
సమస్త జనులకు భూ కైలాసంగా, భూమండలానికి నాభిస్థానంగా పిలువబడుతున్న శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి

ఉత్సవాల్లో నాల్గవ రోజు మంగళవారం స్వామిఅమ్మవార్లకు రథోత్సవం నేత్రానందభరితంగా సాగింది

ముందుగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామిఅమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు

స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో ఉంచి ఊరేగింపుగా రథశాల వద్దకు తోడ్కొని వచ్చి రథంపై ఉంచారు

గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు రథోత్సవాన్ని నిర్వహించారు. కర్ణాటక జాంజ్, వీరగాసీ, కన్నడ జానపదడోలు, కోలాటం, చెక్కభజన ప్రదర్శన, బుట్టబొమ్మ లు, గొరవయ్యల నృత్యం, తప్పెట్లు, కొమ్ము వాయిద్యాలు, నందికోలు నృత్యాలు గ్రామోత్సవానికి మరింత వన్నెను తీసుకువచ్చాయి



















