breaking news
-
సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. హైదరాబాద్ చేరుకున్న విరాట్ కోహ్లి! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దారుణ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. బ్యాటింగ్ పరంగా పర్వాలేదన్పిస్తున్న ఆర్సీబీ.. బౌలింగ్ పరంగా మాత్రం పూర్తిగా తేలిపోయింది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రం విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. వరుస పరాజయాలతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ రేసు నుంచి కూడా దాదాపు నిష్క్రమించినట్లే. అయితే కనీసం మిగిలిన మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి టోర్నీని ఘనంగా ముగించాలని ఆర్సీబీ భావిస్తోంది. ఈ క్రమంలో ఈ మెగా ఈవెంట్లో మరో కీలక పోరుకు ఆర్సీబీ సిద్దమైంది. ఏప్రిల్ 25న హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆర్సీబీ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి హైదరాబాద్ చేరుకున్నాడు. జట్టు కంటే ముందే విరాట్ భాగ్యనగరంలో అడుగుపెట్టాడు. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో స్టైలిష్ లూక్లో విరాట్ కన్పించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీ నిరాశపరుస్తున్నప్పటికి.. కోహ్లి మాత్రం అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన విరాట్.. 379 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు. #ViratKohli arrived in Hyderabad for the upcoming IPL match, #SRHvsRCB on Thursday. pic.twitter.com/ljkoyENfmy — Gulte (@GulteOfficial) April 23, 2024 -
మహేష్‌బాబుతో సన్‌రైజర్స్ ఆటగాళ్లు.. (ఫోటోలు)
-
టీ20 మ్యాచ్‌లో విధ్వంసం.. ఏకంగా 549 పరుగులు! వీడియో
ఐపీఎల్-2024లో భాగంగా ఆర్సీబీ-సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు అసలు సిసలైన టీ20 క్రికెట్ మజాను అందించింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారింది. ఇరు జట్లు కలపి ఏకంగా 549 పరుగులు సాధించాయి. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు నమోదైన మ్యాచ్‌గా ఇది నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 7 వికెట్ల నష్టానికి 287 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్(102) సెంచరీతో చెలరేగగా.. హెన్రిచ్ క్లాసెన్(67), మార్క్రమ్(35), సమద్(37) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం లక్ష్య చేధనలో ఆర్సీబీ కూడా ధీటుగా బదులిచ్చింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. అయితే దురదృష్టవశాత్తూ ఆర్సీబీ తమ విజయానికి 25 పరుగుల దూరంలో నిలిచింది. SRH might’ve won the match but Dinesh Karthik definitely deserved that standing ovation ❤️#RCBvSRH pic.twitter.com/sMWNSC2ptj — UrMiL07™ (@urmilpatel30) April 15, 2024 అత్యధిక సిక్స్‌లు.. అదే విధంగా ఈ మ్యాచ్‌లో ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాటర్లు కలిపి ఏకంగా 38 సిక్స్‌లు బాదేశారు. దీంతో టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్స్‌లు నమోదైన రెండు మ్యాచ్‌గా ఆర్సీబీ-ఎస్ఆర్హెచ్ పోరు నిలిచింది. అంతకముందు ఈ ఏడాది సీజన్లో సన్‌రైజర్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కూడా 38 సిక్స్‌లే నమోదయ్యాయి. That's a Book 🔥 Innings from Travis head! pic.twitter.com/lsiLinLU1M — SunRisers OrangeArmy Official (@srhfansofficial) April 15, 2024 -
మా కుర్రాళ్లు బాగా పోరాడారు.. అదే మా కొంపముంచింది: ఆర్సీబీ కెప్టెన్
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ ఏ మాత్రం మారలేదు. ఈ మెగా ఈవెంట్లో ఆర్సీబీ వరుసగా ఐదో ఓటమి చవచూసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో బెంగళూరు ఓటమి పాలైంది. మరోసారి బెంగళూరు బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. తొలుత బౌలింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 287 పరుగుల రికార్డు స్కోర్‌ను సమర్పించుకుంది. ట్రావిస్ హెడ్(102) ,హెన్రిచ్ క్లాసెన్(67), మార్క్రమ్(35), సమద్(37) ఆర్సీబీ బౌలర్లను ఊచకోత కోశారు. అనంతరం లక్ష్య చేధనలో ఆర్సీబీ బ్యాటర్లు ఆఖరి వరకు పోరాడారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో దినేష్ కార్తీక్ అద్బుతమైన పోరాటం చేశాడు. కేవలం 35 బంతుల్లోనే 7 సిక్సర్లు, 5 ఫోర్లతో కార్తీక్ 83 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ డుప్లెసిస్(62), విరాట్ కోహ్లి(42) ఉన్నంతసేపు మెరుపులు మెరిపించారు. ఈ ఓటమితో ఆర్సీబీ ప్లే ఆఫ్ ఛాన్స్‌లను సంక్లిష్టం చేసుకుంది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ స్పందించాడు. బౌలింగ్ వైఫల్యం కారణంగానే ఓటమి పాలైమని ఫాప్ చెప్పుకొచ్చాడు. "ఈ మ్యాచ్‌లో మేము ఆఖరి వరకు పోరాడినందుకు సంతోషంగా ఉంది. ఈ సీజన్లో మా నుంచి వచ్చిన మెరుగైన బ్యాటింగ్ ప్రదర్శన ఇదే. చిన్నస్వామి వికెట్ సరిగ్గా టీ20 క్రికెట్‌కు సరిపోతుంది. 280 పైగా టార్గెట్‌ను ఛేజ్ చేయడం అంత సులభం కాదు. కానీ మేము దగ్గరికి వచ్చి ఓడిపోయాం. ఈ మ్యాచ్‌లో కొన్ని మార్పులు చేశాము. కొత్తగా కొన్ని విషయాలను ప్రయత్నించాం. ఫాస్ట్ బౌలర్లు ఈ పిచ్‌పై పూర్తిగా తేలిపోయారు. బ్యాటింగ్ పరంగా మేము బలంగానే ఉన్నాము. మేము ఇంకా కొన్ని విభాగాల్లో ఇంకా మెరుగవ్వాలి. ముఖ్యంగా బౌలింగ్‌పై ఎక్కువ దృష్టిపెట్టాలి. అదే విధంగా బ్యాటింగ్‌లో కూడా పవర్‌ప్లే తర్వాత రన్ రేట్ తగ్గకుండా చూసుకోవాలి. ఈ హైస్కోరింగ్ రన్ ఛేజ్‌లో మా బాయ్స్ ఆఖరి వరకు మ్యాచ్‌ను విడిచిపెట్టలేదు. తొలుత బౌలింగ్‌లో 30-40 పరుగులు ఎక్కువగా ఇచ్చాం. అదే మా కొంపముంచింది. కానీ ఆటలో గెలుపుటములు సహజం. ఓడిపోయినందుకు కచ్చితంగా బాధ ఉంటుంది. కానీ మా మైండ్‌ను ఫ్రెష్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మా తర్వాతి మ్యాచ్‌ల్లో ఆడేందుకు సిద్దంగా ఉండాలి కదా" అంటూ పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో డుప్లెసిస్ పేర్కొన్నాడు. -
లేటు వయస్సులో తుపాన్ ఇన్నింగ్స్‌లు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో ఛాన్స్?
ఐపీఎల్-2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఎస్ఆర్హెచ్తో జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి పాలైనప్పటికి ఆ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ మాత్రం అద్బుతమైన పోరాట పటిమతో అందరని ఆకట్టుకున్నాడు. 288 పరుగుల భారీ లక్ష్య చేధనలో కార్తీక్ ఒంటరి పోరాటం చేశాడు. ఆరో స్దానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కార్తీక్.. ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. తన ట్రేడ్ మార్క్ షాట్లతో కార్తీక్ అలరించాడు. అతడికి బౌలింగ్‌లో ఎలా చేయాలో ఆర్ధం కాక ఎస్ఆర్హెచ్ బౌలర్లు తలలపట్టుకున్నారు. భువనేశ్వర్, ప్యాట్ కమ్మిన్స్ వంటి సీనియర్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 35 బంతుల్లోనే 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 83 పరుగులు చేశాడు. అతడు విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగానే ఆర్సీబీ.. ఎస్ఆర్హెచ్కు గట్టిపోటీ ఇవ్వగల్గింది. డికే ఈ ఏడాది సీజన్లో అద్బుతంగా రాణిస్తున్నాడు. ఆఖరిలో బ్యాటింగ్ వచ్చి తన జట్టుకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు. ఈ మ్యాచ్ కంటే ముందు ముంబైతో మ్యాచ్‌లోనూ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో దినేష్ కార్తీక్‌పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గెలిచి ఉండవచ్చు.. డీకే మాత్రం మా మనసులను గెలుచుకున్నాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది త్వరలో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు కార్తీక్‌ను ఎంపిక చేయాలంటూ అభిప్రాయపడుతున్నారు. pic.twitter.com/jqOIaCZAgL — Cricket Videos (@cricketvid123) April 15, 2024
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019