
జైపూర్: సొంతగడ్డపై రాజస్తాన్ రాయల్స్ వరుసగా రెండో విజయాన్ని సాధించింది

టాపార్డర్ చేతులెత్తేసిన వేళ రియాన్ పరాగ్ (45 బంతుల్లో 84 నాటౌట్; 7 ఫోర్లు, 6 సిక్స్‌లు) ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లందరినీ చితగ్గొట్టాడు

దీంతో ఐపీఎల్ 17వ సీజన్‌లో మాజీ చాంపియన్ రాజస్తాన్ రాయల్స్ 12 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిచింది

టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది

‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రియాన్ పరాగ్


























