
ప్రముఖ హీరోయిన్ ప్రణీత బేబీ షవర్ వేడుకలు చేసుకుంది.

బెంగళూరులోని బస్టైన్ గార్డెన్ సిటీలో ఇందుకు సంబంధించిన సెలబ్రేషన్స్ జరిగాయి.

ఈ క్రమంలోనే కొన్ని ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పటికే ఈమెకు పాప ఉండగా.. త్వరలో మరో బిడ్డ పుట్టనుంది.

కర్ణాటకకు చెందిన ప్రణీత సుభాష్.. 2010లో నటిగా కెరీర్ ప్రారంభించింది.

తెలుగులో అత్తారింటికి దారేది, రభస, బ్రహ్మోత్సవం తదితర సినిమాల్లో నటించింది.

మలయాళ, హిందీ చిత్రాల్లోనూ యాక్ట్ చేసింది. 2021లో నితిన్ రాజు అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత ఏడాదికే అర్న అనే అమ్మాయి పుట్టింది.

కొన్నాళ్ల క్రితం తాను మరోసారి ప్రెగ్నెంట్ అయినట్లు ప్రకటించింది.

ఎప్పటికప్పుడు తన బేబీ బంప్ ఫొటోల్ని పోస్ట్ చేస్తున్న ప్రణీత.. తాజాగా తనకు బేబీ షవర్ వేడుకలు చేసినట్లు పేర్కొంది.

అలానే ఇవి ఎప్పటికీ గుర్తుండిపోతాయని చెప్పుకొచ్చింది.

ఈ సెలబ్రేషన్స్ బట్టి చూస్తే మరికొన్నిరోజుల్లో ప్రణీత మరో బిడ్డకి జన్మనివ్వనుంది.

