1/15
టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చహల్ సతీమణి ధనశ్రీ వర్మ మరోసారి వైరల్‌గా మారారు. పాకిస్తాన్‌పై భారత జట్టు విజయం నేపథ్యంలో ఆమె షేర్ చేసిన ఫొటో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
2/15
కాగా అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్-2024కు ఎంపికైన భారత జట్టులో చహల్‌కు చోటు దక్కిన విషయం తెలిసిందే.
3/15
దీంతో చాలాకాలం తర్వాత అతడు జాతీయ జట్టులో తిరిగి అడుగుపెట్టాడు.
4/15
అయితే, గ్రూప్ దశలో భాగంగా టీమిండియా ఆడిన తొలి రెండు మ్యాచ్‌లలో చహల్ బెంచ్‌కే పరిమితమయ్యాడు.
5/15
న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్, పాకిస్తాన్‌లతో మ్యాచ్‌ల నేపథ్యంలో తుదిజట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు. ఈ రెండు మ్యాచ్‌లలోనూ భారత జట్టు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లకే పెద్దపీట వేసింది.
6/15
అదే విధంగా ముగ్గురు స్పెషలిస్టు పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్‌లతో బరిలోకి దిగింది.ఇదిలా ఉంటే.. యజువేంద్ర చహల్‌తో పాటు అతడి భార్య, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ కూడా అమెరికా వెళ్లారు.
7/15
వీరితో పాటు మరికొంత మంది కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం న్యూయార్క్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది.
8/15
ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌పై టీమిండియా విజయం తర్వాత ధనశ్రీ వర్మ ఓ ఫొటో షేర్ చేశారు.
9/15
‘‘మనం గెలిచేశాం’’ అన్న క్యాప్షన్‌తో పంచుకున్న ఈ ఫొటోలో.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ధనశ్రీ విక్టరీ సింబల్ చూపుతూ కనిపించారు.
10/15
కాగా యూట్యూబర్, కొరియోగ్రాఫర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన ధనశ్రీ వర్మ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఈ క్రమంలో ఎన్నోసార్లు ఆమె ట్రోలింగ్ బారిన పడ్డారు.
11/15
ముఖ్యంగా టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్‌తో ఆమె పేరును ముడిపెట్టి దారుణంగా ట్రోల్ చేశారు కొంతమంది నెటిజన్లు.
12/15
కేవలం ఫేమ్ కోసమే చహల్‌ను ధనశ్రీ పెళ్లాడారని.. అతడికి అన్యాయం చేసేందుకు ఆమె ఏమాత్రం వెనుకాడంటూ వ్యక్తిత్వ హననం చేసేలా కామెంట్లు చేశారు.
13/15
విడాకులు కూడా తీసుకోబోతున్నారంటూ ప్రచారం చేశారు. అయితే, ఆ సమయంలో చహల్ భార్యకు అండగా నిలిచాడు.
14/15
ధనశ్రీ సైతం ట్రోల్స్‌కు గట్టిగానే బదులిచ్చి మానసికంగా తాను స్ట్రాంగ్ అని చెప్పకనే చెప్పారు.
15/15