బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా వేధించాడంటూ ఆరోపణలు చేసిన శేజల్ అనే యువతి.. ఈసారి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐని ఆశ్రయించింది. దుర్గం చిన్నయ్యపై ఫిర్యాదు చేసినా తెలంగాణ పోలీసులు పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఇప్పటికైనా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై కేసు నమోదు చేయాలని సీబీఐని కోరింది.