

రోజర్ బిన్నీ- స్టువర్ట్ బిన్నీ(టీమిండియా) 1983లో వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టులో రోజర్ బిన్నీ సభ్యుడు కాగా.. 2015లో వరల్డ్‌కప్ ఆడిన టీమిండియాలో స్టువర్ట్ బిన్నీ కూడా ఉన్నాడు.

గాఫ్ మార్ష్- మిచెల్ మార్ష్- షాన్ మార్ష్(ఆస్ట్రేలియా) 1987 వరల్డ్‌కప్ జట్టులో గాఫ్ మార్ష్ సభ్యుడు. అతడి కుమారులు మిచెల్ 2015, షాన్ 2019లో వరల్డ్‌కప్ ఆడారు.

కెవిన్ కరన్- టామ్ కరన్- సామ్ కరన్(ఇంగ్లండ్) కెవిన్ 1983, 1987 వరల్డ్‌కప్ జట్టులో సభ్యుడు అతడి కుమారులు టామ్ 2019, సామ్ 2023 ప్రపంచకప్ టోర్నీలు ఆడారు.

క్రిస్ బ్రాడ్- స్టువర్ట్ బ్రాడ్(ఇంగ్లండ్) క్రిస్ బ్రాడ్ 1987 వరల్డ్‌కప్‌ఆడాడు అతడి కుమారుడు స్టువర్ట్ బ్రాడ్ 2007, 2011, 2015 వరల్డ్‌కప్ జట్లలో భాగమయ్యాడు.

రాడ్ లాథమ్- టామ్ లాథమ్(న్యూజిలాండ్) 1992లో వరల్డ్‌కప్ ఆడాడు రాడ్ లాథమ్. అతడి కుమారుడు టామ్ 2015, 2019, 2023 వరల్డ్‌కప్ ఈవెంట్లలో పాల్గొన్నాడు.

టిమ్ డీ లీడె- బాస్ డీ లీడె(నెదర్లాండ్స్) టిమ్ డీ లీడె 1996, 2003లో డచ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. అతడి కుమారుడు బాస్ డీ లీడె 2023లో ప్రపంచకప్ టోర్నీ ఆడాడు.