మెట్రోలో వెళ్లిన ప్రతిసారి టిక్‌ట్ తీసుకుని ప్లాట్‌ఫామ్‌లోకి ప్రవేశించేటప్పుడు... ప్రయాణం ముగిసిన తరువాత బయటకు వచ్చేటప్పుడు మీరూ ఇలాంటి గేట్‌లను దాటుకుని వచ్చి ఉంటారు. పెద్ద విశేషమేమీ లేకపోవచ్చు కానీ... వీడియోలో కనిపిస్తున్న మెట్రో రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకులు ఒకసారి ఆ మూడు ముక్కల గేట్‌ను తోస్తే చాలు... 0.2 వాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. అక్కడే ఏర్పాటు చేసిన బ్యాటరీలో స్టోర్ అయిపోతుంది. ఆశ్చర్యంగా ఉందా? ఆధునిక టెక్నాలజీ మహిమ. ఏటా సుమారు 150 కోట్ల మంది ప్రయాణీకులు ప్రయాణించే ప్యారిస్ మెట్రో వ్యవస్థలో ఇలాంటి హైటెక్నాలజీని ఏర్పాటు చేయడం ద్వారా 136 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చునని అంటోంది... ఇబెర్డ్‌రోలా. ప్యారిస్‌లోని మిరోమెన్సిల్ మెట్రోస్టేషన్‌లో దీన్ని రెండు రోజులపాటు పరీక్షించారు. సబ్‌వే లైన్ ఒకదాన్ని నడిపేందుకు ఈ విద్యుత్తు సరిపోతుందని అంచనా. అంతేకాదు.. ఏడాదికి 30 వేల టన్నుల కర్బన ఉద్గారాలను కూడా తగ్గించవచ్చు. ఫ్రెంచ్ ఇంజినీరింగ్ కాలేజీ జునియా విద్యార్థులు ఆ గేట్లు (టర్స్‌స్టైల్స్)ను డిజైన్ చేశారు. మొక్కజొన్నలోని పిండిపదార్థం, త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీలను ఉపయోగించి తయారు చేశారు. భలే ఐడియా కదూ???
ఇబెర్డ్‌రోలా, వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లు ఈ వీడియోను విడుదల చేశాయి
Video Credit: Iberdrola & WEF (Twitter)