మిర్యాలగూడ వన్ పోలీస్ స్టేషన్ రణరంగంగా మారింది. పోలీస్ స్టేషన్‌లోనే హిజ్రాలు రెచ్చిపోయారు. రెండు గ్రూప్‌లుగా విడిపోయి తీవ్రంగా కొట్టుకున్నారు. ఆధిపత్య పోరులో భాగంగా ఓ వర్గం హిజ్రాలు పోలీసులను ఆశ్రయించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మరో వర్గం స్టేషన్‌కు చేరుకుంది. రెండు వర్గాలు ఎదురెదురు పడటంతో తీవ్ర వాగ్వివాదం జరిగింది.