breaking news
-
పైసా ఖర్చు లేకుండా ప్రపంచ స్థాయి నైపుణ్యాలు
సాక్షి, అమరావతి: ప్రపంచంలోనే అత్యుత్తమ, నాణ్యమైన విద్యను అందించడం.. విద్యార్థులు ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా ఆన్లైన్ కోర్సులు అందించడంలో ప్రపంచంలోనే దిగ్గజ ఎడ్యుటెక్ సంస్థ.. ఎడెక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఎడెక్స్ ద్వారా 260కిపైగా వరల్డ్ క్లాస్ వర్సిటీలు, కంటెంట్ పార్టనర్స్‌తో కలిసి 2వేలకు పైగా కోర్సులను ఉచితంగా అందుబాటులోకి తెచి్చంది. దీంతో పైసా ఖర్చు లేకుండా వీటిని అభ్యసిస్తున్న విద్యార్థులు సర్టీఫికేషన్ల సాధనలో రికార్డులు సృష్టిస్తున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ‘ఎడెక్స్’ కోర్సులు ప్రారంభించిన నెల రోజుల్లోనే ఏకంగా 1,03,956 సర్టీఫికేషన్లు సాధించి సత్తా చాటారు. దీంతో ఎడెక్స్ చరిత్రలోనే ఏపీ అతిపెద్ద సర్టిఫికేషన్ హబ్‌గా ఆవిర్భవించింది. ఏటా ప్రపంచవ్యాప్తంగా ఎడెక్స్ కేవలం 5 లక్షల సర్టీఫికేషన్లు మాత్రమే అందిస్తోంది. కానీ, రాష్ట్ర విద్యార్థులకు ఏడాదికి 12లక్షల సర్టీఫికేషన్లు ఇచ్చేలా ప్రభుత్వం ఎడెక్స్‌తో ఒప్పందం చేసుకోవడం విశేషం. 1,469 కోర్సుల్లో సర్టీఫికేషన్లు.. ఎడెక్స్ ద్వారా కోర్సులు అందిస్తున్నవాటిలో హార్వర్డ్, ఎంఐటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, కొలంబియా, న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఉన్నాయి. రాష్ట్ర విద్యార్థులు 100 ప్రపంచ స్థాయి వర్సిటీల నుంచి 1,469 రకాల కోర్సుల్లో లక్షకుపైగా సర్టీఫికేషన్లు సాధించారు. ఎంఐటీ 320, హార్వర్డ్ 1,560, గూగుల్ 410, ఐబీఎం 33,700, ఏడబ్ల్యూఎస్ 770, ఏఆర్ఎం 6,400, కొలంబియా వర్సిటీ 100, ఐఐఎం బెంగళూరు 1,957, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ 170, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ 700, స్టాన్‌ఫర్డ్ 2,200, ఫుల్ బ్రిడ్జి (హార్వర్డ్, ఎంఐటీ సంయుక్తంగా అందిస్తున్న కోర్సులు)ద్వారా 13,500 సర్టిఫికేషన్లు పొందారు. ఉన్నత విద్యా మండలి ఒక ఎడెక్స్ కోర్సును తప్పనిసరి సబ్జెక్టుగా చదివేలా కరిక్యులంలో చేర్చింది. వీటికితోడు విద్యారి్థకి నచి్చనన్ని ఎడెక్స్ కోర్సులను వ్యాల్యూ యాడెడ్‌గా చదువుకోవడానికి వీలు కలి్పస్తోంది. సులభంగా ప్రవేశాలు.. ఎడెక్స్ ద్వారా మైక్రో మాస్టర్స్ కోర్సులో 7 వేల మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. దీన్ని పూర్తి చేస్తే విదేశాల్లో ఎంఎస్‌లో చేరడం సులువవుతుంది. పైగా అక్కడికి వెళ్లాక సిలబస్‌లో ప్రస్తుతం ఎడెక్స్‌లో నేర్చుకున్న గ్రూప్ మాడ్యూల్స్‌ను మినహాయిస్తారు. తద్వారా విద్యారి్థకి ఎంఎస్‌లో చదవాల్సింది తగ్గడంతో పాటు సంబంధిత కోర్సుకు చెల్లించాల్సిన ఫీజు కూడా ఆదా అవుతుంది. రూ.382 కోట్లు వ్యయమయ్యే కోర్సులు ఉచితంగా.. ఇప్పటి వరకు 3 లక్షల మంది విద్యార్థులు, బోధన సిబ్బంది ఎడెక్స్ కోర్సులకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరందరూ ఎడెక్స్ అందించే 2 వేల కోర్సుల్లో ఒక్కో కోర్సు చొప్పున బయట చదువుకుంటే మార్కెట్ రేటు ప్రకారం ఏకంగా రూ.382 కోట్లు వ్యయమవుతుంది. ఇప్పటివరకు సుమారు 75వేల మందికిపైగా విద్యార్థులు ఆయా కోర్సులు పూర్తి చేసి 1,03,956 సర్టిఫికేషన్లు పొందారు. ఈ కోర్సుల మార్కెట్ విలువ రూ.115 కోట్ల వరకు ఉంది. ఇంత ఖరీదైన కోర్సులను విద్యార్థులపై నయాపైసా భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తోంది. మన వర్సిటీల్లోకి అంతర్జాతీయ స్థాయి విద్య అంతర్జాతీయ స్థాయి విద్యను మన వర్సిటీల్లోకి తేవాలన్నదే మా లక్ష్యం. అందుకే ఎడెక్స్‌తో ఒప్పందం చేసుకున్నాం. ప్రపంచంలో టాప్ 50లో ఉన్న 37 వర్సిటీలు ఇందులో కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి. దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఎడెక్స్ ద్వారా అంతర్జాతీయ కోర్సులు అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ ఒక్కటే. ప్రపంచంలో అత్యుత్తమ అధ్యాపకులతో మన విద్యార్థులకు బోధన అందిస్తున్నాం. – కె.హేమచంద్రారెడ్డి, చైర్మన్, ఉన్నత విద్యా మండలి 32 కోర్సుల్లో సర్టీఫికేషన్లు.. మాది మదనపల్లె. అమ్మా కూరగాయలు అమ్ముతూ, నాన్న ఆటో నడుపుతూ నన్ను, తమ్ముడిని చదివిస్తున్నారు. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన సాయంతో ఇంజనీరింగ్ చదువుతున్నా. నేను ఎడెక్స్ ద్వారా ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా సంస్థలు అందిస్తున్న 32 రకాల కోర్సులు పూర్తి చేశాను. డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఏఐ వంటి కోర్సుల్లో అడ్వాన్స్డ్ మెథడ్స్ నేర్చుకున్నాను. హార్వర్డ్, ఐబీఎం, గూగుల్ వంటి సంస్థల నుంచి సర్టీఫికేషన్లు పొందాను. ఈ కోర్సులు బయట చేయాలంటే వేల రూపాయలు పెట్టాలి. ఎడెక్స్ కోర్సులతో నాలాంటి పేద విద్యార్థులకు పెద్ద సంస్థల్లో మంచి ఉద్యోగాలు దక్కుతాయనే నమ్మకం ఉంది. – టి.మోక్షిత్ సాయి, బీటెక్ , శ్రీ వేంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, చిత్తూరు కర్టీన్ వర్సిటీ నుంచి సర్టిఫికేషన్.. మాది నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం గోవిందిన్నె గ్రామం. అమ్మ చిరుద్యోగి. నాన్న కూలి పనులకు వెళ్తారు. మా అన్నను, నన్ను జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు ఆదుకున్నాయి. నేను నంద్యాలలో రాజీవ్‌గాంధీ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాను. ఎడెక్స్‌లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ)లో మైక్రో మాస్టర్స్ గ్రూప్ కోర్సు చేశాను. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 182వ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాలోని కర్టీన్ వర్సిటీ నుంచి సర్టిఫికేషన్ సాధించాను. – దూలం చందు, బీటెక్ (ఈఈఈ) స్పెయిన్ వర్సిటీ నుంచి ఐవోటీ చేశా.. నేను ఉచితంగా ఎడెక్స్ ద్వారా ప్రపంచంలోనే అడ్వాన్స్డ్ కోర్సులు నేర్చుకుంటున్నా. స్పెయిన్‌కు చెందిన ‘వాలెన్సియా పాలిటెక్నిక్ విశ్వవిద్యాలయం’ నుంచి ఐవోటీలో మైక్రో మాస్టర్స్ కోర్సు పూర్తి చేశాను. మరో రెండు కోర్సులను కూడా త్వరలో పూర్తి చేయబోతున్నా. సొంతంగా డబ్బులు ఖర్చుపెట్టి చదవలేని నాలాంటి వారందరికీ ఎడెక్స్ కోర్సులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. – అర్వా నాగ సుజిత, బీటెక్ (ఈఈఈ), రాజీవ్‌గాంధీ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నంద్యాల -
‘గ్యాప్’ పంటలకు ధరహాసం
సాక్షి, అమరావతి: మంచి వ్యవసాయ పద్ధతులు (గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్–గ్యాప్) సర్టిఫికేషన్ రైతులకు రెట్టింపు కంటే ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటిస్తూ పండించిన పంటలకు మార్కెట్లో ప్రీమియం ధర లభిస్తోంది. పంట ఉత్పత్తుల్ని నచ్చినచోట నచ్చిన వారికి అమ్ముకునే వెసులుబాటు లభించడంతో రైతుల ఆనందం అవధులు దాటుతోంది. నాణ్యమైన ధ్రువీకరణ వ్యవస్థ ఏర్పాటు సమగ్ర పంట నిర్వహణ పద్ధతుల్ని పాటించడం ద్వారా సాగు వ్యయాన్ని నియంత్రిస్తూ నాణ్యమైన ఉత్పాదకతను పెంచాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లుగా కృషి చేస్తోంది. ఇందుకోసం పొలం బడులు, తోట బడులæను నిర్వహిస్తూ ఉత్తమ యాజమాన్య పద్ధతుల్ని రైతుల ముంగిటకు చేరుస్తోంది. ఫలితంగా సాగు వ్యయం 6 నుంచి 17 శాతం ఆదా అవుతుండగా.. దిగుబడులు 9 నుంచి 20 శాతం పెరిగి రైతులకు గణనీయమైన ఆదాయాన్ని ఇస్తోంది. పంట ఉత్పత్తుల నాణ్యతను ధ్రువీకరించేందుకు వీలుగా దేశంలోనే తొలిసారి రాష్ట్ర ప్రభుత్వం ఏపీ స్టేట్ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీకి అనుబంధంగా ఏపీ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీని ఏర్పాటు చేసింది. తొలి దశలో పొలం బడులు, తోట బడుల ద్వారా నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్న రైతులకు గ్యాప్ సర్టిఫికేషన్, రెండో దశలో సేంద్రియ సాగు పద్ధతుల్లో పండించే ఉత్పత్తులకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ జారీ చేయాలని సంకల్పించింది. క్వాలిటీ కౌన్సిల్ గుర్తింపుతో గ్యాప్ సర్టిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న అవగాహనా ఒప్పందం మేరకు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ) ఏపీ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీకి ఇండి గ్యాప్ సర్టిఫికేషన్ జారీ చేసేందుకు వీలుగా దేశంలోనే తొలి అక్రిడిటేషన్ జారీ చేసింది. సర్టిఫికేషన్ పొందేందుకు సాగులో అనుసరించాల్సిన పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు మండల వ్యవసాయ అధికారులను టెక్నికల్ అడ్వైజర్లుగా, వ్యవసాయ, ఉద్యాన సహాయకులను ఫీల్డ్ ఆఫీసర్లుగా, తనిఖీలు చేసేందుకు అగ్రికల్చర్ డిప్లమో చేసిన వారిని ఇంటర్నెల్ ఇన్‌స్పెక్టర్స్‌గా ప్రభుత్వం నియమించింది. సర్టిఫికేషన్ జారీ కోసం అనుసరించాల్సిన పద్ధతులపై అధికారులు, సిబ్బందికి రైతులు పాటించాల్సిన ప్రమాణాలపై ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో), భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) సౌజన్యంతో శిక్షణ ఇచ్చారు. క్వింటాల్‌కు రూ.7,500 లభించింది రెండెకరాల్లో వేరుశనగ సాగు చేశా. మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి తగిన మోతాదులో ఎరువులు వినియోగించాను. ఒకే ఒక్కసారి పురుగు మందులు పిచికారీ చేశాను. ఎకరాకు రూ.19,400 పెట్టుబడి అయ్యింది. రెండెకరాలకు 14 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. గ్యాప్ సర్టిఫికేషన్‌తో వేరుశనగ క్వింటాల్‌కు రూ.7,500 చొప్పున ధర లభించింది. పెట్టుబడి పోగా రూ.66 వేల నికర ఆదాయం వచ్చింది. – బి.రామ్మోహన్, ఎం.వేముల, అన్నమయ్య జిల్లా నంద్యాల జిల్లా డోన్ మండలం ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన ఎస్.లక్ష్మీదేవి నాలుగేళ్లుగా పొలంబడుల ద్వారా ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటిస్తూ నాణ్యమైన పంటల్ని పండిస్తోంది. ఖరీఫ్–2023 సీజన్లో రెండెకరాల్లో కొర్రలు సాగు చేసింది. ఇండి గ్యాప్ సర్టిఫికేషన్ కోసం శాస్త్రవేత్తలు, అధికారులు సూచించిన మేలైన యాజమాన్య పద్ధతుల్ని పాటించింది. వర్షాభావ పరిస్థితుల ప్రభావం వల్ల ఎకరాకు 4 క్వింటాళ్ల చొప్పున మాత్రమే దిగుబడులొచ్చాయి. కానీ.. ఈమె గ్యాప్ సర్టిఫికేషన్ పొందటం వల్ల క్వింటాల్ కొర్రలకు రూ.7 వేలకు పైగా ధర లభించిందని సంతోషంతో చెబుతోంది. ఇప్పటికే 1,673 మంది రైతులకు లబ్ధి ఖరీఫ్ సీజన్లో జిల్లాకు 250 ఎకరాల చొప్పున 20 జిల్లాలో గ్యాప్ క్లస్టర్స్ ఎంపిక చేశారు. ఆయా క్లస్టర్లలో 990 ఎకరాల్లో వరి, కొర్రలు, రాగులు, వేరుశనగ వంటి వ్యవసాయ.. 2,534 ఎకరాల్లో మామిడి, అరటి, పసుపు, మిరప, కూరగాయల వంటి ఉద్యాన పంటలను గుర్తించారు. 1,673 మంది రైతులతో రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేశారు. ఇండిగ్యాప్ సరి్టఫికేషన్కు అనుసరించాల్సిన విధి విధానాలు, ఆహార ప్రమాణాలపై కృషి గ్యాప్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఎంపిక చేసిన రైతులకు శిక్షణ ఇచ్చారు. నాణ్యత పర్యవేక్షణకు సాంకేతిక బృందం ద్వారా దశల వారీగా తనిఖీలు, అంతర్గత ఆడిట్ నిర్వహించారు. సేకరించిన నమూనాలను పరీక్షించి పురుగు మందుల అవశేషాల గరిష్ట పరిమితికి లోబడి ఉన్నట్టుగా నిర్ధారించిన పంట ఉత్పత్తులకు ఇండి గ్యాప్ సర్టిఫికేషన్ జారీ చేశారు. సర్టిఫికేషన్ పొందిన రైతులు వారి పంట ఉత్పత్తులను మార్కెట్ ధరల కంటే మిన్నగా ప్రీమియం ధరకు విక్రయించుకుని అదనపు ఆదాయాన్ని ఆర్జించగలిగారు. గ్యాప్ సర్టిఫికేషన్‌తో వ్యాపారులూ పోటీపడి రైతు క్షేత్రాల నుంచే కొనుగోలు చేయడంతో కోతకొచ్చిన పంట ఉత్పత్తులను కనీస మద్దతు ధరల కంటే అధిక ధరలకు రైతులు అమ్ముకోగలిగారు. కొర్రలకు మద్దతు ధర రూ.2,500 ఉండగా.. గ్యాప్ సర్టిఫికేషన్ పొందిన రైతులు క్వింటాల్ కొర్రల్ని ధర రూ.7 వేలకు అమ్ముకోగలిగారు. వరి ధాన్యానికి మద్దతు ధర రూ.2,203 కాగా.. రైతులు రూ.4 వేలకు పైగా పొందగలిగారు. వేరుశనగ మద్దతు ధర రూ.5,850 ఉండగా.. గ్యాప్ సర్టిఫికేషన్‌తో రూ.8,300కు పైగా ధర లభించింది. రాగుల మద్దతు ధర క్వింటాల్‌కు రూ.3,846 ఉండగా.. సర్టిఫికేషన్ పొందిన రైతులు క్వింటాల్‌కు రూ.5 వేలకు పైగా ధర పొందగలిగారు. -
పంట ఏదైనా.. మూడింతల ఆదాయం
సాక్షి, అమరావతి: అన్నదాత కల ఫలిస్తోంది. నచ్చిన చోట.. నచ్చిన వారికి.. నచ్చిన ధరకు పంటల్ని అమ్ముకునే వెసులుబాటు కలుగుతోంది. పండించిన పంటకు ప్రీమియం ధర దక్కుతుండటంతో రైతుల ఆనందానికి అవధుల్లేవు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో జారీ చేస్తున్న గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ (గ్యాప్) సర్టిఫికేషన్‌తో రైతుల తలరాత మారుతోంది. సర్టిఫికెట్స్ జారీ చేసే కార్యక్రమాన్ని ఈ నెల 18వ తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లి నుంచి శ్రీకారం చుట్టనున్నారు. ఇన్నాళ్లూ ధ్రువీకరించే వ్యవస్థ లేక సాగు విధానాలను బట్టి పంట ఉత్పత్తులను ధ్రువీకరించే వ్యవస్థ లేకపోవడం వల్ల అంతర్జాతీయంగా మంచి ధర ఉన్నప్పటికీ అత్యధిక వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులను దేశీయంగానే విక్రయించు కోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితికి చెక్ పెట్టాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఏపీ స్టేట్ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీకి అనుబంధంగా ఏపీ స్టేట్ సేంద్రియ సర్టిఫికేషన్ అథారిటీ (ఏపీ ఎస్‌వోపీసీఏ)ని ఏర్పాటు చేసింది. తొలి దశలో పొలం బడులు, తోట బడుల ద్వారా నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్న రైతులకు గ్యాప్ సర్టిఫికేషన్ జారీ చేయాలని, రెండో దశలో పూర్తిగా సేంద్రియ సాగు పద్ధతుల్లో పండించే ఉత్పత్తులకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ జారీ చేయాలని సంకల్పించింది. క్యూసీఐ గుర్తింపుతో.. ఇండో గ్యాప్ సర్టిఫికేషన్ జారీ కోసం ఏపీ ఎస్వోపీసీఏకు ఇటీవలే క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ) అక్రిడిటేషన్ జారీ చేసింది. దీంతో దేశంలోనే గ్యాప్ సర్టిఫికేషన్ పొందిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. మలిదశలో ఆర్గానిక్ సర్టిఫికేషన్ కోసం ఎపెడా (ప్రొసెస్ చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ) నుంచి అక్రిడిటేషన్ పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సర్టిఫికేషన్ జారీపై ఎంపిక చేసిన అధికారులు, రైతులకు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో),భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) సౌజన్యంతో వివిధ స్థాయిల్లో విడతల వారీగా శిక్షణ ఇచ్చారు. సర్టిఫికేషన్ పొందేందుకు పంటల సాగులో అనుసరించాల్సిన పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు మండల వ్యవసాయ అధికారులను టెక్నికల్ అడ్వైజర్లుగా.. వ్యవసాయ, ఉద్యాన సహాయకులను ఫీల్డ్ ఆఫీసర్లుగా.. తనిఖీలు చేసేందుకు అగ్రికల్చర్ డిప్లమో చేసిన వార్ని ఇంటర్నెల్ ఇన్‌స్పెక్టర్స్‌గా నియమించారు. నంద్యాల జిల్లా ఎర్రగుంట్లకు చెందిన ఈ రైతు పేరు కురాకుల ఓబులేసు. రెండెకరాల్లో కొర్రలు సాగు చేశాడు. గ్యాప్ సర్టిఫికేషన్ కోసం గుర్తించిన క్లస్టర్లో ఆయన పొలం కూడా ఉంది. పొలం బడిలో చెప్పినట్టుగా తగిన మోతాదులో ఎరువులు వినియోగించాడు. ఒక్కసారి మాత్రమే పురుగుల మందు పిచికారీ చేశాడు. మొత్తంగా ఎకరాకు రూ.4,500 పెట్టుబడి అయ్యింది. 8 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పంట చేతికొచ్చాక పురుగు మందుల అవశేషాల పరీక్ష చేయించాడు. ఎలాంటి పురుగు మందుల అవశేషాలు లేవని ల్యాబ్‌లో నిర్ధారించి సర్టిఫికెట్ ఇచ్చారు. కొర్రలు కనీస మద్దతు ధర రూ.2.500 ఉండగా.. ఈ సర్టిఫికేషన్ వల్ల క్వింటా రూ.7వేలకు అమ్ముకోగలిగాడు. పెట్టుబడి రూ.9 వేలు పోగా.. నికరంగా రూ.47 వేల ఆదాయం వచ్చింది. ఓబులేసు మాట్లాడుతూ.. ‘గతంలో పంటల్ని కనీస మద్దతు ధరకు కూడా కొనేవారు కాదు. ఈ ఏడాది గ్యాప్ సర్టిఫికేషన్ వల్ల మంచి ఆదాయం వచ్చింది’ అంటూ ఆనందంగా చెప్పాడు. ఎమ్మెస్పీ కంటే రెండింతల ఆదాయం.. నంద్యాల జిల్లా డోన్ మండలం ఎర్రగుంట్లలో ఎంపిక చేసిన రెండు క్లస్టర్స్‌లో 49 మంది రైతులు 63 ఎకరాల్లో కొర్రలు సాగు చేశారు. సాధారణంగా ఎకరాకు 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఖరీఫ్‌లో నెలకొన్న బెట్ట పరిస్థితుల కారణంగా ఎకరాకు 4 క్వింటాళ్ల చొప్పున 252 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. గతంలో ఎకరాకు రూ.6 వేల నుంచి రూ.8 వేలు ఖర్చయ్యేది. ప్రస్తుతం రూ.4,500 నుంచి రూ.5 వేల పెట్టుబడి అయ్యింది. ప్రభుత్వం నిర్ధేశించిన ఎమ్మెస్పీ క్వింటాకు రూ.2,500 కాగా.. రైతులు క్వింటాకు రూ.2,900 నుంచి రూ.4,500 చొప్పున అదనంగా లబ్ధి పొందగలిగారు. 33 మంది రైతులు క్వింటా రూ.5,400 చొప్పున 161 క్వింటాళ్లను, ఏడుగురు రైతులు క్వింటా రూ.6 వేల చొప్పున 43 క్వింటాళ్లు, ఐదుగురు రైతులు క్వింటా రూ.6,300 చొప్పున 28 క్వింటాళ్లు, ఓ రైతు క్వింటా రూ.7 వేల చొప్పున 6 క్వింటాళ్లను విక్రయించారు. ఇలా ఎమ్మెస్పీ కంటే అదనంగా రూ.7.51 లక్షల ఆదాయాన్ని పొందారు. సర్టిఫికేషన్‌తో వ్యాపారులు సైతం పోటీపడి రైతు క్షేత్రాల నుంచే కొనుగోలు చేయడంతో కోత కొచ్చిన కొర్రలను రైతులు ఎమ్మెస్పీకి రెండింతల ధరకు అమ్ముకోగలిగారు. 0.1 శాతం కంటే తక్కువ అవశేషాలు నాలుగేళ్లుగా వైఎస్సార్ పొలం బడులను ప్రామాణికంగా తీసుకుని గడచిన ఖరీఫ్ సీజన్లో జిల్లాకు 250 ఎకరాల చొప్పున 20 జిల్లాల్లో ‘గ్యాప్ క్లస్టర్స్’ను ఎంపిక చేశారు. ఈ క్లస్టర్లో గ్యాప్ సర్టిఫికేషన్ జారీ కోసం 1,487.47 ఎకరాల్లో వరి, కొర్రలు, రాగులు, వేరుశనగ, మిరప, అరటి, పసుపు, కూరగాయ పంటలను గుర్తించారు. వ్యవసాయ పంటలు సాగు చేసే 622 మంది రైతులతో 20, ఉద్యాన పంటలు సాగు చేసే 190 మందితో 13 ఎఫ్‌పీవోలను ఏర్పాటు చేసి గ్యాప్ సర్టిఫికేషన్ కోసం ఏపీ ఎస్‌ఓపీసీఏ వద్ద రిజిస్ట్రేషన్ చేయించారు. గడచిన ఖరీఫ్ సీజన్ నుంచే గ్యాప్ సర్టిఫికేషన్ జారీకి శ్రీకారం చుట్టారు. ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకు తగిన మోతాదులో ఎరువులు, పురుగు మందులు వినియోగించేలా అవగాహన కల్పించారు. వివిధ దశల్లో రైతు క్షేత్రాల నుంచి శాంపిల్స్ తీసి పరీక్షించారు. పురుగు మందుల అవశేషాల స్థాయి 0.1శాతం కంటే తక్కువగా ఉన్నాయని గుర్తించారు. 99.99 శాతం ఆర్గానిక్ ఉత్పత్తులుగా గుర్తిస్తూ వారికి సర్టిఫికేషన్ జారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. మలి దశలో రైతులను మార్కెటింగ్ ఏజెన్సీలు, ఎగుమతిదారులతో అనుసంధానం చేస్తారు. ఈ సర్టిఫికేషన్స్‌తో వారు పండించే ఉత్పత్తులకు మార్కెట్లో ప్రీమియం ధర లభించడంతోపాటు అంతర్జాతీయంగా ఎగుమతి చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా సర్టిఫికేషన్ జారీ గ్యాప్ సర్టిఫికేషన్ జారీ కోసం ఏపీ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీకి క్యూసీఐ అక్రిడిటేషన్ జారీ చేసింది. సర్టిఫికేషన్‌తో మన రైతులు అంతర్జాతీయంగా పోటీపడే అవకాశం ఏర్పడింది. గడచిన ఖరీఫ్‌లో 1,487 ఎకరాల్లో 812 మంది రైతులకు గ్యాప్ సర్టిఫికేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సర్టిఫికేషన్ జారీ కార్యక్రమం ఈ నెల 18వ తేదీన అధికారికంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. – త్రివిక్రమ్‌రెడ్డి, ఎండీ, ఏపీ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ -
టెక్కీలకు గుడ్‌న్యూస్: ఏఐలో ఉచిత సర్టిఫికేషన్.. డేటా సైన్స్ కోర్సు కూడా..
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తమ ఇన్ఫోసిస్ స్ప్రింగ్‌బోర్డ్ వర్చువల్ లెర్నింగ్ ప్లాట్‌ఫాంపై కృత్రిమ మేథలో (ఏఐ) సర్టిఫికేషన్ కోసం ఉచిత శిక్షణ అందించనున్నట్లు తెలిపింది. ఏఐ, జెనరేటివ్ ఏఐలో నైపుణ్యాలను పెంపొందించేలా ఇందులో కోర్సులు ఉంటాయి. అలాగే, పైథాన్ ప్రోగ్రామింగ్, లీనియర్ ఆల్జీబ్రా సహా డేటా సైన్స్‌కి సంబంధించిన వివిధ అంశాలతో సిటిజెన్స్ డేటా సైన్స్ కోర్సు కూడా ఉంటుంది. కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన వారికి సరి్టఫికెట్ లభిస్తుంది. ఇన్ఫోసిస్ ఏఐ–ఫస్ట్ స్పెషలిస్టులు, డేటా స్ట్రాటెజిస్టులు ఈ బోధనాంశాలను రూపొందించారు. -
ఆర్గానిక్ బ్రాండ్‌తో అరకు కాఫీకి.. అంతర్జాతీయ క్రేజ్
సాక్షి, అమరావతి : అంతర్జాతీయ మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్న అరకు వ్యాలీ కాఫీకి ఆర్గానిక్ బ్రాండ్ మరింత క్రేజ్ తేనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు పండించే అరకు వ్యాలీ కాఫీ, మిరియాలకు సేంద్రియ ధ్రువపత్రం(ఆర్గానిక్ సర్టిఫికేషన్) లభించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆదీనంలోని వ్యవసాయ, ఆహారోత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ(అపెడా) ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీంతో ఏపీ గిరిజన సహకార సంస్థ(జీసీసీ) నాలుగేళ్లుగా చేస్తున్న కృషి ఫలించింది. దీనివల్ల గిరిజన రైతులు పండించిన కాఫీ, మిరియాలకు అంతర్జాతీయ మార్కెట్లో మరింత మంచి ధరలు దక్కనున్నాయి. ఫలించిన నాలుగేళ్ల కృషి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి డివిజన్ పరిధిలోని గొందిపాకలు, లంబసింగి, కప్పాలు క్లస్టర్లలో 1,300 మంది గిరిజన రైతులు 2184.76 ఎకరాల్లో పండిస్తున్న కాఫీ, మిరియాలకు సేంద్రియ ధ్రువపత్రం సాధించడం కోసం నాలుగేళ్లుగా కృషి జరిగింది. తొలుత గొందిపాకలు గ్రామానికి చెందిన రైతులు సేంద్రియ సాగులో ముందున్నారు. గ్రామంలోని రైతులంతా కలసి గిరిజన గ్రామ స్వరాజ్య సంఘంగా ఏర్పడి సేంద్రియ సాగుకు శ్రీకారం చుట్టారు. ఎరువులు వేయకుండా సేంద్రియ పద్ధతుల్లోనే కాఫీ, అంతర పంటగా మిరియాలను పండిస్తున్నారు. గొందిపాకలుతో పాటు లంబసింగి, కప్పలు గ్రామాల్లో రైతులతోనూ సమావేశాలు నిర్వహించిన జీసీసీ సేంద్రియ సాగును ప్రోత్సహించింది. దీంతో మూడేళ్లుగా క్రమం తప్పకుండా స్కోప్ సర్టిఫికెట్ వచ్చేలా జీసీసీ కృషి చేసింది. మూడేళ్లపాటు దీనిపై సునిశిత అధ్యయనం పూర్తికావడంతో నాల్గో ఏడాది సేంద్రియ సాగు ధ్రువపత్రం జారీకి అపెడా ఆమోదం తెలిపింది. దీంతో తొలి విడతలో చింతపల్లి మండలంలోని 2,184.76 ఎకరాల్లో కాఫీ సాగు చేస్తున్న దాదాపు 1,300 మంది గిరిజన రైతులకు సేంద్రియ ధ్రువపత్రాలు అందించనున్నారు. ఇదే తరహాలో జీకే వీధి, పెదవలస, యెర్రచెరువులు క్లస్టర్లలో మరో 1,300 మంది రైతులు సుమారు 3,393.78 ఎకరాల్లో పండిస్తున్న కాఫీ, మిరియాలు పంటలకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. వచ్చే ఏడాది జనవరి నాటికి వాటికీ సేంద్రియ ధ్రువపత్రాల జారీ ప్రక్రియను ప్రారంభించనున్నారు. కాగా, ఒక పంటకు సేంద్రియ ధ్రువపత్రం సాధించడం అంత తేలిక కాదు. ఇందుకు పెద్ద కసరత్తే ఉంటుంది. థర్డ్ పార్టీ వెరిఫికేషన్, ప్రతి విషయం ఆన్లైన్ వెరిఫికేషన్, ఆన్లైన్ అప్డేషన్, ప్రతి రైతు వ్యవసాయ క్షేత్రం జియో ట్యాగింగ్, వాటన్నింటినీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం వంటివి ఏ మాత్రం ఏమరుపాటు లేకుండా నిర్వహించాలి. వీటన్నిటినీ జీసీసీ అధికారులు సకాలంలో విజయవంతంగా పూర్తిచేశారు. మరో మైలురాయి సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో జీసీసీ సమర్థంగా సేవలందిస్తోంది. ఇప్పటికే సేంద్రియ బ్రాండింగ్‌తో నాణ్యమైన పసుపు, తేనెను టీటీడీకీ సరఫరాచేస్తున్నా. తాజాగా నాలుగేళ్ల కృషి ఫలించడంతో కాఫీ, మిరియాల సాగుకు సేంద్రియ సాగు ధ్రువపత్రం దక్కడం జీసీసీ చరిత్రలో మరో మైలురాయి. ఇది సాధించినందుకు గర్వంగా ఉంది. – శోభ స్వాతిరాణి, చైర్పర్సన్, గిరిజన సహకార సంస్థ
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019