
ప్రేమ ఎప్పుడు? ఎలా? పుడుతుందో ఎవరూ చెప్పలేరు. బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హ విషయంలోనూ ఇదే జరిగింది.

సోనాక్షి- జహీర్ ఇక్బాల్ ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మొదట వీరి ప్రేమకు హీరోయిన్ పేరెంట్స్ ఒప్పుకోవడం లేదని వార్తలు వచ్చాయి.

కారణం.. ఇద్దరూ విభిన్న వర్గానికి చెందినవారు! కూతురి ప్రేమ ముందు ఈ కోపతాపాలు అనవసరం అనిపించిందేమో.. చివరకు సోనాక్షి తండ్రి శతృఘ్న సిన్హ సరేనంటూ తలూపాడు.

జూన్ 23న సోనాక్షి- జహీర్ ఇక్బాల్ పెళ్లి జరిగింది. కుటుంబ సభ్యుల మధ్య వివాహం జరగ్గా బాలీవుడ్ సెలబ్రిటీల రాకతో రిసెప్షన్ గ్రాండ్‌గా జరిగింది. ఎర్రటి పట్టుచీర, నుదుటన సింధూరంతో సోనాక్షి మెరిసిపోయింది.

తన సంతోషాన్ని కొత్త జంట ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. మనసారా ఆశీర్వదించాల్సింది పోయి వధూవరులపై విషం కక్కుతున్నారు.

నోటికొచ్చినట్లు విమర్శిస్తున్నారు. శుభమా అని పెళ్లి చేసుకుంటే ఇంతలా ట్రోలింగ్ చేయడాన్ని తట్టుకోలేకపోయిన దంపతులు ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్ సెక్షన్ ఆఫ్ చేశారు.



