ఇప్పటివరకూ మనిషి గ్రహాంతర వాసిని ప్రత్యక్షంగా చూసింది లేదు.. మాట్లాడింది అంతకంటే లేదు. కానీ.. ఎప్పుడో.. రేప్పొద్దున అంటే భవిష్యత్తులో వారితో మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే...?? ఏం మాట్లాడతాం? ఎలా మాట్లాడతాం? తెలుగు, హిందీ, ఇంగ్లీషులు వారికి వస్తాయో రావో మనకు తెలియదు కదా! ఈ సమస్యను గుర్తించే కొందరు భాషా శాస్త్రవేత్తలు గ్రహాంతర వాసులను కలిస్తే మాట్లాడేందుక ఏకంగా ఆరు భాషలను సిద్ధం చేశారు. కిలికిలి భాష మాదిరే ఈ భాషలను కూడా ఉద్దేశపూర్వకంగా నిర్మించారు కాబట్టి వీటిని కన్‌స్ట్రక్టెడ్ లాంగ్వేజెస్ క్లుప్తంగా కాన్‌లాంగ్స్ అని పిలుస్తున్నారు.అందులో ఒకటి ‘ద్రిటోక్’.. ఈ భాషను ఎలా మాట్లాడతారో తెలుసుకోవాలంటే.. ఈ ఆడియో ఫైల్స్ వినండి.