breaking news
-
నిమిషానికి రూ.1 కోటి సంపాదిస్తున్న బ్యూటీ.. త్రిష, నయనతార కాదండోయ్ (ఫోటోలు)
-
కమల్ హాసన్- మణిరత్నం కాంబో.. ఆ హీరోలు మళ్లీ..!
కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో దాదాపు 34 ఏళ్ల ముందు రూపొందిన చిత్రం నాయకన్. ఆ చిత్రం అప్పట్లో సాధించిన సంచలన విజయం సాధించింది. కాగా అదే కాంబినేషన్లో మళ్లీ ఇప్పుడు రూపొందుతున్న భారీ చిత్రం థగ్ లైఫ్. దీనిని మణిరత్నానికి చెందిన మెడ్రాస్ టాకీస్, కమలహాసన్‌కు చెందిన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్, ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా ని ర్మిస్తున్నాయి. ఇందులో కమలహాసన్ సరసన నటి త్రిష నటిస్తుండగా నటుడు జయం రవి, దుల్కర్ సల్మాన్, సిద్ధార్థ్ ముఖ్య పాత్రలో పోషిస్తున్నట్లు చిత్ర వర్గాలు ప్రకటించాయి. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చైన్నెలో ప్రారంభమై ఆ తరువాత విదేశాల్లో చిత్రీకరణకు సినీ వర్గాలు వెళ్లాయి. అయితే అలాంటి సమయంలో తమిళనాడులో పార్లమెంట్ ఎన్నికల నగారా మోగడంతో నటుడు కమలహాసన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చైన్నెకి తిరిగి వచ్చారు. దీంతో థగ్స్ లైఫ్ చిత్ర షూటింగ్ వాయిదా పడింది. ఈ చిత్ర షెడ్యూల్ వాయిదా పడడంతో నటుడు జయం రవి ఆ తరువాత దుల్కర్ సల్మాన్ ఇటీవల సిద్ధార్థ్ కూడా థగ్స్ లైఫ్ నుంచి వైదొలగినట్లు ప్రచారం జోరుగా సాగింది. అలాగఇందులో నటుడు శింబును ఒక ముఖ్యపాత్రకు ఎంపిక చేసినట్లు ప్రచారం జరిగింది. అలాంటిది ఇప్పుడు ముందుగా ఈ చిత్రం నుంచి వైదొలగినట్లు ప్రచారం జరిగిన జయంరవి, దుల్కర్ సల్మాన్‌లు మళ్లీ ఈ చిత్రంలో నటించడానికి తిరిగి వస్తున్నట్లు తాజా సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా పార్లమెంటు ఎన్నికల ముగిసిన వెంటనే కమలహాసన్ థగ్స్ లైఫ్ చిత్ర షూటింగ్లో పాల్గొంటారన్నది తాజా సమాచారం. -
లేడీ సూపర్‌స్టార్‌కు గట్టి పోటీ.. ఆమె దెబ్బకు మాలీవుడ్‌కు!
ప్రస్తుతం నయనతార మాలీవుడ్ వైపు మళ్లుతున్నారా? పరిస్థితి చూస్తే అలానే అనిపిస్తోంది. లేడీ సూపర్‌స్టార్‌గా వెలుగుతున్న నయనతారకు ఇప్పుడిప్పుడే ఆ పేరు దూరం అవుతున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే చైన్నె సుందరి త్రిష నుంటి గట్టి పోటీ ఎదురవుతోంది. దీంతో త్రిష కోలీవుడ్‌లో సూపర్ స్టార్ హోదాను కైవసం చేసుకోనుందా? ప్రస్తుతం కోలీవుడ్‌లో గత కొద్దికాలంగా హాట్ టాపిక్ ఇదే. నయనతార గతేడాది జవాన్ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అంతేకాదు ఆ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. అయితే బాలీవుడ్లో మరో అవకాశం రాలేదు. ఇక తమిళంలో ఇటీవల ఈమె నటించిన ఇరైవన్, అన్నపూరణి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరచాయి. ప్రస్తుతం నవ దర్శకుడు టూయుటూ విక్కీ దర్శకత్వం వహిస్తున్న మన్నాగట్టి, సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో ఒక చిత్రం, మాధవన్‌తో కలిసి టెస్ట్ అనే మరో చిత్రంలో నటిస్తున్నారు. నయనతారకు వీటిలో ఏదో ఒకటి హిట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో విషయం ఏమిటంటే కోలీవుడ్‌లో స్టార్ హీరోలతో జతకట్టే అవకాశాలు నయన్‌కు ఇప్పుడిప్పుడే దూరమవుతున్నాయి. నటి త్రిష వైపు వెళుతున్నాయని చెప్పక తప్పడం లేదు. ఆ తరువాత తెలుగులోనూ స్టార్ హీరోలైన చిరంజీవి, అల్లుఅర్జున్‌లతో కలిసి నటించే అవకాశాలను దక్కించుకున్నారు. అంతేకాకుండా మలయాళంలోనూ నటిస్తున్నారు. దీంతో నయనతార కూడా మలయాళ చిత్ర పరిశ్రమపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. తన మాతృభాష అయిన ఈ చిత్ర పరిశ్రమలో నయనతారకు ప్రత్యేక స్థానం ఉంది. ఇంతకుముందే మమ్ముట్టి, నివిన్‌బాలీ వంటి స్టార్ హీరోలతో జతకట్టారు. అలా ఈమె మలయాళంలో నటించిన చివరి చిత్రం గోల్డ్. అల్పోన్స్ దర్శకత్వం వహించిన ఆ చిత్రం 2022లో విడుదలై పెద్దగా ఆడలేదు. దీంతో కొంతకాలం మాలీవుడ్‌కు దూరంగా ఉంటూ వచ్చిన నయనతార తాజాగా మరో చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి డియర్ స్టూడెంట్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇందులో నయనతార టీచర్ పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం గురించి తమిళ నూతన సంవత్సరం సందర్భంగా ఆదివారం పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో నటుడు నివిన్ బాలి హీరోగా నటిస్తున్నారు. -
అల్లు అర్జున్‌కి జోడీగా..?
‘పుష్ప: ది రైజ్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్నారు హీరో అల్లు అర్జున్. ప్రస్తుతం ఆయన ‘పుష్ప: ది రూల్’ సినిమా చేస్తున్నారు. ఆ చిత్రం పూర్తయిన తర్వాత తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అందులో భాగంగానే హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులను ఫైనల్ చేసే పనిలో పడ్డారట అట్లీ. కాగా ఈ మూవీలో అల్లు అర్జున్‌కి జోడీగా నటించే హీరోయిన్ల జాబితాలో సమంత, త్రిష పేర్లు వినిపిస్తున్నాయి. తొలుత త్రిష పేరు తెరపైకి వచ్చింది. అల్లు అర్జున్‌కి ఆమె జోడీగా నటించనున్నారనే వార్తలు కోలీవుడ్‌లో హల్చల్ చేశాయి. అయితే తాజాగా సమంత పేరు వినిపిస్తోంది. అట్లీ దర్శకత్వం వహించిన ‘తేరి’ సినిమాలో విజయ్‌కి జోడీగా నటించారు సమంత. అలాగే ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రంలో అల్లు అర్జున్‌తో జతకట్టారీ బ్యూటీ. అలాగే ‘పుష్ప: ది రైజ్’ మూవీలో ‘ఊ అంటావా...’ అంటూ ప్రత్యేక పాట చేశారు. తాజాగా వీరి జోడీ రిపీట్ కానుందనే వార్తలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరి అల్లు అర్జున్ సరసన నటించేది సమంతా? త్రిషా? లేకుంటే ఇద్దరూ నటిస్తారా? ఈ ఇద్దరూ కాకుండా వేరే కథానాయిక నటిస్తారా? అనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి. ఈ అక్టోబర్‌లో అల్లు అర్జున్–అట్లీ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుందని టాక్. -
రెమ్యునరేషన్ పెంచేసిన త్రిష.. నయనతార కంటే ఎక్కువే!
తమిళసినిమా: నటి త్రిష తన స్నేహితురాలు, లేడీ సూపర్‌స్టార్ నయనతారను దాటేసి నంబర్‌వన్ స్థానానికి చేరుకున్నారా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. ఇంతకుముందు వరకూ దక్షిణాదిలోనే నంబర్‌వన్ కథానాయకిగా నయనతార వెలుగొందారు. ఇప్పుటికీ ఆమె ఏ మాత్రం తగ్గలేదు. అయితే నటి త్రిష క్రేజ్ మాత్రమే బాగా పెరిగింది. అంతా దర్శకుడు మణిరత్నం పుణ్యమే అని చెప్పకతప్పదు. నటి త్రిష కెరీర్ పొన్నియిన్‌సెల్వన్ చిత్రానికి ముందు, ఆ తరువాత అని చెప్పాలి. ఈమె నటించిన హీరోయిన్ ఓరియన్‌టెడ్ కథా చిత్రాలు వరుసగా అపజయం కావడంతో గ్రాఫ్ పడిపోయింది. ఒక టైమ్‌లో చేతిలో చిత్రాలే లేకుండా పోయాయి. అలాంటి సమయంలో మణిరత్నం కరుణించడంతో పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో యువరాణి కందవై పాత్రలో నటించే అవకాశం వరించింది. అందులో నటి ఐశ్వర్యరాయ్ కూడా నటించారు. నిజం చెప్పాలంటే ఆమెను త్రిష డామినేట్ చేశారు. రాజసం ఒలకబోసిన త్రిష నటన అందరిని ఆకట్టుకుంది. ఆ చిత్రం సూపర్‌హిట్ అయ్యింది. అంతే త్రిష సెకండ్ ఇన్నింగ్‌కు ఆ చిత్రంతోనే బీజం పడింది. ఆ తరువాత విజయ్‌కు జంటగా లియో చిత్రంలో నటించారు. ప్రస్తుతం అజిత్‌కు జంటగా విడాముయర్చి, కమలహాసన్ సరసన థగ్స్ లైఫ్, తెలుగులో చిరంజీవికి జంటగా విశ్వంభర, మలయాళంలో మోహన్‌లాల్‌కు జంటగా రామ్, నివిన్‌బాలీ సరసన ఐడెంటిట్టీ అంటూ స్టార్స్ సరసన భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గోట్లో కూడా ఒక ప్రత్యేక పాట, కొన్ని కీలక సన్నివేశాల్లో నటిస్తున్నారు. కాగా లియో చిత్రంలో నటించడానికి రూ.6 కోట్లు పారితోషికం పుచ్చుకున్న త్రిష, ఇప్పుడు కమలహాసన్ సరసన నటిస్తున్న థగ్స్ లైఫ్ చిత్రం కోసం ఏకంగా రూ.12 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. ఇంత మొత్తంలో పారితోషికాన్ని నయనతార కూడా ఇప్పటి వరకూ పొందలేదు. దీంతో ఆమెను అధిగమించిన త్రిష ఇప్పుడు నంబర్‌వన్ స్థానానికి ఎగబాకారన్న ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019