
ప్రముఖ నటుడు డేనియల్ బాలాజీ(టీసీ బాలాజీ) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు

కోలీవుడ్, మాలీవుడ్‌తో పాటు తెలుగు సినిమాలతో అలరించిన డేనియల్ బాలాజీ వయసు 48 సంవత్సరాలు

బాలాజీ తండ్రి తెలుగు వ్యక్తి. తల్లి తమిళ కుటుంబం. చెన్నైలో బాలాజీ పుట్టారు. డేనియల్ బాలాజీ అవివాహితుడు. మేనమామ కన్నడ డైరెక్టర్ సిద్ధలింగయ్య. సిద్ధలింగయ్య 90లో అలరించిన తమిళ నటుడు మురళి తండ్రి. మురళి కొడుకు అధర్వ కోలీవుడ్‌లో యువహీరోగా రాణిస్తున్నాడు. అలా బాలాజీకి సినీ నేపథ్యం ఉంది

కమల్ హాసన్ ప్రతిష్టాత్మకంగా తీసిన మరుదనాయగం(రిలీజ్‌కు నోచుకోలేదు)కు యూనిట్ ప్రొడక్షన్ మేనేజర్‌గా డేనియల్ బాలాజీ వ్యవహరించారు. అయితే నటుడిగా ఆయన ప్రస్థానం మొదలైంది బుల్లితెరతోనే

రాధికా శరత్‌కుమార్ సొంత బ్యానర్‌లో నిర్మించి.. లీడ్ రోల్ చేసి పిన్ని(మాతృక చిత్తీ) సీరియల్‌తో డేనియల్ బాలాజీ యాక్టింగ్ కెరీర్ ప్రారంభించారు. అందులో ఆయన కేరక్టర్ పేరు డేనియల్. అలా ఆయన పేరు ముందర డేనియల్ వచ్చి చేరింది. ఆ తర్వాత మరో సీరియల్‌లోనూ నటించారు

తమిళంలో ఏప్రిల్ మాధతిల్(2002) ఆయన తొలి చిత్రం. గౌతమ్ మీనన్ డైరెక్షన్‌లో సూర్య హీరోగా వచ్చిన ‘కాకా కాకా’తో డేనియల్ బాలాజీకి గుర్తింపు దక్కింది. తెలుగులో వెంకటేష్ హీరోగా ఘర్షణగా రీమేక్. రీమేక్‌లోనూ బాలాజీ సేమ్ రోల్‌లో నటించారు

గౌతమ్ మీనన్ డైరెక్షన్‌లో కమల్ హాసన్ లీడ్ రోల్‌లో వచ్చిన వెట్టియాడు విలైయాడు(తెలుగులో రాఘవన్‌గా డబ్బింగ్)లో సైకో కిల్లర్‌గా అలరించారు బాలాజీ

కోలీవుడ్‌లో దాదాపుగా పాతిక చిత్రాల దాకా నటించిన డేనియల్ బాలాజీ.. విజయ్, అజిత్, శింబు, ధనుష్.. ఇలా దాదాపుగా అగ్రహీరోలకు ప్రతినాయకుడిగా నటించారు

తెలుగులో సాంబా, ఘర్షణ, చిరుత, సాహసం శ్వాసగా సాగిపో, టక్ జగదీష్‌లో నటించారు

మలయాళం, కన్నడలో పదిదాకా చిత్రాల్లో నటించారాయన. అందులో మోహన్‌లాల్, మమ్మూటీ, యశ్ లాంటి అగ్రతారల చిత్రాలు ఉన్నాయి
