
అక్కినేని హీరో నాగచైతన్య.. హీరోయిన్ శోభితతో నిశ్చితార్థం చేసుకున్నాడు.

ఆగస్టు 8న కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ శుభకార్యం జరిగింది.

అంతకు ముందే మొదటి భార్య సమంత ఫొటోల్ని చాలావరకు చైతూ ఇన్ స్టాలో తొలగించాడు.

కానీ రేస్ ట్రాక్‌పై కారు పక్కన సమంతతో నిలబడి ఉన్న ఒక్క ఫొటోని మాత్రం అలానే ఉంచేశాడు.

ఈ క్రమంలోనే నెటిజన్లు తలో విధంగా మాట్లాడుకుంటున్నారు.

సమంతకు సంబంధించిన ఒక్క జ్ఞాపకాన్ని చైతూ మర్చిపోలేకపోతున్నాడని అంటున్నారు.

ఇదిలా ఉండగా 'ఏ మాయ చేశావె' మూవీతో చైతూ-సామ్ ఒకరికొకరు పరిచయం.

కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్నారు కానీ చైతూ-సమంత బయటపడలేదు.

2017లో పెద్దల అంగీకారంతో హిందు-క్రిస్టియన్ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు.

ఏమైందో ఏమో గానీ 2021 అక్టోబరు 2న విడాకులు తీసుకుంటున్నట్లు చై-సామ్ ప్రకటించారు.

దీంతో అభిమానుల గుండె బద్ధలయింది. ఎందుకు విడిపోయారా అని ఇప్పటికీ అనుకుంటున్నారు.














