breaking news
-
యూటర్న్ చంద్రబాబు బాగోతం ఇది
వలంటీర్లకు పది వేలు ఇస్తామని చంద్రబాబు చెప్పడం ద్వారా మన పాలన గొప్పగా ఉందని ఆయన సర్టిఫికెట్ ఇచ్చారు... ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్య.. రాష్ట్రం విధ్వంసం అయింది..జగన్ ఇంతకాలం ప్రజలకు కనిపించలేదు.. ఇప్పడు మళ్లీ జనంలోకి వస్తున్నారు. అది ఓట్ల మీద ప్రేమ.. జగన్‌ను ఎవరూ నమ్మవద్దు.. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగంలో ఒక భాగం ఐదుకోట్ల మందికి ఏ ఒక్క నాయకుడో సరిపోరు. మూడు పార్టీల బలమైన నాయకత్వం కావాలి.కేంద్ర సహకారం, చంద్రబాబు అనుభవం, జనసేన పోరాట శక్తి కావాలి..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన కొత్త విషయం పవన్ శక్తి, చంద్రబాబు యుక్తి ,మోదీ సంకల్పం ..టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి బలం.. బీజేపీ ఎపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్య ఈ నలుగురు కొద్ది రోజుల క్రితం తణుకు వద్ద జరిగిన సభలో చేసిన ప్రసంగాలను విశ్లేషించండి. జగన్ తాను ఐదేళ్ల పాలన సమయంలో చేసిన వివిధ అబివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను సాకల్యంగా వివరించడంతో పాటు, చంద్రబాబు వలంటీర్ల వ్యవస్థపై యూ టర్న్ తీసుకున్న తీరును సమర్ధంగా వివరించగలిగారు.అంతేకాక చంద్రబాబు 2014 లో ఎన్నికల సమయంలో ప్రకటించిన హామీలు, వాటిని అమలు చేయని వైనాన్ని విపులంగా ప్రజలకు తెలియచెప్పారు. జగన్ సభ ఒక ఖాళీ ప్రదేశంలో భారీ ఎత్తున జరిగితే, కూటమి సభ ఒక రోడ్డుమీద జరిపి జనం బాగా వచ్చారని సంతోషపడడం కూటమి నేతల వంతుగా మారింది. జగన్ ఎక్కడా ఎవరిని దూషించకుండా , ప్రత్యేకించి ఆయా నియోజకవర్గాలలో పోటీచేస్తున్న టీడీపీ ,ఇతర పార్టీల అభ్యర్దుల ప్రస్తావన తేకుండా ,తన పార్టీ అభ్యర్ధులను మాత్రం పరిచయం చేసి గెలిపించాలని కోరుతున్నారు. కాని కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఎక్కడకు వెళితే అక్కడ ఉన్న వైఎస్సార్సీపీ అభ్యర్ధిపై తీవ్రమైన విమర్శలు, అడ్డగోలు ఆరోపణలు చేసి ప్రజలను నమ్మించాలని యత్నించారు. జగన్ తన స్కీముల గురించి ప్రజలకు తెలియచెప్పి, తాను ప్రతి ఇంటికి మంచి చేశానని ధైర్యంగా చెబుతున్నారు. కాని చంద్రబాబు మాత్రం అలా చెప్పలేకపోతున్నారు.పైగా వలంటీర్ల వ్యవస్థపై ఆయన యుటర్న్ తీసుకోవడంతో తెలుగుదేశం పార్టీ పరువు పోయింది.ఇంతకాలం వలంటీర్లను బండబూతులు తిట్టిన టీడీపీ నేతలు తలలు పట్టుకుని కూర్చున్నారు. చంద్రబాబు మాదిరి ఎప్పటికప్పుడు నాలుక మడతపెట్టి మాట మార్చినట్లు ఎలా చేయాలో తెలియక సతమతమవుతున్నారు. వలంటీర్లు పెన్షన్ దారుల ఇళ్లకు వెళ్లకుండా చేసిన నేపద్యంలో టీడీపీకి అది పెద్ద ఇబ్బందిగా మారింది. దానిని జగన్ తన స్పీచ్‌లో క్యాష్ చేసుకుంటున్నారు. చంద్రబాబు తను కూడా అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగించి పదివేల వేతనం ఇస్తానని చెప్పడం ద్వారా తన పాలనకు సర్టిఫికెట్ ఇచ్చారని చెప్పి విపక్షనేతను డిఫెన్స్ లో పడేశారు. అయితే చంద్రబాబు చేసే వాగ్ధానాలు ప్రజలను మోసం చేయడానికే కాని, అమలు చేయడానికి కాదని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు తీసుకుని ప్రజలతో అవునని చెప్పించారు. ఉదాహరణకు రుణమాఫీ,నిరుద్యోగ భృతి వంటివాటిలో చంద్రబాబు మాట తప్పిన వైనాన్ని జగన్ తెలియచెప్పారు.అలాగే తన ప్రభుత్వంలో పోర్టుల నిర్మాణం, ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీలు, పరిశ్రమలకు పునాది పడుతున్న తీరు. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో గత మూడేళ్లుగా నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న వైనాన్ని జగన్ విరించారు. కాని అదే చంద్రబాబు,లేదా పవన్ కళ్యాణ్ లు తమ ప్రసంగాలలో ఎక్కడా స్పెసిఫిక్‌గా జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీములను విమర్శించలేకపోతున్నారు. పైగా వాటిని మరింతగా ఎక్కువ చేసి అమలు చేస్తామని చెప్పారు. మరి అలాంటప్పుడు రాష్ట్రం విధ్వంసం అయిందని ఆ నేతలు ఎలా చెబుతున్నారో అర్దం కాదు. మోడీ సంకల్పం ఉంది కనుక రాష్ట్రానికి ఉపయోగం అని అంటున్నారే తప్ప, కేంద్రం నుంచి ఏమి సాధిస్తామో చెప్పలేని దయనీయ స్థితి కూటమి నేతలకు ఏర్పడింది. ఉదాహరణకు ప్రత్యేక హోదా అంశాన్ని కూటమి నేతలు ప్రస్తావించలేకపోతున్నారు.ప్రత్యేక హోదా కాకుండా కేంద్రం నుంచి వీరు ఏమి సాధిస్తారో ఎవరికి వివరించలేకపోతున్నారు.రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రం డ్రామాలు ఆడుతుండడం, విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ మొదలైన వాటి గురించి వీరు ఒక్క ముక్క మాట్లాడడం లేదు. గతంలో చంద్రబాబు ప్రత్యేక హోదా కావాలని అన్నప్పుడు కేంద్ర నేతలతో పాటు బీజేపీ రాష్ట్ర నేత దగ్గుబాటి పురందేశ్వరి అది ముగిసిన అధ్యాయం అని అన్నారు. అందుకు చంద్రబాబు ఒప్పుకున్నట్లేనా?బీజేపీ ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్ లను తొలగిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. దీనిపై చంద్రబాబు అభిప్రాయం ఏమిటి? ఇలాంటివాటిపై అటు చంద్రబాబు కాని, ఇటు పవన్ కళ్యాణ్ కాని మాట్లాడకుండా ఉమ్మడి ఎజెండాతో ,ప్రజా మానిఫెస్టోతో ప్రజల ముందుకు వస్తున్నామని చెబితే ఎవరు నమ్ముతారు? అసలు ఉద్యోగాలే రాలేదని ఒకసారి, సచివాలయాలలో కొత్తగా వచ్చిన లక్షన్నర మంది ఉద్యోగుల గురించి మరోసారి చంద్రబాబు మాట్లాడుతారు. వీటిలో ఏది విద్వంసం,ఏది నాశనమో చెప్పలేరు.అప్పుల గురించి మాట్లాడతారు.రాష్ట్రం అప్పులపాలైతే సూపర్ సిక్స్ పేరుతో ఏడాదికి లక్షన్నర కోట్ల రూపాయలు కేవలం సంక్షేమ కార్యక్రమాలకు ఎలా చంద్రబాబు ఖర్చు చేస్తారో వివరించరు. జగన్ అమలు చేసిన అమ్మ ఒడిని తల్లికి వందనం పేరుతో ఎందరు పిల్లలు ఉంటే అందరికి పదిహేనువేల రూపాయల చొప్పున ఇస్తామని చంద్రబాబు హామీ ఇస్తుంటారు.అది ఎలా సాధ్యమో ఆయన చెప్పరు. ఆ పక్కనే ఉన్న పవన్ కళ్యాణ్,పురందేశ్వరిలు మాట్లాడరు.ఇవన్ని చూస్తుంటే వీళ్లకు ఒక ఎజెండా లేదు. ముగ్గురు కలిసి జనాన్ని ఎలా మభ్య పెట్టాలా అన్నదానపైనే దృష్టి పెడుతున్నట్లు అనిపిస్తుంది. అయితే జగన్ ను తిట్టడం, లేదంటే రాష్ట్రం విధ్వంసం అయిందని ఆరోపించడం,లేకుంటే జగన్ ఇచ్చిన స్కీములను మరింత ఎక్కువ ఇస్తామని బొల్లడం..జగన్ సభలకు, చంద్రబాబు సభలకు తేడా ఇంత స్పష్టంగా కనిపిస్తుంది.పురందేశ్వరి మాత్రం ఒక మాట చెప్పారు. పవర్ స్టార్ పవన్ శక్తి, చంద్రబాబు యుక్తి, మోడీ సంకల్పం రాష్ట్రానికి ఉపయోగపడతాయని అన్నారు. చంద్రబాబుదంతా కుయుక్తులేనని గతంలో ఈమె అన్నారు. ఇప్పుడేమో ఆ కుయుక్తే ఏమైనా తనకు ఎంపీ పదవి వచ్చేలా చేస్తుందేమోనన్న ఆశతో పురందేశ్వరి ఉన్నారు. పవన్ అయితే ఐదు కోట్ల మందికి ఒక్క నాయకుడు చాలడని అన్నారు. మూడుపార్టీల బలమైన నాయకత్వం కావాలి అని ఆయన చెబుతున్నారు. చంద్రబాబు అనుభవం, జనసేన పోరాట శక్తి కావాలట.కేంద్ర సహయం ఉండాలట. అంటే చంద్రబాబు ఒక్కడు ముఖ్యమంత్రిగా సరిపోడని పవన్ చెబుతున్నట్లే కదా! చంద్రబాబుకు అంత సామర్ధ్యం లేదనే కదా పవన్ ఉద్దేశం? అధికారం వచ్చాక ఈయన కూడా అందులో భాగస్వామి అవుతారా?అవ్వరా? ఎవరిమీద పోరాడుతారు?లేదంటే ఈయన బయట ఉండి మళ్లీ స్పీచ్ లు ఇస్తూ తిరుగుతారేమో తెలియదు.ఒకటి మాత్రం జనానికి చెప్పారు. రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం సరిపోదని చెబుతున్నారని అర్ధం అవుతుంది.రాష్ట్రం కొన ఊపిరితో ఉందట ఎన్డీఏ కూటమి ఆక్సిజన్ అట. అలాగైతే ఎపికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని మోడీతో ఎందుకు చెప్పించలేకపోయారు.ఆయన అసలు రాష్ట్రానికి ఒక్క వరం అయినా ఇచ్చి వెళ్తారా?కేవలం తన కేసులకోసం, కొన ఊపిరితో ఉన్నటీడీపీని బతికించుకోవడం కోసం పొత్తు పెట్టుకుని అదేదో రాష్ట్రం కోసం అని చెబితే జనం చెవిలో పూలు పెట్టుకుని వినే రోజులు కావివి. వైఎస్సార్సీపీ విధ్వంసం చేస్తోందనే పొత్తు పెట్టుకున్నామని పవన్ అంటున్నారు. ఏమి విధ్వంసమో ఈ మూడు పార్టీల నేతలు చెప్పలేకపోతున్నారు. ఏదో పిచ్చి,పిచ్చి ప్రకటనలు చేసి, సినిమా డైలాగులు మాట్లాడి జనాన్ని బురిడి కొట్టించాలన్న ఉద్దేశం వారిలో కనిపిస్తోంది.తమ పార్టీలను బతికించుకోవడానికి, తాము గెలవలేమన్న భయంతో ఈ మూడు పార్టీలు కలిశాయి తప్ప ఇంకొకటి కాదు. ఓట్లు చీలకూడదని ఎప్పుడైతే అన్నారో, అప్పుడే వీరంతా ఓటమిని అంగీకరించిన్లే అనుకోవాలి.వైఎస్సార్సీపీ వెంటిలేటర్ పై ఉందని అంటున్న చంద్రబాబు దానిని నిజమని నమ్మి ఉంటే ఒంటరిగా పోటీచేసి సవాలు విసిరేవారు. ఇలా అధికారం కోసం జనసేన, బీజేపీ వంటి చిన్నపార్టీలను కాళ్లావేళ్లపడి ఎందుకు బతిమలాడుకుంటారు.ఢిల్లీ వెళ్లి పరువు పోగొట్టుకుని మరీ బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటారు. జగన్ అడిగే ప్రశ్నలకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరిల వద్ద సమాధానం లేదు. అందుకే వీరు ఇలా సోది ప్రసంగాలు చేస్తూ ప్రచారం సాగిస్తున్నారనుకోవాలి. తాను గెలుస్తానన్న ధైర్యం ఉంది కనుక జగన్ ఒంటరిగా బరిలో దిగి ప్రత్యర్దులకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. ఏది ఏమైనా ఏపీ ప్రజలు ఈ కిచిడి కూటమి కావాలా? లేక జగన్ సాహసవంతమైన నాయకత్వం కావాలా? అన్నది తేల్చుకోవలసిన సమయం ఆసన్నమైంది. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
నేడు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇలా..
సాక్షి, అమరావతి : మేమంతా సిద్ధం 7వ రోజు బుధవారం (ఏప్రిల్ 3) షెడ్యూల్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం మంగళవారం విడుదల చేశారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ మంగళవారం రాత్రి బస చేసిన అమ్మగారిపల్లె ప్రాంతం నుంచి బుధవారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. సదుం, కల్లూరు, దామలచెరువు, తలుపులపల్లి మీదుగా తేనెపల్లి చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం రంగంపేట క్రాస్ మీదుగా మధ్యాహ్నం 3 గంటలకు పూతలపట్టు బైపాస్కు చేరుకుంటారు. అనంతరం అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత పి.కొత్తకోట, పాకాల క్రాస్, గదంకి, పనపాకం, ముంగిలిపట్టు, మామండూరు, ఐతేపల్లి క్రాస్, చంద్రగిరి క్రాస్, రేణిగుంట మీదుగా గురువరాజుపల్లె రాత్రి బసకు చేరుకుంటారు. అన్నమయ్య జిల్లా సిద్ధమా? మేమంతా సిద్ధమంటూ బస్సుయాత్రకి ఆరవ రోజు అన్నమయ్య జిల్లా సిద్ధమా? అంటూ మంగళవారం సీఎం జగన్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మేమంతా సిద్ధమంటూ బస్సుయాత్రలో ముఖ్యమంత్రితో పాటు జనప్రభంజనం కదం తొక్కి ముందుకు సాగింది. –సాక్షి,అమరావతి -
YSRCP.. జయహో ‘బీసీ’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత 58 నెలలుగా సమాజానికి వెన్నెముకగా బీసీలను తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వారికి 48 శాసనసభ, 11 లోక్‌సభ స్థానాలు వెరసి మొత్తం 59 స్థానాలు కేటాయించి వారికి పెద్దపీట వేశారు. తద్వారా తన భవిష్యత్తు ప్రణాళికను కూడా ఆయన సుస్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 294 శాసనసభ, 48 లోక్‌సభ స్థానాలు ఉన్నప్పుడు కూడా ఈ స్థాయిలో బీసీలకు ఎవరూ అవకాశం ఇచ్చిన దాఖలాల్లేవు. ఉత్తరప్రదేశ్‌లో బీసీ నేత అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూడా సీఎం జగన్ ఇచ్చిన రీతిలో బీసీలకు అవకాశం ఇవ్వలేదని.. దేశ చరిత్రలో ఇదో రికార్డు అని సామాజికవేత్తలు ప్రశంసిస్తున్నారు. నిజానికి.. రాష్ట్ర విభజనకు ముందు 2012, జూలై 9న ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌లో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీనీ ఆయన అధికారంలోకి వచ్చాక అమలుచేయకుండా తమను వంచించారని బీసీలు రగలిపోతున్నారు. అదే వైఎస్ జగన్ గత ఎన్నికలకు ముందు 2019, ఫిబ్రవరి 17న ఏలూరులో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌లో తమకు చెప్పిన దానికంటే అధికంగా చేస్తుండడంపై బీసీలు హర్షాతిరేకాలు వ్యక్తంచేస్తున్నారు. దీంతో ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు చంద్రబాబును ఛీకొట్టగా.. బీసీలు కూడా తమను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అక్కున చేర్చుకున్న సీఎం జగన్‌కు జేజేలు పలుకుతున్నారు. భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్ల సిద్ధం సభలకు తరలివచ్చిన జనసందోహం ఇందుకు నిదర్శనమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలు వైఎస్సార్సీపీ వెంట నడుస్తుండటంతో వచ్చే ఎన్నికల్లో వార్ వన్‌సైడేనని వారు స్పష్టంచేస్తున్నారు. మొత్తం మీద శాసనసభ, లోక్‌సభ స్థానాలు కలిపి గత ఎన్నికల కంటే ఇప్పుడు అదనంగా 11 స్థానాలను సీఎం జగన్ తమకు కేటాయించడంపై వారు హర్షం వ్యక్తంచేస్తున్నారు. అవమానించి, అవహేళన చేసిన బాబు.. నిజానికి.. రాష్ట్ర విభజనకు ముందు 2012, జూలై 9న చంద్రబాబు బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించారు. 2014 ఎన్నికల్లో 100 అసెంబ్లీ స్థానాల్లో టికెట్లు ఇస్తామని.. బీసీ సబ్‌ప్లాన్ ద్వారా ఏటా రూ.పది వేల కోట్లు చొప్పున కేటాయిస్తామని.. చేనేత, పవర్‌లూమ్స్ రుణాలను మాఫీ చేస్తానని అందులో ప్రకటించారు. కానీ.. 2014 ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలోనే బీసీలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వారి సబ్‌ప్లాన్‌కు పాతరేశారు. అలాగే, ఐదేళ్లలో బీసీ సబ్‌ప్లాన్ ద్వారా రూ.50 వేల కోట్ల వరకు ఆ వర్గాల సంక్షేమం కోసం ఖర్చు చేస్తానని హామీ ఇచ్చి.. అందులో సగం కూడా ఖర్చుచేయలేదు. పైగా.. మంత్రివర్గంలో వారికి సముచిత స్థానం కల్పించని చంద్రబాబు.. 2014–19 మధ్య ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదు. అంతేకాక.. న్యాయమూర్తులుగా బీసీలు పనికిరారంటూ వారిని అవహేళన చేశారు. ఇచ్చిన హామీలు అమలుచేయాలని అడిగిన బీసీలను తాటతీస్తా.. తోకలు కత్తిరిస్తానంటూ బెదిరించి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో తమపై వల్లమాలిన ప్రేమను ఒలకబోస్తున్న చంద్రబాబు.. ఇప్పటిదాకా ఖరారు చేసిన 128 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 24 స్థానాలనే తమకు కేటాయించడంపై బీసీలు భగ్గుమంటున్నారు. ఇచ్చిన మాటకంటే అధికంగా.. ఇక గత ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించారు. అందులో వారికిచ్చిన మాట కంటే గత 58 నెలలుగా అధికంగానే న్యాయం చేశారు. ఉదా.. ► గత ఎన్నికల్లో 41 శాసనసభ స్థానాలు, ఏడు లోక్‌సభ స్థానాల్లో బీసీ వర్గాల అభ్యర్థులను బరిలోకి దించిన జగన్.. అధికారంలోకి వచ్చాక కేబినెట్లో ఆ వర్గాలకు చెందిన 11 మందికి మంత్రి పదవులిచ్చారు. ఒకరిని డిప్యూటీ సీఎంగా నియమించడంతోపాటు ప్రధానమైన రెవెన్యూ, విద్యా, పౌరసరఫరాలు, వైద్యం, ఆరోగ్యం లాంటి ప్రధానమైన శాఖలను ఆ వర్గాలకే అప్పగించి పరిపాలనలో వారికి సముచిత భాగస్వామ్యం కల్పించారు. శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారామ్‌కు అవకాశమిచ్చారు. ► ఈ వర్గాలకే చెందిన నలుగురిని రాజ్యసభకు పంపిన సీఎం జగన్ శాసనమండలిలో సైతం సింహభాగం పదవులు వారికే ఇచ్చారు. ► ఇక స్థానిక సంస్థల్లో వైఎస్సార్సీపీకి దక్కిన 13 జెడ్పీ చైర్మన్ పదవులకుగాను ఆరు బీసీలకే ఇచ్చారు. ► 84 మున్సిపల్ చైర్మన్ పదవులకుగానూ 44 వారికే కేటాయించారు. 14 కార్పొరేషన్ల మేయర్ పదవులకుగానూ తొమ్మిది బీసీలకే దక్కేలా చేశారు. ► అలాగే, నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు కేటాయించేలా ఏకంగా చట్టం చేసి మరీ ఇచ్చారు. ► మరోవైపు.. గత 58 నెలలుగా సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో రూ.1.23 లక్షల కోట్లు, నాన్ డీబీటీ రూపంలో రూ.50 వేల కోట్లు వెరసి రూ.1.73 లక్షల కోట్ల ప్రయోజనాన్ని బీసీలకు చేకూర్చారు. దీంతో.. రాజకీయ, ఆర్థిక, విద్యా, మహిళా సాధికారత ద్వారా బీసీలు సామాజిక సాధికారతను సాధించారు. -
విలన్ డెన్‌లో విదూషకుడు!
శంఖం మోగింది. యుద్ధం మొదలైంది. ఎన్నికల ప్రకటనకు కొన్ని గంటల ముందుగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను పూర్తిగా ప్రకటించింది. జాతీయ స్థాయిలోనే ఈ ఘనత సాధించిన మొదటి పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఒక్క అనకాపల్లి లోక్‌సభ అభ్యర్థిని మాత్రమే పెండింగ్‌లో పెట్టింది. ఈ దూకుడు వల్ల పోల్ పొజిషన్లో దానికి అడ్వాంటేజ్ దక్కినట్టే. విప్లవాత్మక ఆలోచనలతో మరో ఘనతను కూడా అది సొంతం చేసుకున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలున్నాయి. ఈ రెండొందల స్థానాల్లో వంద స్థానాలను బలహీనవర్గాలకు కేటాయించి రాజకీయ ప్రపంచాన్ని వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆశ్చర్యంలో ముంచెత్తారు. సామాజిక న్యాయం తమ నినాదం మాత్రమే కాదు, విధానం కూడానని ఆయన చేతల ద్వారా మరోసారి నిరూపించుకున్నారు. బీసీ వర్గాలకు 48 శాసనసభ స్థానాలు, 11 లోక్‌సభ స్థానాలను వైసీపీ కేటాయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 294 అసెంబ్లీ సీట్లు, 42 లోక్‌సభ సీట్లు ఉన్నప్పుడు కూడా బీసీలకు ఈ సంఖ్యలో సీట్ల కేటాయింపు ఎప్పుడూ జరగలేదు. బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాసని తరుచూ జగన్ మోహన్ రెడ్డి చెప్పే మాట. ఆ మాటను చేతల్లో చూపించారు. తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా తన కోటాలో ఉన్న 144 సీట్లలో 128 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అందులో 24 స్థానాలు మాత్రమే బీసీలకు దక్కాయి. ఆ పార్టీ కోటాలో ఇంకో 16 స్థానాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. జనసేన పోటీ చేసే 21 స్థానాల్లో ఏడుగురు అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించారు. ఇందులో ఒక్క బీసీకే చోటు దక్కింది. మిగిలిన పధ్నాలుగులో ఇదే నిష్పత్తి కొనసాగుతుందో, పెరుగుతుందో వేచిచూడాలి. బీజేపీకి కేటాయించిన 10 సీట్ల అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. కూటమి తరఫున ఇంకో నలభై సీట్లకు అభ్యర్థులను ఎంపిక చేయవలసి ఉన్నది. ఇందులో 23 స్థానాలను బీసీలకు కేటాయించగలిగితేనే వైసీపీ బీసీ స్కోర్‌ను అది చేరుకోగలుగుతుంది. బ్రహ్మాండం బద్దలైతే తప్ప అది సాధ్యమయ్యే పనికాదు. ముస్లిం మైనారిటీలకు వైసీపీ 7 అసెంబ్లీ సీట్లను కేటాయించింది. కూటమి తరఫున ఇప్పటికి ముగ్గురే ఎంపికయ్యారు. మిగిలిన 40లో నాలుగు స్థానాలు దక్కే అవకాశాలు మృగ్యం. ఏకంగా 11 లోక్‌సభ స్థానాలకు బీసీ అభ్యర్థులనే వైసీపీ ఎంపిక చేసింది. ఈ రికార్డును అందుకోవడం కూడా సాధ్యమయ్యే పని కాదు. కూటమి కట్టిన తర్వాత ప్రచారాన్ని పరుగెత్తించగల ఒక శుభ శకునం కోసం బాబు ఎదురుచూస్తున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న తాడేపల్లిగూడెం సభ అట్టర్‌ఫ్లాప్ కావడంతో తెలుగుదేశం శిబిరం డీలా పడిపోయింది. ఇప్పుడు ప్రధానమంత్రి పేరుతోనైనా చిలకలూరిపేట సభ సక్సెస్ చేయాలని ఆ పార్టీ శ్రేణులు చెమటోడ్చుతున్నాయి. మొత్తం 175 నియోజక వర్గాల నుంచి జనసమీకరణ చేస్తున్నారు. ‘సిద్ధం’ పేరిట వైసీపీ నిర్వహించిన నాలుగు ప్రాంతీయ సభలు చరిత్ర సృష్టించడం టీడీపీ కూటమికి పెనుసవాల్‌గా మారింది. ఒక్కో సభకు యాభై కంటే తక్కువ నియోజకవర్గాల నుంచే అభిమానుల సమీకరణ జరిగింది. మొదటి రెండు సభలు ఐదు లక్షల మార్కును దాటితే, చివరి రెండు సభలు పది లక్షల మార్కును దాటాయి. జాతీయ స్థాయిలోనే ఇదొక రికార్డు. రాష్ట్రవ్యాప్త సమీకరణ చేస్తే తప్ప గతంలో ఎన్నడూ కూడా ఐదు లక్షల పైచిలుకు జనసమీకరణ జరగలేదు. ఇప్పుడు ప్రధాని సభ టీడీపీ కూటమికి జీవన్మరణ సమస్యగా మారింది. అందుకే రాష్ట్రవ్యాప్త సమీకరణకు టార్గెట్లు పెట్టారు. రెండు మూడు లక్షలమంది హాజరైనా సరే యెల్లో మీడియా సహకారంతో సభ విజయవంతమైనట్టు ప్రకటించుకోవచ్చని ప్రయాసపడుతున్నారు. నరేంద్రమోదీ రూపంలో ఓ శుభశకునం కోసం ఎదురుచూస్తున్న కూటమికి అమిత్ షా రూపంలో అపశకునం ఎదురైంది. అది కూడా సరిగ్గా ఎన్నికల ప్రకటనకు ఒకరోజు ముందు! శుక్రవారం నాడు ఢిల్లీలో జరిగిన ‘ఇండియా టుడే’ కాన్క్లేవ్లో అమిత్ షా పాల్గొన్నారు. ‘ప్రధానిని టెర్రరిస్టని విమర్శించిన చంద్రబాబుతో మీరెలా పొత్తుపెట్టుకున్నార’న్న ప్రశ్నకు అమిత్ షా బదులిచ్చారు. ‘అలా అని ఆయనే ఎన్డీయే నుంచి వెళ్లిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు బుద్ధొచ్చింది. మళ్లీ మా దగ్గరకు వచ్చాడు’ అనగానే అక్కడున్న అతిథులందరూ పడిపడి నవ్వడం కనిపించింది. ఢిల్లీ కేంద్రంగా చంద్రబాబు పరువుపై పంచనామా జరిగింది. ఇదే కాన్క్లేవ్లో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన వచ్చినప్పుడు అమిత్ షా హుందాగా మాట్లాడారు. ఒక వ్యక్తి ఇతరుల నుంచి గౌరవాన్ని పొందాలంటే ఆ వ్యక్తికి నిబద్ధత, క్యారెక్టర్ ఎంత ముఖ్యమో ఈ ఘటన ఎత్తిచూపింది. ‘పార్లమెంట్లో కొన్ని బిల్లులకు వైసీపీ మద్దతు ఇచ్చింది కదా... మరి ఆ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకోలేద’ని అమిత్ షాను యాంకర్ ప్రశ్నించారు. ‘‘మేం పెట్టిన ప్రతి బిల్లుకూ ఆ పార్టీ మద్దతు ఇవ్వలేదు. కొన్నిటికి మాత్రమే ఇచ్చింది. అది కూడా ఆ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉంటేనే ఇచ్చింది తప్ప బీజేపీ కోసం కాద’’ని అమిత్ షా చెప్పారు. అమిత్ షా మాటల సారాంశాన్ని విడమర్చి చెప్పుకుంటే చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డిల వ్యక్తిత్వం మధ్యన ఉన్న తేడా స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబుకు సిద్ధాంతాలతో, రాద్ధాంతాలతో సంబంధం లేదు. అవకాశవాది! అవసరం ఉంటే వస్తాడు. లేకపోతే వెళ్లిపోతాడని అమిత్ షా భావన. జగన్మోహన్ రెడ్డికి సైద్ధాంతిక నిబద్ధత ఉన్నది. ఆ పార్టీ విధానాలకు అనుగుణమైతే మద్దతు ఇస్తారు. లేకపోతే లేదు. సిద్ధాంతపరంగా ఆయన పార్టీకీ, మాకూ పొత్తు పొసగదని కూడా ఆయన పరోక్షంగా చెప్పినట్టు! మనం సినిమాల్లో చూస్తూ వుంటాం, విలన్ డెన్‌లో ఉండే విదూషక క్యారెక్టర్‌కు ఆ డెన్లోనే ఏపాటి గౌరవం ఉంటుందో! చంద్రబాబు పరిస్థితి కూడా అంతే! ఎన్డీఏ కూటమిలో చేరినా, కూటమి సభ్యుల దృష్టిలో ఆయనో విదూషకుడు, అసందర్భ ప్రేలాపి, అవకాశవాది. అవకాశవాదంతో అటూ ఇటూ తిరిగినా, బీజేపీ ప్రవచించే పెట్టుబడిదారీ అభివృద్ధి నమూనాతో చంద్రబాబుకు కెమిస్ట్రీ బాగానే కుదురుతుంది. ఈ నమూనా వ్యవస్థలో అధికారంలో ఉన్నవాడు పెత్తందారీ శక్తుల భజంత్రీగా మారితే భారీగా వెనకేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ వెసులుబాటును పద్నాలుగేళ్లపాటు బాబు బాగానే ఒడిసిపట్టుకున్నాడు. కొద్దిమంది పెట్టుబడిదారుల అభివృద్ధే దేశాభివృద్ధిగా, వారి పెరుగుదలే దేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుదలగా పరిగణించే బీజేపీ శిబిరమే చంద్రబాబుకు సహజ ఆవాసం. అందుకే మూడుసార్లు విడాకులు తీసుకున్నా మళ్లీ నాలుగోసారి అదే పార్టీని మనువాడేందుకు ఆయన ఏమాత్రం సిగ్గుపడలేదు. పైగా వాజ్‌పేయి కార్గిల్ ఊపుమీద ఉన్నప్పుడు, మోదీ గుజరాత్ మోడల్ ఊపుమీద ఉన్నప్పుడు వారి గాలితో గెలిచిన అనుభవం బాబుది. ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి బలహీనంగా కన్పిస్తున్నందువల్ల మళ్లీ మోదీ గాలివాటు బాబుకు అవసరమైంది. అన్నిటినీ మించి తరుముకొస్తున్న అవినీతి కేసుల నుంచి రాబోయే కేంద్ర ప్రభుత్వం ఆయన్ను కాపాడాలి. ఆ రాబోయే ప్రభుత్వం మోదీ సర్కారేనని బాబు నమ్ముతున్నారు. దేశంలో చాలామందికి బాబుకున్న అభిప్రాయమే ఉండవచ్చు. ప్రతిపక్ష శిబిరం బాగా బలహీనంగా కనిపించడం అందుకు ఒక కారణం కావచ్చు. స్వతంత్ర మీడియా సంపూర్ణంగా అంతర్ధానం కావడం మరో కారణం కావచ్చు. ఈ కారణాల వల్ల, దేశానికి అన్నంపెట్టే రైతు తన పంటకు చట్టబద్ధమైన మద్దతు ధర కావాలని ఎలుగెత్తడం మనకు న్యాయమైన కోర్కెగా కనిపించడం లేదు. రోజురోజుకూ వేలాదిమంది యువకులు నిరుద్యోగ సైన్యంలో చేరిపోతున్నా మన కళ్లకు వికసిత భారత విశ్వరూపమే కనిపిస్తున్నది. తరతరాలుగా ఈ నేలపైనే పుట్టి ఈ నేలపైనే శ్వాసిస్తున్న కోట్లాదిమంది ‘మైనారిటీ’ ముద్రకు భయపడి వణికిపోతుంటే విజయోద్వేగంతో మన హృదయాలు ఉప్పొంగుతున్నవి. కనుక చాలామంది మళ్లీ మోదీయే గెలుస్తాడని అనుకుంటే అనుకోవచ్చు. వారికా స్వేచ్ఛ ఉన్నది. మన బాబు కూడా ఆ గుంపులోని గోవిందుడే! ఉత్తరాది మోదీ గాలి అంతో ఇంతో దండకారణ్యాన్ని దాటుకుని రాకపోతుందా, తనను కరుణించకపోతుందా అనే ఆశ ఆయనలో మిణుకుమిణుకుమంటూ ఉండవచ్చు. కానీ తూరుపు కనుమలది తలలు వంచే నైజం కాదు. ఉత్తరాదిలో లేనిదీ... ఏపీలో ఉన్నదీ ఒక ప్రత్యామ్నాయ కార్యక్రమం. పేదల సాధికారతే తారకమంత్రంగా సాగుతున్న ప్రభుత్వ ప్రాయోజిత విప్లవోద్యమం. భారత రాజ్యాంగ స్ఫూర్తిని తు.చ. తప్పకుండా అమలుచేస్తూ, ఆ రాజ్యాంగ కర్తను నగరం నడిబొడ్డున విశ్వరూపంతో నిలబెట్టిన రాష్ట్రమిది. ఆ భారత రాజ్యాంగాన్ని మార్చాలంటే కేంద్రానికి పెద్ద ఎత్తున సీట్లు కావాలి. అందుకు కూటములు కావాలి. రాజ్యాంగ రక్షణ కవచంతో సాధికారత సంతరించుకుంటున్న ప్రజలు ఈ ప్రయత్నాలను ఓడిస్తారు. ఆ కూటములనూ ఓడిస్తారు. భారతదేశ ఉజ్వల భవిష్యత్తును గానం చేసిన విశ్వకవి రవీంద్రుని కవిత అందరికీ తెలిసిందే. ‘‘ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనుషులు తలెత్తుకుని తిరుగుతారో, ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా ఉంటుందో, ఎక్కడ సంకుచిత భావాలతో సమాజం ముక్కలుగా విడిపోదో... ఓ తండ్రీ! అటువంటి స్వర్గసీమకు నా దేశాన్ని తీసుకుని వెళ్లు’’. కవీంద్రుని కలను నిజం చేసే శక్తి మన రాజ్యాంగానికి ఉన్నది. అటువంటి రాజ్యాంగాన్ని మార్చి అసమానతలకు, భయం బతుకులకు బాటలు వేసే ప్రయత్నాలను ఇక్కడి ప్రజలు సహించే పరిస్థితి ఉండదు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుకు మార్గదర్శకాలను విడుదల చేసిన నేపథ్యంలో రాజ్యాంగ మార్పుల చర్చ మళ్లీ ముందుకొచ్చింది. భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్నే మార్చే సవరణలు చెల్లబోవని గతంలోనే సుప్రీంకోర్టు చాటి చెప్పింది. ప్రస్తుత చట్టం (సీఏఏ) పౌరసత్వానికి మత ప్రాతిపదికను రుద్దుతున్నదని విమర్శకులు గట్టిగా భావిస్తున్నారు. ఇది రాజ్యాంగ లౌకిక స్వభావానికి విరుద్ధం కనుక చెల్లదని వారి వాదన. ఈ వ్యాజ్యం సుప్రీంకోర్టు విచారణకు రాబోతున్నది. ఒకవేళ న్యాయస్థానం కొట్టివేస్తే భారీ మెజారిటీతో వచ్చే ప్రభుత్వం కొత్త రాజ్యాంగాన్ని ముందుకు తేబోతున్నదని విమర్శకులు అనుమానిస్తున్నారు. మన దేశంలోనే కాదు, ప్రపంచమంతటా దీనిపై విస్తృతమైన చర్చ జరుగుతున్నది. ఇంత గంభీరమైన అంశంపై నాలుగోసారి బీజేపీతో జతకట్టిన చంద్రబాబు ఎంత సింపుల్‌గా సమాధానం చెబుతున్నారో చూడండి. ‘‘ఏ దేశానికి వెళ్లినా సిటిజన్‌షిప్ అనేది పారదర్శకంగా ఉంటుంది. అక్కడి నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవాల’’ని తేల్చేశారు. కానీ, మత ప్రాతిపదిక అవసరమా అనే కీలక విషయం జోలికి వెళ్లలేదు. పోనీ, ఈ ప్రాతిపదిక చట్టంలో చెప్పినట్టు మూడు దేశాలకూ, నిర్ణీత కాలానికే పరిమితం కావాలి. అంతకుమించి అనుమతించేది లేదని చెప్పినా అదొక లెక్క. కానీ మన నాయకుడు బ్లాంక్ చెక్ ఇచ్చేశాడు. అంతే మరి! విలన్ డెన్‌లో చేరిన విదూషకుల పరిస్థితి ఇలాగే ఉంటుంది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
సీఎం జగన్‌కు ప్రజలందరూ ఆశీస్సులివ్వాలి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సృష్టించిన చరిత్రని చెరిపేయటం ఎవరి తరం కాదని ఎమ్మెల్సీ, శాసన మండలి చీఫ్‌విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్పష్టంచేశారు. ప్రజల అవసరాలే తన ఎజెండా అని చెప్పిన ఏకైక నాయకుడు ఆయనేనని కొనియాడారు. ఇలాంటి నాయకుడికి ప్రజలందరి ఆశీస్సులు ఇవ్వాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించి భారీ కేక్‌ను కట్ చేశారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సభలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. చంద్రబాబుకు అధికారం మీద మాత్రమే ప్రేమ అని.. ప్రజలు, వారి అవసరాల మీద ఏమాత్రం లేదన్నారు. ఈ ఐదేళ్లలో నేను మంచి చేశాననిపిస్తేనే ఓటెయ్యమని సీఎం జగన్ అంటున్నారని.. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ ఇలాంటి నాయకుడ్ని చూడలేదని ఉమ్మారెడ్డి అన్నారు. అన్నిచోట్లా వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్.. గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. ముగ్గురు కాదు 30 మంది కలిసొచ్చినా వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీదే గెలుపు అని స్పష్టంచేశారు. 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలను వైఎస్సార్సీపీ స్వీప్ చేయబోతోందన్నారు. వైఎస్ జగన్ లాంటి సీఎం మాకు కూడా ఉంటే బాగుంటుందని ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా కోరుకుంటున్నారన్నారు. చరిత్ర సృష్టించటం సీఎం జగన్‌కే సాధ్యమని.. కుప్పంలో చంద్రబాబుని, మంగళగిరిలో లోకేశ్‌ని ఓడించి తీరుతామని మంత్రి ధీమా వ్యక్తంచేశారు. గుంట నక్కలు, తోడుదొంగలు చేసే నీచ రాజకీయాలను ఎదుర్కొనేందుకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని జోగి రమేష్ పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ‘మండలి’లో విప్ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ అంటేనే విశ్వసనీయతకు మారుపేరని.. ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టోను అమలుచేసిన ఘనత ఆయనదేనని కొనియాడారు. అన్ని వర్గాలకూ అండగా సీఎం జగన్.. ఇక వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. 13 ఏళ్లుగా ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి వైఎస్ జగన్ అని తెలిపారు. రైతులు, కార్మికులు, మహిళలు, యువత.. ఇలా అన్ని వర్గాలకు ఆయన అండగా నిలిచారన్నారు. ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ.. సీఎం జగన్ ఉంటేనే అందరికీ మేలు జరుగుతుందని స్పష్టంచేశారు. ఆయన్ని అణచివేయాలని ఎంతోమంది చూశారని.. కానీ, ఎన్ని కుట్రలు పన్నినా ఎదుర్కొని సీఎం జగన్ విజేతగా నిలిచారన్నారు. ఐదేళ్లలో హామీలన్నీ నెరవేర్చారు.. ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. పార్టీ పెట్టినప్పటి నుండి సీఎం జగన్ పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావని.. వాటన్నింటినీ ఎదుర్కొని, తట్టుకుని అధికారం సాధించారన్నారు. ఈ ఐదేళ్లలో ఆయన చెప్పిన హామీలన్నింటినీ నెరవేర్చారని గుర్తుచేశారు. ఇక చంద్రబాబు ఢిల్లీలో బీజేపీ నేతల ఇళ్ల ముందు పడిగాపులు కాశారని.. ఇలాంటి వారు ప్రజలకు ఏం చేస్తారని సురేశ్ ప్రశ్నించారు. మోసాలలో పుట్టి మోసాలు చేసే చంద్రబాబు అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో ప్రజలందరికీ తెలుసునన్నారు. అంతకుముందు.. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నేత పానుగంటి చైతన్య నాయకత్వంలో విద్యార్థులు, యువజనులు జైజై నినాదాలతో భారీగా తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు సలహాదారులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, కార్యకర్తలు, ఎన్ఆర్ఐ ప్రతినిధులూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే, పార్టీ 14వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ రకాల సేవా కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. ‘జగన్ అనే నేను’.. ఇదిలా ఉంటే.. వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద డిజిటల్ బోర్డు ఏర్పాటుచేశారు. మంత్రి జోగి రమేష్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డితో పాటు పలువురు పార్టీ నేతలు ‘జగన్ అనే నేను..’ ఈ కౌంట్‌డౌన్ బోర్డును ఆవిష్కరించారు. 73 రోజుల్లో జగన్ మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారని చెప్పేందుకు చిహ్నంగా ఈ బోర్టు పెట్టినట్లు పార్టీ నేతలు తెలిపారు. మరోసారి గొప్ప విజయం సాధించేందుకు మీరంతా సిద్ధమా? వైఎస్సార్సీపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ పిలుపు సాక్షి, అమరావతి: ‘నేడు మన వైఎస్సార్సీపీ 14వ వ్యవస్థాపక దినోత్సవం. ఆనాడు వందమంది ఏకమై మనపై యుద్ధానికి వస్తే.. అప్పుడు నాకు రక్షణగా నిలిచిన ప్రజల కోసం ప్రారంభమైన పార్టీ మన వైఎస్సార్సీపీ. ఇన్నాళ్లూ నా ప్రతి అడుగులోనూ అండగా నిలిచిన ప్రతి ఒక్క కార్యకర్తకు, అభిమానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు’ అంటూ ఎక్స్‌లో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ మంగళవారం పోస్ట్ చేశారు. ప్రజాక్షేత్రంలో మరోసారి మనం గొప్ప విజయం సాధించేందుకు మీరంతా సిద్ధమా? అంటూ కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి పేర్కొన్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019