breaking news
-
దోపిడి దొంగల బీభత్సం.. గోల్‌కీపర్, అతని భార్యను బంధించి
ఇటలీ గోల్‌కీపర్ గియాన్లుయిగి డోనరుమ్మాకు చేదు అనుభవం ఎదురైంది. పారిస్‌లోని తన ఇంట్లోకి చొరబడిన దుండగులు 500,000 యూరోల(భారత కరెన్సీలో సుమారు రూ. 4కోట్లకు పైగా) విలువైన వస్తువులను ఎత్తుకెళ్లిపోయారు. అయితే అడ్డుపడేందుకు ప్రయత్నించి డోనరుమ్మా, అతని భార్యపై దాడి చేసిన దుండగులు వారిని బంధించి అక్కడి నుంచి పారిపోయారు. కాగా ఇదంతా తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. కాగా దుండగులు డోనరుమ్మా ఇంటి నుంచి పారిపోతున్న సమయంలో పక్కన ఉన్న హోటల్ సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. కాగా డోనరుమ్మా ఇంట్లో పనిచేసే సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. అనంతరం డోనరుమ్మా, అతని భార్యను ఆసుపత్రికి తరలించారు. ఇద్దరికి చికిత్స నిర్వహించామని.. అయితే తమ కళ్ల ముందే దొంగతనం జరగడంతో కాస్త షాక్‌లో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇక ప్రస్తుతం డోనరుమ్మా పారిస్ సెయింట్ జెర్మన్(పీఎస్జీ క్లబ్)కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అంతకముందు ఏసీ మిలన్ క్లబ్‌కు ఆడిన డోనరుమ్మా 2020లో ఇటలీ యూరో టైటిల్ కొట్టడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక 2021లో పీఎస్జీ క్లబ్‌తో అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు. ఇక పీఎస్జీ తరపున ఇప్పటివరకు 72 మ్యాచ్‌లాడాడు. పీఎస్జీ రెండుసార్లు లీగ్-1 ట్రోఫీలు గెలవడంలో కీలకపాత్ర వహించాడు. ఇక ఇటలీ తరపున ఇప్పటివరకు 54 మ్యాచ్‌ల్లో గోల్‌కీపర్‌గా వ్యవహరించాడు. Understand Gianluigi Donnarumma will travel to Japan with PSG tomorrow, as planned. Donnarumma and his wife were the victims of a violent burglary, during which they were both tied up. They managed to take refuge in a hotel located not far from their home around 3:20am. pic.twitter.com/IBwBo8tjUC — Fabrizio Romano (@FabrizioRomano) July 21, 2023 చదవండి: 'చిన్నా.. నేను క్రీజులో ఉన్నానంటే బంతిపై కన్నేసి ఉంచాలి' -
ఫుట్‌బాల్‌లో సంచలనం.. చారిత్రాత్మక గోల్
ఫుట్‌బాల్‌లో గోల్ కీపర్ పనేంటి అని చూసుకుంటే ప్రత్యర్థి ఆటగాళ్లు చేసే గోల్స్‌ను అడ్డుకోవడం, ఆ తర్వాత బంతిని తన జట్టు ఆటగాళ్లకు పాస్ లేదా సర్వ్ చేయడం. అయితే ఫుట్‌బాల్ చరిత్రలో ఒక సంచలన గోల్ నమోదైంది. గోల్ కీపర్ సర్వ్ చేసిన బంతి నేరుగా ప్రత్యర్థి జట్టు గోల్ పోస్ట్‌లోకి దూసుకెళ్లింది. దాదాపు 101 మీటర్ల దూరం అవతల ఉన్న గోల్‌పోస్ట్‌లోకి బంతి వెళ్లడంతో ఫుట్‌బాల్‌లో అత్యంత లాంగెస్ట్ గోల్‌గా రికార్డులకెక్కింది. ఈ అద్భుతమైన ఫీట్ కొబ్రెసల్, కొలో-కొలో మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకుంది. ఆట 77వ నిమిషంలో అర్జెంటీనాకు చెందిన గోల్ కీపర్ లియాండ్రో రెక్వినా బంతిని పాస్ చేయాలనే ఉద్దేశంతో బంతిని కాస్త వేగంగా తన్నాడు. అయితే ఎవరు ఊహించని రీతిలో ఎత్తులో వెళ్లిన బంతి పెనాల్టీ ఏరియాలో నిలబడిన కొలో-కొలో గోల్ కీపర్ బ్రయాన్ కోర్టస్ను దాటుకొని అతని తలపై నుంచి గోల్‌పోస్ట్‌లోకి వెళ్లింది. ఈ దెబ్బకు గోల్ కీపర్ సహా ప్రత్యర్థి ఆటగాళ్లకు దిమ్మతిరిగింది. చేసేదేం లేక గోల్ కీపర్ బ్రయాన్ దానిని గోల్‌గా ప్రకటించాడు. దీంతో కొబ్రెసల్ జట్టు 3-1 తేడాతో కొలో-కొలో జట్టుపై సంచలన విజయం సాధించింది. ఇంతకముందు 2021లో టామ్ కింగ్ అనే ఫుట్‌బాల్ ప్లేయర్ 96.1 మీటర్ల దూరం నుంచి నేరుగా గోల్‌పోస్ట్‌లోకి బంతిని పంపడం రికార్డుగా ఉంది. తాజాగా ఆ రికార్డును గోల్ కీపర్ లియాండ్రో బద్దలుకొట్టాడు. ఈ అద్భుత విన్యాసానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ⚽⚪🟠 El primer gol arco a arco del #CampeonatoBetsson Así fue la anotación de Leandro Requena desde su propia puerta y que dejó a Brayan Cortés quieto, provocando el error del portero albo en el #CSLvsCCxTNTSports. pic.twitter.com/HDL2K22QnS — TNT Sports Chile (@TNTSportsCL) March 18, 2023 చదవండి: చరిత్ర సృష్టించిన రొనాల్డో.. -
విషాదం.. లైవ్ మ్యాచ్‌లో ప్రాణాలొదిలిన గోల్ కీపర్
ఫుట్‌బాల్‌లో విషాదం నెలకొంది. లైవ్ మ్యాచ్‌లోనే గోల్ కీపర్ ప్రాణాలొదిలాడు. పెనాల్టీ కిక్‌ను సేవ్ చేసిన గోల్‌కీపర్ ఆ మరుక్షణమే ప్రాణం వదలడం అభిమానులను కలచివేసింది. ఈ ఘటన బెల్జియంలో చోటు చేసుకుంది. విషయంలోకి వెళితే..బ్రెజిల్‌కు చెందిన సెకండ్ ప్రొవిజనల్ డివిజన్ వెస్ట్ బ్రాబంట్లో వింకిల్ స్పోర్ట్ బి జట్టుకు ఆర్నే ఎస్పీల్ గోల్ కీపర్‌గా సేవలందిస్తున్నాడు. వెస్ట్రోజెబ్కేతో మ్యాచ్‌లో వింకిల్ స్పోర్ట్ జట్టు 2-1తో ఆధిక్యంలో ఉంది. రెండో సగం మరికాసేపట్లో ముగుస్తుందనగా వెస్ట్రోజెబ్కేకు పెనాల్టీ కిక్ లభించింది. అయితే గోల్‌కీపర్‌గా తన బాధ్యతను సమర్థంగా నిర్వహించిన ఆర్నే స్పిల్ పెనాల్టీ కిక్‌ను అడ్డుకున్నాడు. అయితే పెనాల్టీ కిక్‌ను అడ్డుకున్న మరుక్షణమే గ్రౌండ్‌పై కుప్పకూలాడు. ఎమర్జెన్సీ సర్వీస్ సిబ్బంది అతన్ని ఆసుపత్రికి తరలించినప్పటికి హార్ట్ ఫెయిల్యూర్‌తో అప్పటికే మరణించినట్లు వైద్యులు పేర్నొన్నారు. ఈ వార్త వింకిల్ స్పోర్ట్స్ క్లబ్లో విషాదం నింపింది. చదవండి: మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కోచ్ కన్నుమూత -
Turkey Earthquake: విషాదం.. గోల్‌కీపర్ కన్నుమూత
టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన భూకంపం దాటికి వేలాది మంది మృత్యువాత పడ్డారు. సోమవారం సంభవించిన భూప్రకంపనల్లో వందలాది భవనాలు కుప్పకూలగా.. వాటి శిథిలాల కింద వేలాది మంది చిక్కుకుపోయారు. ఇప్పటికి రెస్క్యూ బృందం శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటికి తీస్తున్నారు. ప్రస్తుతం భూకంపం సంభవించిన ప్రాంతంలో ఎక్కడ చూసినా ఆర్తనాదాలు, రోదనలే. ఇప్పటిదాకా టర్కీలో 5,400 మందికి పైగా, సిరియాలో 1,800కి పైగా మృతదేహాలను శిథిలాల నుంచి వెలికి తీశారు. పూర్థిస్థాయిలో శిథిలాల తొలగింపు జరిగితే మరణాల సంఖ్య 20 వేలకు పైనే దాటోచ్చని డబ్ల్యూహెచ్‌వో అంచనా వేస్తోంది. ఇదిలా ఉంటే టర్కీకి చెందిన 28 ఏళ్ల ఫుట్‌బాలర్.. గోల్‌కీపర్ అహ్మత్ ఎయుప్ తుర్క్‌స్లాన్ మృత్యువాత పడ్డాడు. శిథిలాల కింద చిక్కుకున్న ఎయుప్ కన్నుమూసినట్లు యేని మాలత్యస్పోర్ ఫుట్‌బాల్ క్లబ్ తన ట్విటర్లో ధృవీకరించింది. మాకు ఇది విషాదకర వార్త. గోల్ కీపర్ ఎయుప్ తుర్క్‌స్లాన్ మృత్యువాత పడ్డాడు. శిథిలాల కింద చిక్కుకున్న అతన్ని రక్షించలేకపోయాం. అతని ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం అంటూ ట్వీట్ చేసింది. 2011లో కెరీర్ ప్రారంభించిన ఎయుప్ తుర్క్‌స్లాన్ అన్ని క్లబ్‌లకు కలిపి 80 మ్యాచ్‌ల్లో గోల్‌కీపర్‌గా వ్యవహరించాడు. ఇక ఘనాకు చెందిన మరో ఫుట్‌బాలర్ క్రిస్టియన్ అట్సూ మాత్రం ప్రాణాలతో బయటపడినట్లు టర్కిష్ ఫుటబాల్ సూపర్ లీగ్ క్లబ్ పేర్కొంది. Başımız sağ olsun! Kalecimiz Ahmet Eyüp Türkaslan, meydana gelen depremde göçük altında kalarak, hayatını kaybetmiştir. Allah rahmet eylesin, mekanı cennet olsun. Seni unutmayacağız güzel insan.😢 pic.twitter.com/15yjH9Sa1H — Yeni Malatyaspor (@YMSkulubu) February 7, 2023 చదవండి: టర్కీ భూకంపం.. శిథిలాల కింద స్టార్ ఫుట్‌బాలర్ LeBron James: సంచలనం.. 40 ఏళ్ల రికార్డు కనుమరుగు -
ఆగ్రహం కట్టలు తెంచుకున్న వేళ.. గోల్‌కీపర్‌పై బకెట్‌తో దాడి
A-లీగ్ మెన్ సాకర్ లీగ్‌లో అపశృతి చోటుచేసుకుంది. లీగ్‌లో భాగంగా శనివారం మెల్బోర్న్ సిటీ, మెల్బోర్న్ విక్టరీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ రసాబాసగా మారింది. మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్లోకి చొచ్చుకొచ్చిన అభిమానులు మెల్బోర్న్ సిటీ గోల్‌కీపర్ టామ్ గ్లోవర్పై బకెట్‌తో దాడికి పాల్పడ్డారు. దీంతో టామ్ గ్లోవర్ తల నుంచి రక్తం కారింది. దీంతో నిర్వాహకులు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మ్యాచ్‌లో 1-0తో మెల్బోర్న్ సిటీ ఆధిక్యంలో ఉన్న దశలో ఈ ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ ప్రారంభమైన 20 నిమిషాల వ్యవధిలోనే మెల్బోర్న్ సిటీ గోల్ చేయడం ప్రత్యర్థి అభిమానులకు నచ్చలేదు. పైగా గోల్‌కీపర్ టామ్ గ్లోవర్ తొండిగా ఆడుతున్నాడంటూ మొదటి నుంచి అరుస్తూ వచ్చారు. అయితే ఇంతలో గోల్ నమోదు కావడంతో మెల్బోర్న్ విక్టర్స్ అభిమానులకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అంతే ఒక్కసారిగా కొంతమంది అభిమానులు గోల్‌కీపర్ టామ్ గ్లోవర్ వైపు దూసుకొచ్చారు. రిఫరీ వచ్చి వద్దొని వారించినా వినకుండా మెటల్ బకెట్‌తో దాడి చేశారు. దీంతో భయాందోళనకు గురైన టామ్ గ్లోవర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ తలకు గట్టిగా తగలడంతో రక్తం కారసాగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక గోల్‌కీపర్‌పై దాడి చేయడాన్ని ఫుట్‌బాల్ ఆస్ట్రేలియా ఖండించింది. ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరం. ఆట అన్నాకా భావోద్వేగాలు సహజం. అయితే అవి హెచ్చుమీరితే ప్రమాదం. టామ్ గ్లోవర్పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు అని పేర్కొంది. Fair to say the Melbourne Derby has kicked-off. Match abandoned. pic.twitter.com/Y3SJ8X2cp4 — Tom Reed (@tomreedwriting) December 17, 2022 చదవండి: Rafael Nadal: 18 ఏళ్ల బంధం తెంచుకున్న నాదల్
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019