breaking news
-
దాల్చిన చెక్కతో ఊబకాయం, బెల్లీ ఫ్యాట్ నిజంగా తగ్గుతుందా?
సకల రోగాలకు మూలం ఒబెసిటీ. ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువుంటే అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అందుకే అధిక బరువును తగ్గించుకునేందుకు చాలామంది నానా కష్టాలు పడుతూ ఉంటారు. జీవనశైలి మార్పులు, ఆహారఅలవాట్లుమార్చుకోవడంతోపాటు, కొన్ని ప్రత్యేక పదార్థాలను కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వాటిల్లో బాగా వినిపిస్తున్నది దాల్చిన చెక్క. శరీరంలో కొవ్వును కరిగించడానికి దాల్చిన చెక్క నీరు, కషాయం, టీ బాగా ఎఫెక్టీవ్‌గా పని చేస్తుందని నమ్ముతారు. దాల్చిన చెక్క ఆకలిని నియంత్రిస్తుంది. జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే హార్మోన్ ఇన్సులిన్కుసరిగ్గా పనిచేసేలా చేస్తుంది. కొన్ని అధ్యయనాలు దాల్చినచెక్కను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని కూడా సూచిస్తున్నాయి. దాల్చిన చెక్క నీటిని తాగడం వల్ల ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు. ముఖ్యంగా దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు శరీంలోని మలినాలను బయటకు పంపుతాయి. దాల్చిన నీరు తాగడం వల్ల శరీరం మెటబాలిజం పెరుగుతుంది. దీంతో వెయిట్ లాస్ అయ్యేందుకు చక్కగా పని చేస్తుంది. ప్రతి రోజూ ఉదయం దాల్చిన చెక్క నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గొచ్చు.శరీరంలో చెడు కొలెస్ట్రాల్ త్వరగా కరుతుంది. ఫలితంగా స్థూలకాయం, అధిక బరువును తగ్గించుకోవచ్చు. ఈ వాటర్ తాగడం వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. దాల్చిన చెక్కలో అనేక యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు వాపు తగ్గించడం ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు సహాయపడుతుంది. మెదడు ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. సాధారణ జలుబు, ఫ్లూ, వార్మ్ ఇన్ఫెక్షన్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్ వంటి ఇన్ఫెక్షన్లను నిర్వహించడంలోసహాయపడుతుంది. గవద జ్వరం వంటి అలర్జీ సమస్యల నివారణలో దాల్చిన చెక్క ఉపయోగ పడుతుంది. పురుషులలో అంగస్తంభన సమస్యతోపాటు, స్పెర్మ్ కౌంట్ పెంచుతుంది. మహిళల్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యకు పని చేస్తుంది. నోట్: అందరికీ ఈ చిట్కా మనచేస్తుందని చెప్పలేం. కానీ కచ్చితంగా కొన్ని ప్రయోజనాలు న్నాయి. అయితే ఆరోగ్యకరమైన జీవన శైలి, క్రమం తప్పని, వ్యాయామం బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయిని మాత్రం మర్చిపోకూడదు. -
దాల్చిన చెక్కతో ప్రొస్టేట్ కేన్సర్ నివారణ!
సాక్షి, హైదరాబాద్: భారతీయులు వంటకాల్లో తరచూ ఉపయోగించే దాల్చిన చెక్క ప్రొస్టేట్ కేన్సర్ నివారణకు దోహదపడుతుందని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) జరిపిన అధ్యయనం తేల్చింది. దాల్చిన చెక్కతో మన ఆరోగ్యానికి ఎన్నో మేళ్లు జరుగుతాయన్నది చాలాకాలంగా తెలిసిన విషయమే. ఎన్ఐఎన్ తాజా అధ్యయనం ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. దాల్చిన చెక్కలోని చైనామాల్డీహైడ్, ప్రొసైనాడిన్ బీ–2లను ఎలుకలకు అందించినప్పుడు ప్రాథమిక దశలోని ప్రొస్టేట్ కేన్సర్‌పై సానుకూల ప్రభావం చూపినట్లు తెలిసింది. అధ్యయనంలో భాగంగా శాస్త్రవేత్తలు ఎలుకలకు 16 వారాలపాటు దాల్చిన చెక్క, దాంతోపాటు చైనామాల్డీహైడ్, ప్రొసైనాడిస్ బీ–2లను అందించారు. ఆ తరువాత ఈ ఎలుకలకు ప్రొస్టేట్ కేన్సర్ వచ్చేలా చేశారు. దాల్చిన చెక్క, దాంట్లోని రసాయనాలను ఆహారంగా తీసుకున్న 60–70 శాతం ఎలుకల్లో కేన్సర్ లక్షణాలేవీ కనిపించలేదు. ఈ పదార్థాలు శరీరంలోని ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను సమర్థంగా తట్టుకోగలగడం వల్లనే వాటికి కేన్సర్ సోకలేదని భావిస్తున్నట్లు ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ అయేశా ఇస్మాయిల్ తెలిపారు. ప్రొస్టేట్ గ్రంథిలో కేన్సర్ కణాల వ్యాప్తి కూడా తక్కువగా ఉన్నట్లు తమ పరిశీలనలో తెలిసిందన్నారు. అంతేగాకుండా... ఎముకల్లోని ఖనిజాల మోతాదు ఎక్కువైందని, ఎముకలు బలహీనమయ్యే ప్రమాదం తగ్గిందని వివరించారు. ప్రొస్టేట్ కేన్సర్ నివారణలో దాల్చిన చెక్క ఉపయోగపడగలదన్న విషయం ఎలుకల్లో రుజువైనప్పటికీ మనుషుల్లో వాడకానికి సంబంధించి మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆర్.హేమలత తెలిపారు. ‘కేన్సర్ ప్రివెన్షన్ రీసెర్చ్’జర్నల్ తాజా సంచికలో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి. -
దాల్చిన చెక్క పొడి పాలల్లో వేసుకుని తాగుతున్నారా? సినామాల్డెహైడ్ అనే రసాయనం వల్ల
Cinnamon- Health Benefits In Telugu: దాల్చినచెక్క.. భారతీయుల వంట గదిలో కనిపించే సుగంధ ద్రవ్యాల్లో ముందు వరుసలో ఉంటుంది. నిజానికి మసాలా వంటకాల్లో దాల్చిన చెక్క లేనిదే వాటికి రుచి, సువాసన రాదు. అయితే, కేవలం రుచికి మాత్రమే పరిమితం కాకుండా ఔషధపరంగానూ దాల్చిన చెక్క ఎంతో ఉపయోగకరం. ముఖ్యంగా శీతాకాలంలో జలుబు, దగ్గు వంటి సమస్యలు.. ఇతరత్రా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండేందుకు దీని పొడిని పాలల్లో కలుపుకొని తాగితే మంచిదని పోషకాహార నిపుణులు అంటున్నారు. రోజూ రాత్రి పడుకునే ముందు ఈ పాలను తాగడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని న్యూట్రీషనిస్ట్ లోవనీత్ బాత్రా ఎన్డీటీవీతో పేర్కొన్నారు. దాల్చిన చెక్క వల్ల కలిగే ఆరోగ్య లాభాలు ►మహిళల్లో రుతుస్రావ సమయంలో కలిగే నొప్పి తీవ్రత తగ్గుతుంది. ►ఇందులో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలం. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. ►ఇందులోని యాంటీ- ఇన్‌ఫ్లామేటరీ గుణాలు మంట, వాపులను తగ్గించేందుకు దోహదపడతాయి. ►దాల్చిన చెక్క నోటి దుర్వాసనను నివారించడంలో తోడ్పడుతుంది. ►అదే విధంగా దగ్గు, పంటినొప్పులను తగ్గించడంలో దోహదపడుతుంది. ►గొంతు బొంగురు పోవడం, గొంతులో గురగురలు తదితర సమస్యలు ఉన్నవారు దాల్చిన చెక్క ముక్కను బుగ్గన పెట్టుకుని, ఆ ఊటను నమిగిలి మింగుతూ ఉంటే ఉపశమనం పొందవచ్చు. ►ఫుడ్‌పాయిజన్ అయిన సందర్భాల్లో దాల్చిన చెక్క రసాన్ని తీసుకోవడం వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుంది. ►నిద్రలేమి సమస్యతో బాధపడే వారు.. అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని ఒక టీకప్పు నీటిలో వేసి, ఐదు నిమిషాలు మరిగించాలి. దీనిలో తేనె కలిపి తీసుకుంటే గాఢనిద్ర పడుతుంది. సినామాల్డెహైడ్ అనే రసాయనం వల్ల యూఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం దాల్చిన చెక్క సువాసన, రంగుకు కారణమైన సినామాల్డెహైడ్ అనే రసాయనం హైపోగ్లైసెమిక్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడంలో తోడ్పడుతుంది. కాబట్టి షుగర్ పేషంట్లు దాల్చిన చెక్క పొడి కలిపిన పాలు తాగితే(చక్కెర లేకుండా) తాగితే ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇక సినామాల్డెహైడ్ యాంటీ ఫంగల్ ఏజెంట్‌గానూ పనిచేస్తుంది. ఇన్ఫెక్షన్ల నివారణకు దోహదం చేస్తుంది. అదే విధంగా రక్తనాళాలు మూసుకుపోకుండా చేస్తుంది. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కల్పించడం కోసం మాత్రమే! చదవండి: Health Tips: రక్తం పీల్చే జలగలతో వైద్యం! పైల్స్, షుగర్ పేషంట్లకు ఉపశమనం.. ఇంకా.. Health: తొడల మీద దద్దుర్లు.. ఈస్ట్ ఇన్ఫెక్షన్ లక్షణాలివే! కారణాలేంటి? రిస్క్ ఎవరికి ఎక్కువ? -
Diabetes: బ్లడ్ షుగర్, అధికబరువుకు చెక్ చెప్పండిలా!
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమందిని వేధిస్తున్న సమస్య మధుమేహం మరొకటి అధిక బరువు. ఇటీవలి కాలంలో ఇవి చాలా సాధారణ సమస్యలుగా మారిపోయాయి. మారిన జీవన శైలి, ఆహార నియమాలు, జంక్ఫుడ్స్, ఇతర అనారోగ్యకరమైన జీవన పద్ధతులు ఈ ముప్పును మరింత పెంచుతున్నాయి. అయితే మన కిచెన్‌లోని అతి సాధారణ మసాలా దినుసులు, మూలికలతో షుగర్‌ను, కొలెస్ట్రాల్‌ను అదుపులోకి తేవచ్చు. ఆ వివరాలేంటి ఒకసారి చూద్దాం. మధుమేహం దీర్ఘకాలిక వ్యాధులలో ఒకటిగా మారిపోయింది. దీని వలన తీవ్రమైన సమస్యలు రావడంతో పాటు, ఒక్కోసారి శారీరక వైకల్యంతో బాడీపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఫలితంగా మనిషి సగటు ఆయుర్దాయం కూడా తగ్గిపోతుంది. అయితే షుగర్ వ్యాధి బారిన పడినంత మాత్రాన బెంబేలెత్తిపోవాల్సిన పనిలేదు. తమ రోజు వారీ ఆహారం, తేలికపాటి వ్యాయామాలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడు తూనే, శరీరంలో షుగర్ లెవల్స్‌ను క్రమబద్ధీకరించుకునేందుకు చిట్కాలు పాటిస్తుండాలి. ముఖ్యంగా వంట ఇంట్లో మనకు అందుబాటులో ఉండే సుగంధ ద్రవ్యాలు, ఇతర ఆయుర్వేద విలువలు కలిగిన మూలికలతో షుగర్ వ్యాధికి చెక్ చెప్పవచ్చు. అలాంటి వాటిలో దాల్చిన చెక్క, పసుపు, మెంతులు, జీలకర్ర, సోంపు ప్రధానంగా ఉంటాయి. డయాబెటిక్ పేషెంట్‌కి రక్తంలో చక్కెర స్థాయి సాధారణ స్థాయిలో ఉండటం చాలా ముఖ్యం. ఇందుకు నిత్యం మనం వాడే వస్తువులు దోహదం చేస్తాయి. ముఖ్యంగా పసుపును సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు. వ్యాధులనుంచి తప్పించే సహజసిద్ధమైన యాంటిబయోటిక్‌గా పనిచేసే పసుపును ప్రతీ ఒక్కరు తమ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. మన బాడీలోకి ప్రవేశించే ఏ రకమైన వైరస్ లేదా బాక్టీరియాతోనైనా మనకు తెలియకుండానే ఇది ఫైట్ చేసుంది. ఇక మధుమేహం విషయంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగు పరచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలాగే కేవలం మాసాలా దినుసుగా మాత్రమే కాదు దాల్చిన చెక్కలో యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. దాల్చిన చెక్క టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని ఒక అధ్యయనంలో తేలింది. దీన్ని మన రెగ్యులర్ డైట్లో చేర్చుకోవడంతోపాటు, షుగర్ బాధితులు దాల్చిన చెక్క టీని తీసుకోవచ్చు. అలాగే దాల్చిన చెక్క నీరు లేదా టీ స్థూలకాయాన్ని తగ్గిస్తుంది. ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మెంతి గింజలు చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి ఉపయోగం.ఒక టీస్పూన్ మెంతి గింజలను ఒక గ్లాసు నీటిలో నానబెట్టి రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు వడకట్టి ఈ నీటిని తాగాలి. లేదా ఆ మెంతులతో పాటు తీసుకున్నా మంచిదే. మనం రోజు పోపు దినుసులా వాడే జీలకర్ర కూడా సుగర్ లెవల్స్‌ను, కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో జీలకర్ర నీటిని తీసుకోవచ్చు. సోంపులో ఉండే అనిథాల్ శరీరంలోని అనేక ఇన్ఫ్లమేటరీ ఏజెంట్లను నివారిస్తుంది. సోపు గింజల్లో ఆరోగ్యకరమైన ఎంజైమ్‌లు మధుమేహ బాధితులకు మేలు చేస్తాయి. -
షుగర్, అధికబరువుకు చెక్ చెప్పండిలా!
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019