breaking news
-
షాకింగ్! ఏకంగా 10 అనకొండలతో వచ్చాడు.. చివరికి..!
బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో షాకింగ్ ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 ఎల్లో అనకొండలను అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబట్టాడు.నిందితుడిని అరెస్టు చేసిన కస్టమ్స్ అధికారులు తదుపరి దర్యాప్తు మొదలు పెట్టారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఒక ప్రయాణీకుడు చెక్-ఇన్ బ్యాగ్‌లో దాచిన 10 పసుపు రంగు అనకొడలను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించాడు. ఒక సూట్ కేసులో ఒక తెల్లని కవర్లో వీటిని జాగ్రత్తగా ప్యాక్ చేశాడు. కానీ తనిఖీల్లో దొరికిపోయాడు. ప్యాసింజర్ బ్యాగ్‌లో ఏకంగా 10 పసుపు రంగు అనకొండల్ని చూసిన అధికారులూ షాకయ్యారు. బెంగళూరు కస్టమ్స్ ‘ఎక్స్’లో దీనికి సంబంధించిన ఫోటోలను అధికారులు పోస్ట్ చేశారు. వన్యప్రాణుల రవాణా చట్టవిరుద్ధమని, దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. (సమ్మర్లో పిల్లలకు ఇలా చేసి పెడితే, ఇష్టంగా తింటారు, బలం కూడా!) #Indiancustomsatwork Bengaluru Air #Customs intercepted attempt to smuggle 10 yellow Anacondas concealed in checked-in bag of a pax arriving from Bangkok. Pax arrested and investigation is underway. Wildlife trafficking will not be tolerated. #CITES #WildlifeProtection 🐍✈️ pic.twitter.com/2634Bxk1Hw — Bengaluru Customs (@blrcustoms) April 22, 2024 -
అనకొండకి చెందిన మరో జాతి! వెలుగులోకి షాకింగ్ విషయాలు
అనకొండనే ప్రపంచంలో అతిపెద్ద పాము జాతి అని అనుకున్నాం. అదే జాతికి చెందిని మరో జాతి అనకొండను ఈ క్వెడార్‌లో గుర్తించారు శాస్త్రవేత్తలు. ఎన్నో ఏళ్లుగా ఈ అనకొండకు సంబంధించి మరో జాతి గురించి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. శాస్త్రవేత్తల ఊహను నిజం చేస్తే మరో జాతి అనకొండ వాళ్ల కంటపడింది. ఇది 26 అడుగుల మరియు 200 కిలోల మేర బరువుంది. ఈ మేరకు శాస్త్రవేత్త విల్ స్మిత్‌ల బృందం రానున్న నాట్ జియాఓ సిరిస్ పోల్ టు పోల్ కోసం ఫోటో షూట్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈ క్కెడార్లోని అమెజాన్ నది అడుగు భాగంలో ఫోటోలు చిత్రిస్తుండగా ఈ అనకొండ కెమెరాకు చిక్కింది. ఆ సరికొత్త అనకొండను చూసి ఆశ్చర్యపోయిన శాస్త్రవేత్తలు ఇది ఇప్పటి వరకు చూసిన అనకొండ జాతులకు చెందిందా కాదా అనే దిశగా పరిశోధనలు చేశారు. దీన్ని చూసి ఇంతకుముందు కనిపెట్టిన ఆకుపచ్చ అనుకొండకు చెందిన మరోక జాతి ఏమో అనుకున్నారు. కానీ పరిశోధనలో వేర్వేరు జాతికి చెందినదని తేలింది. ఆక్కుపచ్చలో ఉండే అనకొండ జాతి ఎక్కువగా బ్రెటిజల్ , పెరూ, బొలీవియా, ఫ్రెంచ్ గయానాలలో నివశిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రస్తుతం గుర్తించిన ఈ కొత్తజాతి అనకొండ తొమ్మిది దక్షిణ అమెరికా దేశాలలో బోవా గ్రూప్ సేకరించిన మిగతా అనకొండాల రక్తం, కణజాల నమూనాలతో సరిపోలలేదన్నారు. ఇది అనకొండలో కొత్త జాతిని నిర్థారించారు. దీనికి జెయింట్ అనకొండగా నామకరణం చేశారు. ఈ అనకొండ మరింత ప్రమాదకరమైనదని అన్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. The world's largest snake has been discovered in the Amazon Rainforest: The Northern Green Anaconda measures 26 feet long and weighs 440 lbs - and its head is the same size as a human's. pic.twitter.com/XlaDk0qVYt — Denn Dunham (@DennD68) February 21, 2024 (చదవండి: శునకాల మధ్య పెరిగి ఆమె ఓ శునకంలా..ఇప్పటికీ..! మరో టార్జాన్, మోగ్లీ లాంటి కథ!) -
రాక్షస అనకొండ..అలా.. ఎలా సామీ: వైరల్ వీడియో
మామూలు పాము అంటేనే ఆమడ దూరం పారిపోతాం. ఇక అనకొండను చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. వన్య ప్రాణ సంరక్షణ కార్యకర్తలు, జూ సంరక్షకులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటారు. ఎంతటి క్రూర మృగాలైనా వాటిని మచ్చిక చేసుకుని, వాటితో స్నేహంగా ఉంటారు. కానీ ఒక భారీ అనకొండను నిర్భయంగా ఉత్తి చేతులతో అలా అలవోకగా, మేనేజ్ చేసిన వీడియో తాజాగా నెట్టింట్ సందడి చేస్తోంది. అతని అసాధారణ సాహసానికి, నైఫుణ్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దీంతో ఈ విడియో వైరల్‌గా మారింది. ఫ్లోరిడాలోని మియామికి చెందిన జూ కీపర్ మైక్ హోల్స్టన్ Instagramలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. తనను తాను ది రియల్ టార్జాన్, ది కింగ్ ఆఫ్ ది జంగిల్ అని చెప్పుకునే హోల్స్టన్ తరచుగా వన్యప్రాణులకు సంబంధించిన చాలా ఆసక్తికరమైన వీడియోలను చాలా షేర్ చేస్తూ ఉంటాడు. ఇది కూడా అలాంటిదే. నీటిలో దాగి వున్న ఈ భారీ అనకొండను జాగ్రత్తగా సమీపించి, మెల్లిగా వెళ్లి, చటుక్కున దాని తలను ఒడిసిపట్టుకోవడంతో ఈ వీడియో మొదలవుతుంది. సాధారణంగా అనకొండ ఎంత బలిష్టమైన వారినైనా తన పట్టుతో లొంగదీసుకుంటుంది. కానీ తన నైపుణ్యంతో బలీయమైన అనకొండను పట్టుకోవడం, దానిపై నియంత్రణ సాధించడం,చివర్లో దాని ముద్దు పుట్టుకోవడం విశేషంగా నిలిచింది. దీన్ని లొంగదీసుకున్న వైనం అందర్నీ షాక్‌కు గురిచేస్తుంది. ఈ వీడియోను ఆ సాంతం గుడ్లప్పగించి, ఉత్కంఠగా చూస్తారు. వాట్ యాన్ ఎక్స్పిడిషన్ వెనిజులాకు మాన్స్టర్ అనకొండను విజయవంతంగా పట్టుకున్నాం అనే క్యాప్షన్‌తో దీన్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 5 రోజుల క్రితం పోస్ట్ చేసిన ఈ వీడియో 11.2 మిలియన్లకు పైగా వ్యూస్‌లను సాధించింది. మూడు లక్షలకు కమెంట్లను సాధించింది. బహుశా ఈ గ్రహం మీద అత్యంత ధైర్యవంతుడు అంటూ కమెంట్లు వెల్లువెత్తాయి. View this post on Instagram A post shared by Mike Holston (@therealtarzann) Homie caught a huge anaconda! 👀 @therealtarzann Download the Topmixtapes app for Android to stay updated: https://t.co/vpyvPCzn45 Download the Topmixtapes app for iOS to stay updated: https://t.co/tk3g7a7reZ pic.twitter.com/1P7IH2YREb — TopMixtapes.com (@topmixtapescom) November 16, 2023 -
ఆ వందేళ్ల అనకొండకు సెలవులిచ్చి, ఎందుకు పంపిస్తున్నారంటే..
అనకొండ.. ఈ పేరు వినగానే మన మదిలో మనుషులను మింగివేసే అత్యంత భారీకాయం కలిగిన పాము కనిపిస్తుంది. దీనిని మనం తొలిసారి హాలీవుడ్ సినిమా ‘అనకొండ’లో చూసివుంటాం. అయితే మనం ఆ సినిమాలో చూసినది యానిమేషన్ అనకొండ. అయితే ఇప్పుడు మనం అలాంటి నిజమైన అనకొండ గురించి తెలుసుకోబోతున్నాం. వందేళ్ల వయసుగల ఆ అనకొండకు ఇప్పుడు సెలవులిచ్చి వేరే ప్రాంతానికి పంపిస్తున్నారు. ఆ వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అనకొండ ఎక్కడుందంటే.. ఈ అతిపెద్ద అనకొండ జర్మనీకి చెందిన ఫ్రాంక్‌ఫర్ట్‌లోని సెన్కెన్బర్గ్స్ నేచురల్ హిస్టరీ మ్యూజియంలో ఉంది. వందేళ్ల చరిత్ర కలిగిన ఈ మ్యూజియంలో ఒక అనకొండ కాపిబారా(జంతువు)ను మింగేస్తూ కనిపిస్తుంది. దానిని చూడగానే అది నిజమేనని అనిపిస్తుంది. మ్యూజియంలో మరమ్మతు పనులు జరుగుతున్నందున ఈ అనకొండకు కొంతకాలం సెలవులిచ్చారు. దానిని వేరే ప్రాంతానికి తరలిస్తున్నారు. An exhibit of an anaconda devouring a capybara at the Senckenberg Natural History Museum in Frankfurt is undergoing restoration. Taxidermists say climate change is one of the reasons why it needs a makeover pic.twitter.com/KM1LataPZL — Reuters (@Reuters) July 6, 2023 ఈ మ్యూజియంలో ఇంకా ఏమి ఉన్నాయంటే.. ఈ మ్యూజియంలో ఈ అనకొండ మాత్రమే కాదు, వివిధ రకాల జీవుల శిలాజాలు కనిపిస్తాయి. అలాగే ఈ మ్యూజియంలో రకరకాల డైనోసార్లు కూడా ఉన్నాయి. We will be next. #ExtinctionRebellion #DieIn under dinosaurs at the @Senckenberg Natural History Museum in #Frankfurt, during the #MuseumsNight #ndmffm. @ExtinctionR @ExtinctionR_DE pic.twitter.com/jIlP4MOzJ8 — JuliaKrohmer (@JuliaKrohmer) May 12, 2019 అనకొండలో రకాలివే.. అనకొండ ప్రధానంగా నాలుగు రకాలు. ఇందులో గ్రీన్ అనకొండ, బొలీవియన్ అనకొండ, డార్క్ స్పాటెడ్ అనకొండ ఎల్లో అనకొండ ప్రముఖమైనవి. వీటిలో గ్రీన్ అనకొండలు అతిపెద్దవి. పరిమాణంలో ఎంతో బరువైనవి. గ్రీన్ అనకొండలు ప్రధానంగా దక్షిణ అమెరికా ఖండం బ్రెజిల్, ఈక్వెడార్, పెరూ, కొలంబియా, వెనిజులా, సురినామ్, గయానా దేశాలలో కనిపిస్తాయి. మగ, ఆడ అనకొండల పొడవు విషయానికి వస్తే ఆడ అనకొండ.. మగ అనకొండ కంటే పొడవుగా ఉంటుంది. @jsnell @imyke my thought when you spoke of the snail and the pig on Upgrade. My favorite exhibit as a kid in the natural history museum in Frankfurt pic.twitter.com/TkhOGYLGJZ — Jenni Brehm (@Pfenya) May 13, 2018 ఇది కూడా చదవండి: శరవేగంగా రామాలయ నిర్మాణ పనులు.. -
అనకొండతో మొసలి జీవన పోరాటం.. వీడియో వైరల్
బ్రెసిలియా: అనకొండ పాములు భారీ ఆకారంతో పొడవుగా ఉంటాయి. పెద్ద పెద్ద జీవులను సైతం ఇట్టే మింగేస్తాయి. గ్రీన్ అనకొండలు సుమారు 30 అడుగుల మేర పెరుగుతాయి. సుమారు 550 పౌండ్ల బరువు ఉంటాయి. ఏదైనా జీవిని వేటాడేందుకు దానిని పూర్తిగా చుట్టేసి చంపేస్తాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఓ భారీ ఎలిగేటర్(మొసలి)ని భారీ అనకొండ బంధించింది. మొసలికి ఊపిరిసలపకుండా చేసి ఉక్కిరిబిక్కిరి చేసిన ఈ సంఘటన బ్రెజిల్లో జరిగింది. అనకొండ బారినుంచి తప్పించుకునేందుకు ఎలిగేటర్ చేసిన ప్రయత్నాన్ని ఇండియానాకు చెందిన కిమ్ సులివాన్ అనే వ్యక్తి తన కెమెరాలో బంధించారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు వైరల్‌గా మారాయి. కుయాబా నదిలో మొసలి, అనకొండలు పోరాడాయి. సుమారు 40 నిమిషాల పాటు వాటి పోరాటం సాగినట్లు కిమ్ తెలిపారు. పూర్తిగా చుట్టేయటం వల్ల ఎలిగేటర్ ఊపిరితీసుకునేందుకు ఇబ్బందులు పడింది. పాము నుంచి తప్పించుకునేందుకు మొసలి నీటి అడుగునకు వెళ్లిందని, దాంతో పాము గాలి తీసుకోలేకపోయిందని చెప్పారు. కొద్ది సమయం తర్వాత మొసలి బయటకు వచ్చిందని, అయినప్పటికీ అనకొండ వదలకుండా అలాగే పట్టినట్లు చెప్పారు కిమ్. దీంతో మరోసారి మొసలి నీటి అడుగుకు చేరుకుని కొన్ని నిమిషాల తర్వాత పైకి వచ్చినట్లు తెలిపారు. ఆ సమయంలో అనకొండ కనిపించలేదన్నారు. ఊపిరి పీల్చుకున్న మొసలి తన చోటుకు వెళ్లిపోయినట్లు చెప్పారు. ఈ వీడియోను ఆఫ్రికా వైల్డ్‌లైఫ్1 తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. View this post on Instagram A post shared by Wildlife | Africa | Lodges | Photography | Videography (@africanwildlife1) ఇదీ చదవండి: వీడియో: క్రేన్‌కు భారీ ‘రాకాసి’ చేప.. విలయం తప్పదంటూ వణుకుతున్న జనాలు
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019