breaking news
-
యూఏఈలో అనూహ్య వర్షాలు
దుబాయ్: మాడ పగిలిపోయే ఎండ వేడికి, ఎడారులకు నిలయమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను భారీ వర్షాలు పలకరించాయి. బుధవారం కుండపోత వర్షాలతో యూఏఈ తడిసి ముద్దయింది. భారీ వర్షాలను తట్టుకునే ఏర్పాట్లేవీ పెద్దగా లేకపోవడంతో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వే మొత్తం నీట మునిగింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత రద్దీ ఎయిర్‌పోర్ట్‌గా ఖ్యాతికెక్కిన దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎయిర్పోర్ట్ పార్కింగ్ ప్రాంతంలోని కార్లు మునిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒకటిన్నర సంవత్సరంలో పడాల్సిన వర్షపాతం బుధవారం ఒక్కరోజే నమోదైందని సిటీ వాతావరణ శాఖ వెల్లడించిన గణాంకాల్లో తేలింది. 14.2 సెంటీమీటర్లమేర వర్షపాత నమోదైందని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా స్కూళ్లు మూసేశారు. సమీప బహ్రెయిన్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియాల్లోనూ వర్షాలు కురిశాయి. భారీ వర్షాల కారణంగా జరిగిన ఆస్తినష్టాల వివరాలను ప్రభుత్వం బయటపెట్టలేదు. వర్షాల కారణంగా భారత్ నుంచి దుబాయ్‌కు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే మేఘమథనం వల్లే ఈ వర్షాలు కురిశాయని నిపుణుల అంచనా. -
Lok sabha elections 2024: పోటీ కేరళలో.. ప్రచారం గల్ఫ్‌లో!
– ఓ సినిమాలో హీరో చెప్పే డైలాగిది. కేరళ కాంగ్రెస్ నేత షఫి పరంబిల్ దీన్నే గుర్తు చేస్తున్నారు. వడకర లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్–యూడీఎఫ్ కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన గల్ఫ్ దేశాల్లో ఓట్లను అభ్యరి్థస్తున్నారు. యూఏఈ, ఖతార్ తదితర గల్ఫ్ దేశాల్లో భారీగా స్థిరపడిన కేరళీయులను కలిసి భారత్‌కు వచ్చి ఓటేయాలని కోరుతున్నారు. షార్జాలో, ఖతార్‌లో తాజాగా కేరళీయులతో సమావేశాలు నిర్వహించారు. ఆర్థిక ఇబ్బందులు లేకపోతే దయచేసి వచ్చి ఓటేయాలని కోరారు. అలాగే కేరళ నుంచి విదేశాలకు వెళ్తున్న వారు కూడా పోలింగ్ దాకా ప్రయాణం వాయిదా వేసుకోవాలని కోరుతున్నారు. కేరళ ఎన్నారైలు గతంలో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల ఎన్నికల్లో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దాంతో ఈసారి వారి మద్దతు కోసం పరంబిల్ ఇలా గల్ఫ్ యాత్ర చేపట్టారు. కేరళలోని 20 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 26న రెండో విడతలో పోలింగ్ జరగనుంది. పరంబిల్ ప్రస్తుతం పాలక్కాడ్ నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మెట్రోమ్యాన్‌గా పేరొందిన ఇ.శ్రీధరన్‌పై 3,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. ప్రస్తుతం సీపీఎం ఎమ్మెల్యే కేకే శైలజ, బీజేపీ అభ్యర్థి ప్రఫుల్ కృష్ణన్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. దాంతో ప్రచార నిమిత్తం ఇలా గల్ఫ్ బాట పట్టారు. -
దుబాయ్ శ్రీకృష్ణ మందిరంలో హోలీ వేడుకలు!
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో గల శ్రీకృష్ణ దేవాలయంలో భక్తులు హోలీ వేడుకలను ఘనంగా చేసుకుంటున్నారు. యూఏఈలోని భారతీయులు సామరస్య పూర్వకంగా హోలీని జరుపుకుంటున్నారని ప్రముఖ వ్యాపారవేత్త చంద్రశేఖర్ భాటియా మీడియాకు తెలిపారు. భారత రాయబారి సంజయ్ సుధీర్ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రంజాన్ మాసంలో మత సామరస్యం ఉట్టిపడేలా వసంతోత్సవాలు చేసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. దుబాయ్‌లోని పలు దేవాలయాలలో హోలీ సందర్భంగా భజనలతో పాటు హోలికా దహనాన్ని నిర్వహించారు. దుబాయ్‌లోని భారతీయ కమ్యూనిటీకి చెందిన సభ్యులు పలువురికి స్వీట్లు పంచి, హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. #यूएई ♦दुबई के कृष्ण मंदिर में श्रद्धालुओं ने मनाई होली#Holi #Dubai #KrishnaTemple pic.twitter.com/8YojdmjkFL — Knews (@Knewsindia) March 25, 2024 -
విజృంభించిన వసీం.. యూఏఈ చేతిలో స్కాట్లాండ్ చిత్తు
యూఏఈతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం స్కాట్లాండ్ జట్టు దుబాయ్‌లో పర్యటిస్తుంది. పర్యటనలో భాగంగా నిన్న (మార్చి 11 జరిగిన తొలి మ్యాచ్‌లో యూఏఈ స్కాట్లాండ్ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగుల నామమాత్రపు స్కోర్ చేయగా.. యూఏఈ 17.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ ముహమ్మద్ వసీం మెరుపు ఇన్నింగ్స్ (43 బంతుల్లో 68 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆడి యూఏఈని గెలిపించాడు. స్కాట్లాండ్ ఇన్నింగ్స్‌లో జార్జ్ మున్సే (49 బంతుల్లో 75; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒక్కడే రాణించాడు. మైఖేల్ లీస్క్ (19), జాక్ జార్విస్ (21) రెండంకెల స్కోర్లు చేశారు. యూఏఈ బౌలర్లలో జునైద్ సిద్దిఖీ (4-0-14-3) అద్బుతంగా బౌలింగ్ చేశాడు. ఆయాన్ ఖాన్ (4-0-19-2), బాసిల్ హమీద్ (4-0-26-2) పర్వాలేదనిపించారు. యూఏఈ ఇన్నింగ్స్‌లో ముహమ్మద్ వసీంతో పాటు తినష్ సూరి (35 బంతుల్లో 37; 4 ఫోర్లు), అలీషాన్ షరాఫు (29 బంతుల్లో 32; 3 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. స్కాట్లాండ్ బౌలర్లలో జాక్ జార్విస్, క్రిస్ గ్రీవ్స్లకు తలో వికెట్ దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మార్చి 13న జరుగనుంది. -
BAPS అబుదాబి హిందూ మందిర్ : కఠిన నిబంధనలు, డ్రెస్ కోడ్
అబుదాబిలో ఇటీవల (ఫిబ్రవరి 14, 204) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ మందిరంలో డ్రెస్‌కోడ్ వార్తల్లో నిలిచింది. మార్చి ఒకటో తేదీనుంచి ఇక్కడ ప్రజల దర్శనాలకు అనుమతినిచ్చిన నేపథ్యంలో నియమ నిబంధనలు, భక్తుల డ్రెస్ కోడ్‌కు సంబంధించిన నియమాలు, మార్గదర్శకాలను జారీ చేసింది. ముఖ్యంగా క్యాప్స్, టీషర్ట్లు, అభ్యంతరకరమైన దుస్తులకు అనుమతి ఉండదు. డ్రెస్ కోడ్, ఇతర నిబంధనలు అబుదాబి మందిర్ ట్విటర్లో షేర్ చేసిన వివరాల ప్రకారం ప్రతి మంగళవారం - శనివారం, ఉదయం 9 నుండి రాత్రి 8 గంటల వరకు భక్తుల సందర్శనార్థం ఈ మందిర్ తెరిచి ఉంటుంది. సోమవారం మాత్రం ఆలయాన్ని మూసివేస్తారు. The wait is over!#AbuDhabiMandir is now open for all visitors and worshipers. Opening hours: Tuesday to Sunday: 9am-8pm Every Monday: Closed for visitors pic.twitter.com/JnYvZoVSPk — BAPS Hindu Mandir (@AbuDhabiMandir) March 1, 2024 ముస్లిం దేశంలో అబుదాబిలో తొలి హిందూ దేవాలయంబాప్స్లో డ్రెస్ కోడ్, మార్గదర్శకాల విషయంలో కఠినంగా వహరించనున్నారు. ఆలయ నిబంధనల ప్రకారం, మెడ, మోచేతులు, మడమల వరకూ కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి. టైట్‌గా ఉన్న దుస్తులు, స్లీవ్‌లెస్, షార్ట్స్‌కు అనుమతించరు. శబ్దాలు చేసే ఉపకరణాలనూ ఆలయంలోకి అనుమతించరు. బయటి ఆహారాన్ని ఆలయంలోకి తీసుకు రాకూడదు. పెంపుడు జంతువులకు కూడా ఆలయంలోకి ప్రవేశం నిషిద్ధం. అంతేకాదు దేవాలయం పరిసరాల్లో డ్రోన్స్ వినియోగంపై కూడా నిషేధం విధించారు. ఫోటోలకు అనుమతి ఉందా? వ్యక్తిగత అవసరాల కోసమే ఫోటోలు తీసుకోవచ్చు. ఎవరైనా వాణిజ్య అవసరాల నిమిత్తం వీడియోను రికార్డ్ చేయాలనుకుంటే, వారు తప్పనిసరిగా అధికారుల అనుమతి తీసుకోవాలి. ఆలయంలోని ఆధ్యాత్మిక, ప్రశాంత వాతావరణానికి ఎటువంటి ఇబ్బందీ రాకుండా భక్తులు నియమాలను పాటించి సహకరించాలని ఆలయ అధికారులు కోరారు. కాగా 700 కోట్ల రూపాయల వ్యయంతో 27 ఎకరాల్లో బాప్స్ సంస్థ ఆధ్వర్యంలో అబూ మారేఖ్ ప్రాంతంలో ఆలయ నిర్మాణం జరిగింది. శిల్పకళ ఉట్టిపడేలా నిర్మించిన ఈ ఆలయంలో ఒకేసారి 5 వేల మంది ప్రార్థనలు చేసేలా ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
RSS article test 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019