
సాక్షి, సిటీబ్యూరో: ‘హలో ఎలా ఉన్నారు.. తెలుగు ప్రజలు’ అంటూ ప్రముఖ క్రికెటర్ హెన్రిచ్ క్లాసెన్ తెలుగు మాటలతో సందడి చేయగా.. మరో సన్‌రైజర్ హైదరాబాద్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి తెలుగులో ఎలా మాట్లాడాలో క్లాసెన్‌కు క్లాసెస్ చెప్పారు.

మంగళవారం కొండాపూర్‌లోని శరత్ సిటీ మాల్‌లో ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ ‘రాన్’లో సన్‌రైజర్స్ క్రికెటర్లు హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డితో పాటు అబ్దుల్ సమద్, జయదేవ్ ఉనద్కత్, నటరాజన్‌లు సందడి చేశారు.

ఈ సందర్భంగా తమ అనుభవాలను పంచుకున్నారు. బౌలింగ్ వేసే సమయంలో ముందస్తు చిట్కాల కన్నా అప్పటికప్పుడు సమయానుగుణంగా మార్చుకునే ప్లాన్స్ మంచి ఫలితాలిస్తాయని, తన బౌలింగ్‌లో ఈ నియమాన్నే పాటిస్తానని బౌలర్ జయదేవ్ ఉనద్కత్ తెలిపారు.

స్టార్ క్రికెటర్ల రాకతో మాల్ అంతా అభిమానులతో నిండిపోయింది.






కాగా.. బేగంపేట్‌లోని లైఫ్‌స్టైల్ బ్రాండ్ కళ్లద్దాల స్టోర్‌లో సన్‌రైజర్స్ కెపె్టన్ ప్యాట్ కమిన్స్ సందడి చేశారు. ‘కారెరా ఐవేర్’ను ఆవిష్కరించారు.



