

మిస్ టెక్సాస్ యూఎస్‌ఏగా ఆరియోన్నా వేర్ విజేత అయినా 71 ఏళ్ల మారిస్సా టీజో హైలెట్‌గా నిలిచింది

ఈ పోటీలో పాల్గొన్న అత్యంత వృద్ధ మహిళగా చరిత్ర సృష్టించింది మారిస్సా టీజో

ఈ వయసులో ఉత్సాహంగా పాల్గొనడమే గాక అందానికి వయసుతో సంబంధం లేదని చెప్పింది.

మహిళలు ఏ వయసులోనైనా ఎవర్ గ్రీన్‌గా ఉంటారని చెప్పేందుకు పాల్గొన్నట్లు టీజో చెప్పుకొచ్చింది.

ఇటీవలే అందాల పోటీల్లో వయోపరిమితి నిబంధనను తొలగించడంతో టీజోకి ఈ అవకాశం లభించింది.

ఈ నిబంధన మార్పులో వివాహితలు, గర్భణీ స్త్రీలు, పిల్లలు కలిగిన మహిళలు సైతం అందాల పోటీల్లో పాల్గొనవచ్చు.
















