breaking news
-
శరణ్ది మా ఊరే.. కావాలనే చీటింగ్ కేసు : బెల్లంకొండ సురేశ్
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేశ్, అతని తనయుడు, హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై చీటింగ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. సినిమా తీయడానికి డబ్బులు అవసరమంటూ తన దగ్గర నుంచి రూ.85 లక్షలు తీసుకుని ఇప్పటికీ తిరిగి ఇవ్వడం లేదంటూ బంజారాహిల్స్‌కు చెందిన శరణ్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు.ప్రస్తుతం ఈ ఇష్యూ టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చీటింగ్ కేసుపై బెల్లంకొండ సురేశ్ స్పందించారు. తనను, తన ఫ్యామిలీని ఇబ్బంది పెట్టేందుకు కొంత మంది పన్నిన కుట్రలో భాగంగా చీటింగ కేసు నమోదైందని ఆయన ఆరోపించారు. శరణ్ తనకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెలిపారు. ‘కొంతమంది కావాలనే నాపై, నా కొడుకుపై కుట్ర చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. శరణ్ నాకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. డబ్బులు ఇచ్చినట్టు సాక్ష్యాలు ఉంటే పోలీసులకు ఇవ్వాలి. శరణ్‌తో కలిసి కొంతమంది వ్యక్తులు కుట్ర పన్నారు . నాకు డబ్బులు ఇచ్చినట్టు సాక్ష్యాలు బయటకు పెట్టక పోతే పరువునష్ట దావా వేస్తా .బెల్లంకొండ ఫ్యామిలీ ఎదుగుదల చూడలేకనే కేసులు పెడ్తున్నారు. శరణ్ ను లీగల్ గా ఎదుర్కొంటా. నాకు కోర్టు నుండి కాని సీసీఎస్ నుండి ఎలాంటి నోటీసులు రాలేదు. నా పై ఆరోపణలు చేసిన వ్యక్తికే నోటీసులు ఇచ్చారు.నా పై చేసిన ఆరోపణల పై ఆధారాలు ఉంటే ఇవ్వాలని శరణ్ కు నోటీసులు ఇచ్చారు. శరణ్ది మా ఊరే. పదేళ్ల క్రితం పరిచయమయ్యాడు. సినిమా టికెట్ల కోసం అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు బ్లాక్ మెయిల్ ల్లో భాగంగానే ఇలా నాపై ఆరోపణలు చేస్తున్నాడు. అనవసరంగా నా కొడుకు పేరును బ్లేమ్ చేస్తున్నాడు. అతన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు’అని బెల్లంకొండ అన్నారు. -
బెల్లంకొండ తమ్ముడి దూకుడు...సెట్స్‌పై మరో మూవీ
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడు, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు గణేశ్ హీరోగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు సినిమాలు (పవన్ సాధినేని, లక్ష్మణ దర్శకత్వాల్లో సినిమాలు ఆన్సెట్స్లో ఉన్నాయి) కమిట్ అయిన ఈ యువ హీరో తాజాగా తన మూడో చిత్రానికి సోమవారం కొబ్బరికాయ కొట్టారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవంలో ముహూర్తపు సన్నివేశానికి హీరో ‘అల్లరి’ నరేశ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత ‘దిల్’ రాజు క్లాప్ ఇచ్చారు. ప్రముఖ దర్శకులు తేజ శిష్యుడు రాకేశ్ ఉప్పలపాటి ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఎస్.వి2 ఎంటర్టైన్మెంట్ పతాకంపై ‘నాంది’ ఫేమ్ నిర్మాత సతీష్ వర్మ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే నెల ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కృష్ణచైతన్య కథ, మాటలు, పాటలు అందిస్తున్నారు. చదవండి : హీరోగా దిల్‌రాజు తమ్ముడి కొడుకు..ఫస్ట్‌లుక్ రిలీజ్ నేను ప్రేమలో పడిపోయా : జగపతి బాబు -
ఎవరా స్టార్ హీరో? సస్పెన్స్ వీడేదెన్నడు?
-
ఎవరా స్టార్ హీరో? సస్పెన్స్ వీడేదెన్నడు?
అల్లుడు శీను సినిమాతో ప్రేక్షకులందరికీ దగ్గరైపోదామనుకున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ సినిమా బాగానే ఆడటంతో తొలి సినిమాతోనే విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడని ప్రశంసించారంతా! తర్వాత ఎలాంటి సినిమా చేయబోతున్నాడా? అని అందరూ వెయిట్ చేశారు. రెండేళ్ల గ్యాప్ తర్వాత స్పీడున్నోడు సినిమాతో వచ్చి బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడ్డాడు. దీంతో ప్రేమ కథలను పక్కన పెట్టి సస్పెన్స్ థ్రిల్లర్ రూట్ ఎంచుకున్నాడు. అలా రమేశ్ వర్మ దర్శకత్వంలో రాక్షసుడు సినిమా చేశాడు. 2019లో వచ్చిన ఈ చిత్రం బెల్లంకొండ హీరోకు సక్సెస్‌ను రుచి చూపించింది. -
రేపే ‘ఛత్రపతి’ రీమేక్ స్టార్ట్, ముఖ్య అతిథిగా రాజమౌళి
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం ఛత్రపతి హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. 2005లో విడుదలైన ఈ మూవీ సంచలన విజయం సాధించింది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీ ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వివి వినాయక్ హిందీలో రీమేక్ చేస్తున్నాడు. పెన్ స్టూడియోస్ బ్యానర్లో తెరకెక్కునున్న ఈ మూవీ శుక్రవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమౌళి హజరుకానుండటం విశేషం. ఇక త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. ఈ మూవీ కోసం శ్రీనివాస్ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి మరింత ఫిట్‌గా అయ్యాడు. మాస్ లుక్‌తో బెల్లంకొండ మరి హిందీ ఆడియన్స్ మెప్పిస్తాడో లేదో చూడాలి.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019