
ఈజిప్ట్ ఫెన్సర్ నదా హాఫెజ్ ప్రిక్వార్టర్ ఫైనల్ వరకు వెళ్లడంతో సఫలమైంది

గతంలో రెండుసార్లు ఒలింపిక్స్ బరిలోకి దిగి విఫలమైన ఆమె తన మూడో ప్రయత్నంలో పారిస్ ఒలింపిక్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది

అయితే ఇందులో విశేషం ఏమీ లేదు. కానీ నదా ప్రస్తుతం ఏడు నెలల గర్భవతి!

ఇలాంటి స్థితిలో ఆమె ఫెన్సింగ్ సాబెర్ ఈవెంట్‌లో పోటీ పడింది

మెడిసిన్‌లో డిగ్రీ చదవడంతో పాటు జిమ్నాస్ట్ కూడా అయిన నదా ఆఫ్రికా క్రీడల్లో చాంపియన్

ఒలింపిక్స్ ప్రిక్వార్టర్స్‌లో ఓటమి తర్వాత ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది

‘నా కడుపులో ఒక చిన్న ఒలింపియన్ కూడా పెరుగుతోంది. నేను, నా పాప శారీరకంగా, మానసికంగా ఒకే రకమైన సవాల్‌ను ఎదుర్కొన్నాం

గర్భవతిగా ఉండి ఇలా ఆడటం చాలా కష్టమైన విషయం. అయితే జీవితాన్ని, ఆటను సమంగా చూడగలిగినందుకు నేను సంతోషంగా ఉన్నా

ప్రిక్వార్టర్స్ వరకు చేరడం పట్ల గర్వపడుతున్నా’ అని నదా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది

సంప్రదాయ క్రీడ కత్తిసాము ఆధునిక రూపం ఫెన్సింగ్

ఇద్దరు అథ్లెట్లు పరస్పరం తలపడుతూ తమను తాము రక్షించుకుంటూ.. ఎదుటివారిని టార్గెట్ చేస్తూ పాయింట్లు స్కోరు చేస్తారు

ఇందులో మూడు రకాలు ఉన్నాయి. ఫాయిల్, ఇపీ, సాబెర్. ఏథెన్స్ 1896 ఒలింపిక్స్ నుంచి ఫెన్సింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు

గత టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ నుంచి భవానీదేవీ పోటీపడింది





