
సినీప్రపంచంలో ఆస్కార్‌ను మించిన అవార్డు లేదు. ఒక్కసారైనా ఆ అవార్డు అందుకోవాలని కలలు కనేవారు ఎందరో.. కానీ అతికొద్దిమందికే ఆ అదృష్టం వరిస్తుంది. ఈ నెలలో 96వ ఆస్కార్ వేడుకలు జరగనున్నాయి. ఈసారి ఎక్కువ నామినేషన్లతో టాప్ 10లో ఉన్న చిత్రాలేంటో చూద్దాం..

ఓపెన్ హైమర్.. 13 నామినేషన్లతో ముందు వరుసలో ఉంది

పూర్‌థింగ్స్.. పదకొండు విభాగాల్లో నామినేషన్లు పొందింది

బార్బీ.. ఎనిమిది నామినేషన్లతో ఆస్కార్ రేసులో దిగింది

అనాటమీ ఆఫ్ ఎ ఫాల్.. ఐదు నామినేషన్లతో ఆస్కార్ వేటలో దూసుకుపోతోంది

పాస్ట్ లీవ్స్.. రెండు విభాగాల్లో నామినేషన్లు సొంతం చేసుకుంది

ది హోల్ట్ ఓవర్స్.. అయిదు విభాగాల్లో నామినేషన్లతో ముందుకు సాగుతోంది

అమెరికన్ ఫిక్షన్.. ఐదు విభాగాల్లో నామినేట్ అయింది

ది జోన్ ఆఫ్ ఇంట్రస్ట్.. ఐదు విభాగాల్లో నామినేషన్లు సొంతం చేసుకుంది

మాస్ట్రో.. ఏడు నామినేషన్లు దక్కించుకుంది

కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్.. పది విభాగాల్లో నామినేషన్స్ పొందింది