1/26
ప్రస్తుతం కమ్‌బ్యాక్ హీరోయిన్స్ హవా నడుస్తోంది. ఆ లిస్ట్‌లో ప్రియమణి మస్ట్! గ్లామర్ అండ్ పెర్‌ఫార్మెన్స్‌కి పర్యాయపదం ఆమె! సినీప్రియులు..
2/26
వెబ్ వీక్షకులకు సుపరిచితురాలు. కథానాయికగా ఒక వెలుగు వెలిగిన ఆమె ఇప్పుడు వెబ్‌స్క్రీన్ మీదా షైనింగ్ స్టారే! ప్రియమణి పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి బ్రీఫ్‌గా..
3/26
ప్రియమణి అసలు పేరు ప్రియా వాసుదేవన్ మణి అయ్యర్. అమె తండ్రి వాసుదేవన్ మణి అయ్యర్ .. బిజినెస్‌మేన్, తల్లి లతా మణి అయ్యర్.. జాతీయ స్థాయి మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి.
4/26
చదువుకునే రోజుల్లోనే ప్రియమణి పలు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ మోడల్‌గా మారింది. అలా ఆమె తమిళ దర్శకుడు భారతీరాజా దృష్టిలో పడింది. చిత్రసీమకు పరిచయం అయింది.
5/26
ఆమె కెరీర్ తమిళ చిత్రం ‘కంగలాల్ కైదు సెయి’ తో ప్రారంభమైనప్పటికీ, మొదట విడుదలైంది మాత్రం ‘ఎవరే అతగాడు’ అనే తెలుగు సినిమానే.
6/26
ఆ తర్వాత ‘సత్యం’ సినిమాతో మలయాళంలోనూ అడుగుపెట్టింది. చేసిన సినిమాలన్నీ విజయవంతమవడంతో టైట్ స్కెడ్యూల్స్‌తో బిజీ అయిపోయింది.
7/26
‘యమదొంగ’ , ‘శంభో శివ శంభో’, ‘రక్త చరిత్ర 2’, ‘రగడ’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంటే ‘క్షేత్రం’, ‘చారులత’ వంటి చిత్రాలతో నటిగా నిరూపించుకుంది.
8/26
‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లో షారుఖ్ ఖాన్‌తో ఒక పాటలో నటించి బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది.
9/26
కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే ఈవెంట్ ఆర్గనైజర్ ముస్తఫా రాజ్‌ని పెళ్లి చేసుకుంది. సినిమాల నుంచి కొన్నాళ్లు బ్రేక్ తీసుకుంది. తిరిగి రియాల్టీ షోస్, వెబ్ సిరీస్‌తో మళ్లీ ప్రేక్షకులకు దగ్గరైంది.
10/26
సెకండ్ ఇన్నింగ్స్‌లో దేశ వ్యాప్తంగా ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్‌ని పెంచిన సిరీస్ ‘ద ఫ్యామిలీ మేన్’.
11/26
ఆమె నటించిన వెబ్ మూవీస్ ‘భామా కలాపం’, ‘భామా కలాపం 2’ రెండూ ఆహాలో స్ట్రీమింగ్‌లో ఉన్నాయి.
12/26
పెళ్లి తరువాత నటనకు దూరంగా ఉండాలన్న ఆలోచన నాకు లేదు. భార్య వంటింటికే పరిమితమనే మనస్తత్వం నా భర్తకు లేదు. నన్ను చాలా సపోర్ట్ చేస్తారాయన! – ప్రియమణి.
13/26
14/26
15/26
16/26
17/26
18/26
19/26
20/26
21/26
22/26
23/26
24/26
25/26
26/26