1/13
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత్‌కు ఊహించని షాక్ తగిలింది. స్వర్ణ పతక ఆశలు రేపిన మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్‌పై అనర్హత వేటు పడింది
2/13
అధిక బరువు కారణంగా ఆమెను అనర్హురాలిగా ప్రకటించినట్లు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తెలిపిందని వార్తా సంస్థ ANI ఎక్స్ వేదికగా వెల్లడించింది.
3/13
కాగా హర్యానాకు చెందిన వినేశ్ ఫొగట్ రీర్ ఆరంభం నుంచి 53 కేజీల కేటగిరీలోనే పోటీ పడింది. అయితే, తప్పనిసరి పరిస్థితుల్లో 50 కేజీల విభాగానికి మారాల్సి వచ్చింది.
4/13
రెజ్లింగ్‌లో ఇలా కేటగిరీ మారడం... అందులోనూ తక్కువ బరువుకు మారి రాణించడం అంత సులువు కాదు. అయినప్పటికీ ప్యారిస్‌లో అసాధారణ విజయాలతో వినేశ్ ఫైనల్ వరకు చేరింది.
5/13
ప్రిక్వార్టర్స్‌లో వరల్డ్ నంబర్ వన్, టోక్యో ఒలింపిక్స్ పసిడి పతక విజేత సుసాకీ(జపాన్)ని ఓడించిన వినేశ్.. క్వార్టర్ ఫైనల్లో ఉక్రెయిన్‌కు చెందిన ఒక్సానా లివాచ్‌పై గెలుపొందింది.
6/13
తద్వారా సెమీస్ చేరి.. అక్కడ 5–0తో పాన్ అమెరికన్ గేమ్స్ చాంపియన్ యుస్నెలిస్ గుజ్మాన్ లోపెజ్‌ను మట్టికరిపించింది.
7/13
ఫలితంగా భారత రెజ్లింగ్ చరిత్రలో తొలిసారి ఒలింపిక్స్ ఫైనల్ చేరిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది.
8/13
ఈరోజు రాత్రి పసిడి పతకం కోసం వినేశ్.. అమెరికాకు చెందిన సారా హిల్డెబ్రాంట్‌తో తలపడాల్సి ఉంది. అయితే, వినేశ్ ఉండాల్సిన బరువు కంటే 100 గ్రాములు అధికంగా ఉన్నట్లు తేలడంతో ఆమెపై వేటు పడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పతకానికి ఈ రెజ్లర్ దూరం కానుంది.
9/13
‘‘50 కేజీల విభాగంలో ఉన్న వినేశ్ ఫొగట్‌పై అనర్హత వేటు పడినట్లు తెలిపేందుకు చింతిస్తున్నాం. 50 కిలోల కంటే ఆమె కాస్త ఎక్కువ బరువే ఉన్నారని తేలింది.
10/13
రాత్రి నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఉదయం ఆమె ఉండవలసిని దాని కంటే అధిక బరువు ఉన్నారు కాబట్టి అనర్హత వేటు పడింది.
11/13
వినేశ్ గోప్యతకు భంగం కలగకుండా వ్యవహరించాలని కోరుకుంటున్నాం’’ అని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తెలిపింది.
12/13
‘‘వినేశ్ 50 కిలోల కంటే 100 గ్రాములు అధిక బరువు ఉన్నారు. ఫలితంగా నిబంధనల ప్రకారం.. ఆమె పోటీ నుంచి వైదొలగాల్సి ఉంటుంది’’ అని భారత కోచ్ ఒకరు పీటీఐతో వ్యాఖ్యానించారు.
13/13