండి.. మీ ముఖాన్ని ఏఐ సాయంతో రీప్లేస్ చేస్తాను.. అప్పుడు మనసారా నవ్వుకోండి' అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. దీనిపై అదిల్ హుస్సేన్ ఓ మీడియాతో మాట్లాడుతూ.. కబీర్ సింగ్ సినిమా చూసి నేను షాకైన మాట వాస్తవం. ఇప్పటికీ ఆ మూవీలో నటించినందుకు రిగ్రెట్‌గా ఫీలవుతున్నాను. అభిప్రాయాన్ని మార్చుకునే ఉద్దేశ్యం నాకు లేదు అని చెప్పుకొచ్చాడు. Ur 'belief' in 30 art films didn't get as much fame to u as ur 'regret' of 1 BLOCKBUSTER film did 👏https://t.co/BiJIV3UeyO I regret casting u,knwing that ur greed is bigger than ur passion. NOW I'll save U from the shame by replacing Ur face with AI help👍 Now smile properly 🙂 — Sandeep Reddy Vanga (@imvangasandeep) April 18, 2024 చదవండి: డ్రగ్స్ కేసులో షారుఖ్ కుమారుడికి క్లీన్ చిట్ ఇచ్చిన అధికారి సంచలన నిర్ణయం -
'ముందు వెళ్లి మీ భర్తను అడగండి'.. స్టార్ హీరో భార్యకు స్ట్రాంగ్ కౌంటర్!
ఇటీవలే యానిమల్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. రణ్‌బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. దాదాపు రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం యానిమల్ నెట్‌ప్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ చిత్రం రిలీజ్ తర్వాత పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. స్త్రీ విద్వేష చిత్రమని చాలామంది ప్రముఖులు సైతం మండిపడ్డారు. అయితే ఈ సినిమాపై అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు సైతం విమర్శలు గుప్పించారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. బాహుబలి-2, కబీర్ సింగ్ సినిమాలు సైతం స్త్రీల పట్ల ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయని ఆరోపించారు. అయితే తాజాగా డైరెక్టర్ సందీప్ రెడ్డి ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు చేసిన విమర్శలపై ఆయనకు ప్రశ్న ఎదురైంది. దీనికి సందీప్ రెడ్డి వంగా తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఆమె పేరును ప్రస్తావించకుండానే చురకలంటించారు. ఒకసారి అమిర్ ఖాన్ నటించిన దిల్ సినిమా చూడాలని ఆమెకు సలహా ఇచ్చాడు. సందీప్ మాట్లాడుతూ.. 'నేను ఆమెకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మీరు అమీర్ ఖాన్ని వెళ్లి అడగండి. ఆయన నటించిన దిల్ సినిమాలో దాదాపు అమ్మాయిపై రేప్‌కు ప్రయత్నించే పరిస్థితిని సృష్టించాడు. కానీ ఆ తర్వాత ఆమెనే తప్పు చేసినట్లుగా భావించేలా చేస్తాడు. కానీ చివరికి అతనితోనే ప్రేమలో పడుతుంది. మరీ ఇదంతా ఏమిటి? ఇలాంటివన్నీ తెలుసుకోకుండానే మాపై ఎలా దాడి చేస్తారో అర్థం కావడం లేదు' అని యానిమల్ దర్శకుడు తెలిపారు. కాగా..ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. -
యానిమల్‌లో ఆ సీన్‌ను తప్పుబట్టిన ప్రముఖ రచయిత
రణబీర్ కపూర్ నటించిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ వంటి సినిమాల విజయంపై ప్రముఖ గీత రచయిత జావేద్ అక్తర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సినిమాలు భారీ విజయాలు సాధించడానికి కారణమైన ప్రేక్షకులను జావేద్ నిందించారు. భారత ప్రముఖ గేయ రచయిత, ఐదు జాతీయ అవార్డుల విన్నర్ అయిన జావేద్ అక్తర్ యానిమల్ సినిమాపై పరోక్షంగా కామెంట్ చేశారు. ఔరంగాబాద్‌లో జరిగిన అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో తన ప్రసంగంలో ప్రస్తుత చిత్రాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్ నటించిన యానిమల్ చిత్రం గురించి నేరుగా ప్రస్తావించకుండానే ఆయన ఆందోళనను వ్యక్తం చేశారు. తాజాగా వచ్చిన ఒక చిత్రంలో ఒక పురుషుడు.. స్త్రీని తన షూ నాకమని అడిగితే.. మరోక చిత్రంలో ఒక స్త్రీ హీరోను చెంపదెబ్బ కొడుతుంది. ఇలాంటి చిత్రాలను ప్రేక్షకులు ఎలా ఆధరిస్తారో అర్థం కావడం లేదని జావేద్ అక్తర్ అభిప్రాయపడ్డారు. ఇదీ ఏ మాత్రం ఆమోదయోగ్యమనది కాదని ఆయన చెప్పారు. సమాజానికి ఇది ఎంతో ప్రమాదకరం అని ఆయన ఆందోళన చెందారు. యానిమల్ చిత్రంలో రణబీర్ కపూర్, త్రిప్తి డిమ్రీ మధ్య ఈ సీన్ జరుగుతుంది. రణబీర్ కనుచూపుతో తన షూ నాకమని త్రిప్తి డిమ్రీకి చెప్పుతాడు. మరొకటి షాహిద్ కపూర్, కియారా అద్వానీ నటించిన కబీర్ సింగ్ చిత్రంలోనిది అందులో హీరోను కియారా చెంపదెబ్బ కొడుతుంది. మరోక సీన్లో హీరోయిన్‌పై బూతు పదాన్ని ఉపయోగిస్తూ హీరో చెంపదెబ్బ కొడుతాడు. ఇదే చిత్రం తెలుగులో అర్జున్‌రెడ్డిగా వచ్చిన విషయం తెలిసిందే. జావేద్ అక్తర్ టార్గెట్ చేసిన ఈ రెండు చిత్రాలను కూడా డైరెక్ట్ చేసింది సందీప్‌రెడ్డి వంగా. పరోక్షంగా సందీప్ మీద ఆయన చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్లో వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా జావేద్ ఇలాంటే వ్యాఖ్యలే చేశారు. ఆనంద్ బక్షి రాసిన సాహిత్యంపై కూడా వివాదస్పద వ్యాఖ్యలే చేశారు. 90ల నాటి చిత్రం ఖల్ నాయక్ నుంచి 'చోలీ కే పీచే' పాట భారీ విజయాన్ని అందుకుంది. ఆ పాట లిరిక్స్‌తో పాటు అందులో మగవారి వస్త్రధారణ కూడా మహిళల మాదిరి ఉండటం ఆయన తప్పుబట్టారు. కానీ ప్రేక్షకుల అఖండ మద్దతుతో ఇలాంటివి మరిన్నీ వస్తున్నాయిని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు చూడాలి అనే విషయంలో కూడా బాధ్యత వహించాలి.. ఇలాంటి వాటిని మెచ్చుకుంటూ పోతే రాబోయే రోజుల్లో ఇలాంటి చిత్రాలే ఎక్కువ వస్తాయి. ఇప్పటికైనా ఇటువంటి చిత్రాలకు దూరంగా ఉండాలని జావేద్ అక్తర్ ఆందోళన వ్యక్తం చేశారు. -
పెళ్లికి రెడీ అయిన కబీర్ సింగ్ పనిమనిషి, ఫోటోలు వైరల్
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి సినిమా టాలీవుడ్లో ఎంతటి సంచలన విజయం నమోదు చేసిందో అందరికీ తెలిసిందే! సందీప్‌రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన ఈ మూవీపై బాలీవుడ్ మనసు పడటంతో కబీర్ సింగ్ పేరుతో హిందీ రీమేక్ తీశాడు. అక్కడ కూడా సందీప్ రెడ్డియే డైరెక్టర్. షాహిద్ కపూర్, కియారా అద్వానీ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.370 కోట్లు రాబట్టింది. ఈ సినిమాలో నటించిన అందరికీ మంచి గుర్తింపు లభించింది. పనిమనిషిగా నటించిన వనిత ఖరత్ తన నటనతో అందరినీ నవ్వించింది. తాజాగా వనిత పెళ్లి పీటలెక్కబోతోంది. సుమిత్ అశోక్ అనే వ్యక్తితో ఏడడుగులు నడవనుంది. ఇప్పటికే వీరి పెళ్లి పనులు కూడా షురూ అయ్యాయి. ఈ క్రమంలో మెహందీ, హల్దీ ఫంక్షన్ జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను కాబోయే నూతన వధూవరులిద్దరూ ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Vanita Kharat (@vanitakharat19) View this post on Instagram A post shared by Pineapple_studios10 (@pineapple_studios10) View this post on Instagram A post shared by Majja (@its.majja) చదవండి: అలా అనడంతో నాన్న పొలానికి వెళ్లి పురుగుల మందు తాగారు: పోసాని అత్యధిక వసూళ్లతో రికార్డులు సృష్టిస్తోన్న పఠాన్.. -
నటిపై దాడి.. చేతిలోని ఫోన్‌ను బలవంతంగా..
Actress Nikita Dutta Phone Got Snatched in Mumbai: బాలీవుడ్ నటి నికితా దత్తాకు చేదు అనుభవం ఎదురయ్యింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె మీద దాడి చేసి.. సెలఫోన్ లాక్కెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఆమె తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. కాగా, గత ఆదివారం సాయంత్రం నికితా దత్తా తన స్నేహితులతో కలిసి ముంబైలోని బాంద్రాలోని రోడ్డుపై నడుచుకుంటు వెళ్తున్నట్లు తెలిపారు. కాగా, సాయంత్రం 7.30 ప్రాంతంలో.. తన ఎదురుగుండా ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి.. తనపై దాడిచేశారని తెలిపారు. ఆ తర్వాత.. తన చేతిలోని ఫోన్‌ను బలవంతంగా లాక్కొని.. అక్కడి నుంచి పరారయ్యారని తెలిపారు. ఆ సమయంలో తనకు.. ఏంజరుగుతుందో కూడా అర్థం కానీ పరిస్థితుల్లో ఉండిపోయానని తెలిపారు. కొంతమంది స్థానికులు ఆ బైక్‌దొంగలను పట్టుకోవడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే వారు.. అక్కడి నుంచి తప్పించుకోని వెళ్లిపోయారని వాపోయారు. ఆ తర్వాత.. తేరుకుని బాంద్రాలోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు నికితా దత్తా తెలిపారు. నికితా దత్తా.. డైబుక్, ఏక్‌డుజ్‌కే వాస్తే, దిబిగ్‌బుల్,కబీర్ సింగ్ వంటి పలు సినిమాల్లో నటించారు. నికితాదత్తా.. 2012 లో జరిగిన ఫెమినా మిస్ ఇండియా ఫైనల్లో వరకు చేరారు. ఆ తర్వాత.. ‘లేకర్ హమ్ దీవానా దిల్’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆమె చివరగా ఇమ్రాన్ హష్మీ డైబ్బక్ సినిమాలో నటించారు. కాగా, ఈ ఘటనపై స్పందించిన అభిషేక్ బచ్చన్.. జాగ్రత్తగా ఉండాలని ఆమె ఇన్‌స్టాలో కామెంట్ చేశారు. చదవండి: Kangana Ranaut: ట్విటర్ కొత్త సీఈఓ నియామకంపై కంగనా ఆసక్తికర కామెంట్.. View this post on Instagram A post shared by Nikita Dutta 🦄 (@nikifying)
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019