
టాలీవుడ్‌లో హీరోయిన్లు చాలా తక్కువగా ఉంటారు. కానీ వారి పారితోషికం మాత్రం బాలీవుడ్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపపోని రేంజ్‌లు ఉంటుంది. తెలుగులో ఎవరెవరు ఎంతెంత తీసుకుంటున్నారో తెలుసుకుందాం.

రష్మిక మందన్నా: ఒక్కో సినిమాకు రూ.4 కోట్ల వరకు పారితోషికంగా తీసుకుంటుందట

సమంత: ప్రస్తుతం ఈమె ఒక్కో సినిమాకు రూ. 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటుంది

అనుష్క శెట్టి : ఒక్కో సినిమాకు రూ. 4 కోట్ల వరకు రెమ్యునరేషన్‌గా పుచ్చుకుంటుంది

పూజా హెగ్డే: ఈ బ్యూటీకీ తెలుగులో ఇప్పుడు అవకాశాలు తగ్గాయి కానీ.. మొన్నటి వరకు చేతి నిండా సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా కొనసాగింది. ఒక్కో సినిమాకు రూ. 3 కోట్ల వరకు పారితోషికం అందుకుంది.

శ్రీలీల: ఈ మధ్యకాలంలో బిజియెస్ట్ హీరోయిన్ ఎవరంటే అందరూ శ్రీలీల అనే చెబుతారు. స్మాల్ హీరోలతో పాటు స్టార్ హీరోలతో నటిస్తూ కెరీర్ పరంగా దూసుకెళ్తోంది. ఈ అమ్మడు ఒక్కో సినిమాకి రూ.1.5 కోట్ల వరకు డిమాండ్ చేస్తుందట

కీర్తీ సురేశ్: ఎలాంటి పాత్రలో అయినా ఒదిగేపోయే నటి కీర్తి సురేశ్. ఆ మధ్య భోళాశంకర్‌లో చిరంజీవికి చెల్లెలుగా నటించి మెప్పించింది. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో ఈ బ్యూటీకి తగిన గుర్తింపు రాలేదు. ప్రస్తుతం చేతిలో ఒక్క సినిమా లేదు. హిందీతో పాటు తమిళ్‌లోనూ సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ ‘మహానటి’ ఒక్కో సినిమాకు రూ. 2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంది

కాజల్ అగర్వాల్: ఒక్కో సినిమాకు రూ.2 కోట్లకు పైగానే పారితోషికం పుచ్చుకుంటుంది

తమన్నా: ఒక్కో సినిమాకు రూ. కోటి నుంచి కోటిన్నర వరకు తీసుకుంటుంది

కియారా అద్వాని: ఒక్కో సినిమాకు రూ. 3 కోట్లు

రకుల్ ప్రీత్‌సింగ్: కొండపొలం తర్వాత ఈ బ్యూటీ టాలీవుడ్‌లో మళ్లీ కనిపించలేదు. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో బాలీవుడ్‌కి వెళ్లడం..అక్కడ ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో ఈ బ్యూటీకి అవకాశాలు సన్నగిల్లాయి. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 70 లక్షల నుంచి రూ. కోటి వరకు తీసుకుంటుంది

సాయిపల్లవి: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఆచితూచి సినిమాలు చేస్తోంది. కథ నచ్చితే ఎలాంటి పాత్రలో అయిన నటించే అతికొద్ది మందిలో సాయి పల్లవి ఒకరు. ప్రస్తుతం ఈ బ్యూటీ ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల వరకు పారితోషికంగా అందుకోంటోంది

నిధి అగర్వాల్: ఒక్కో సినిమాకు కోటిరూపాయల చొప్పున తీసుకుంటుంది