breaking news
-
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
‘ప్లాన్ పేరు ‘టీ అండ్ ఎఫ్’ అంటే ట్యూస్ డేస్ అండ్ ఫ్రైడేస్.రూల్ నంబర్ వన్.. ఇద్దరం ప్రతి మంగళ, శుక్రవారాల్లో మాత్రమే కలుసుకోవాలి.రూల్ నంబర్ టూ.. మిగిలిన వారాల్లో ఎవరి ఇష్టం వారిది. నువ్వు వేరే అమ్మాయి తో డేట్ చేసినా.. నేను ఇంకో అబ్బాయితో డేట్ చేసినా నిలదీయొద్దు.రూల్ నంబర్ త్రీ.. థర్డ్ డేట్ వరకు నో కిసెస్, నో హగ్స్..ఇద్దరిలో ఎవరికిది వర్కవుట్ కావట్లేదు అనిపించినా తప్పుకోవచ్చు. ఎలాంటి సంజాయిషీలు, ప్రశ్నలు ఇచ్చిపుచ్చుకోవడాలు లేకుండా. తర్వాత ఎవరిదారి వారిది’ అంటూ అబ్బాయికి డేటింగ్ ప్లాన్ వినిపిస్తుంది అమ్మాయి. వెంటనే ఒప్పుకోవడానికి కాస్త తటపటాయించినా తర్వాత ఒప్పుకుంటాడు అబ్బాయి. ఆమె పేరు.. సియా (ఝటాలేకా), అతని పేరు వరుణ్ (అన్మోల్ టకారియా థిల్లాన్). సినిమా .. టీ అండ్ ఎఫ్. భన్సాలీ ప్రొడక్షన్స్ (సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణ సారథ్యం). దర్శకుడు.. తన్వీర్ సింగ్. ప్రేమ, పెళ్లి పట్ల మిల్లేనియల్స్ ఆలోచనల తీరు, భద్రతాభద్రతల భావనలు, నమ్మకం– అపనమ్మకాల ప్రయాణాన్ని చూపించిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది.కథ.. సియా.. వృద్ధిలోకి వస్తున్న న్యాయవాది. వరుణ్.. ఔత్సాహిక రచయిత. అతను రాసిన నవల సినిమా హక్కుల వివాదంలో ఒకరికొకరు పరిచయం అవుతారు. ఇద్దరి తల్లిదండ్రులు విడాకులతో వేరవుతారు. ఆ ఇద్దరూ తల్లుల దగ్గరే పెరుగుతారు. అయితే తన తల్లిదండ్రుల విడాకులతో ప్రేమ, పెళ్లి విషయంలో వరుణ్ ప్రతికూల అభిప్రాయాన్ని ఏర్పర్చుకుంటాడు. సియా.. కొంత ఆశావాహ ధోరణిలో ఉంటుంది. ప్రేమ, పెళ్లి తన తల్లిదండ్రుల విషయంలో విఫలమైనంత మాత్రాన అందరికీ అదే ఎదురవుతుందనే ఆలోచనలో ఉండడం తప్పు అనుకుంటుంది. సియాకు పూర్తి వ్యతిరేకం వరుణ్.తప్పు అనుకుంటుంది. సియాకు పూర్తి వ్యతిరేకం వరుణ్.తప్పు అనుకుంటుంది. సియాకు పూర్తి వ్యతిరేకం వరుణ్.తప్పు అనుకుంటుంది. సియాకు పూర్తి వ్యతిరేకం వరుణ్.ప్రేమ, పెళ్లికి సంబంధించిన అనుబంధానికి ఎక్స్‌పెయిరీ డేట్ ఉంటుందనేది అతను ఏర్పర్చుకున్న నమ్మకం. అది ఏడు వారాల తర్వాత బీటలు వారి గొడవలతో సమాప్తం అవుతుందని అతనికున్న అభద్రత. అందుకే సియా అంటే ఇష్టం ఉన్నా ఆ రిలేషన్ ఏడువారాలే సాగాలని.. జీవితాంతం తోడు అనే కాన్సెప్ట్‌తో ఆమెకు దగ్గరై.. తర్వాత గొడవలతో ఆమెకు దూరమయ్యే బాధను భరించలేనంటాడు. అతని ఆ దృక్పథాన్ని మార్చాలని.. ఒకరిపట్ల ఒకరు గౌరవంతో ఉంటే ఏ అనుబంధమైనా పదికాలాపాటు పదిలంగా ఉంటుందని అతనికి చెప్పే ప్రయత్నం చేస్తుంది.అందులో భాగమే ఆ ‘టీ అండ్ ఎఫ్’ డేటింగ్ ప్లాన్. ట్యూస్ డేస్ అండ్ ఫ్రైడేస్ ప్లాన్‌తో సియాను వదులుకోలేనంత ప్రేమలో కూరుకుపోతాడు వరుణ్. అయినా గొడవలతో విడిపోతామేమోనన్న అభ్రదత, భయంతో సియాను దూరం చేసుకుంటాడు. విపరీతమైన మానసిక సంఘర్షణ తర్వాత సియాతో జీవితాంతం ఉండిపోవడానికి సిద్ధమవుతాడు. ఏడు వారాల కాన్సెప్ట్ మళ్లీ అతని మెదడును వెతుక్కోకుండా ఉండడానికి ఏడాది గడువిచ్చి.. ఆ ఏడాది డేటింగ్లో వరుణ్ అభద్రతను, ప్రేమ, పెళ్లి పట్ల ఉన్న అపనమ్మకాన్ని పూర్తిగా పోగొట్టి.. పెళ్లికి ఓకే అంటుంది సియా.కామెంట్..కొత్త కథాంశాన్ని తీసుకున్నా కథనంలో భిన్నత్వాన్ని చూపించలేకపోయింది. మహిళా సాధికారతను స్పృశించినా ఫోకస్ చేయలేకపోయింది. కథకు మించిన పాత్రలతో కొంత గందరగోళానికి గురి చేసింది. హీరోహీరోయిన్లూ కొత్తవాళ్లే. అందంతో ఆకట్టుకుంటారు తప్ప నటనతో కాదు. అన్నట్టు హీరో అన్మోల్ .. బాలీవుడ్ ఒకప్పటి హీరోయిన్ పూనమ్ థిల్లాన్ కొడుకు. -
బీచ్‌లో డేటింగ్!
సూర్యోదయం, సూర్యాస్తమయం రెండూ కనువిందుగా ఉంటాయి. అది కూడా సూర్యాస్తమయం సమయంలో ఏ సాగర తీరానో ఉంటే ఓ మంచి అనుభూతిని పొందవచ్చు. ఇలియానా కూడా ఇదే చెబుతున్నారు. ఒకవేళ మీకు నచ్చిన వ్యక్తితో డేటింగ్ ప్లాన్ చేయాల్సి వస్తే, మీరు ఏ ప్లేస్‌ని ఎంపిక చేసుకుంటారు? అనే ప్రశ్న ఇలియానా ముందుంచితే -‘‘బీచ్‌ని మించిన బెస్ట్ ప్లేస్ ఉండదు. కాళ్లకు చెప్పుల్లేకుండా సాగర తీరంలో ఇసుకలో కూర్చుని ఎగసిపడే అలలను చూస్తుంటే చాలా బాగుంటుంది. అలాగే, ఇసుకలో నడుం వాల్చి, దుప్పటి కప్పేసుకుని సూర్యాస్తమయాన్ని తిలకిస్తే, ఆ హాయే వేరు. ఆ తర్వాత వేడి వేడి కాఫీ తాగుతూ, కబుర్లు చెప్పుకుంటుంటే ఎంత మజాగా ఉంటుందో’’ అన్నారు. ఇంతకీ ఎవరితో డేటింగ్ చేస్తారు? అంటే.. అది మాత్రం సస్పెన్స్ అన్నట్లుగా ఇలియానా సైలైంట్ అయిపోయారు. పోనీ.. మీకు నచ్చిన వ్యక్తి ఎలా ఉండాలో చెబుతారా? అనడిగితే - ‘‘నిజాయతీపరుడై ఉండాలి. జీవిత భాగస్వామి మనోభావాలను గౌరవించాలి. చూడచక్కగా ఉండాలి. ఎప్పుడూ హ్యాపీగా నవ్వుతూ ఉండాలి’’ అన్నారు. బహుశా ఆండ్రూలో ఈ లక్షణాలన్నీ ఉండి ఉంటాయి. అందుకే అతనితో ప్రేమలో పడ్డారేమో. ఆండ్రూతో ప్రేమ గురించి ఇలియానా బాహాటంగా చెప్పకపోయినా.. ఈ ఇద్దరి మధ్య సమ్‌థింగ్ ఏదో ఉందని మాత్రం పరిశీలకులు భావిస్తున్నారు.
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019