breaking news
-
స్టొయినిస్ విధ్వంసం
చెన్నై: నాలుగు రోజుల క్రితం లక్నో వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌కు ఇప్పుడు చెన్నైలో రీప్లేగా జరిగిన పోరులో లక్నోనే మళ్లీ ‘సూపర్’గా ఆడి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మంగళవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో లక్నో 6 వికెట్ల తేడాతో చెన్నైపై గెలిచింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీస్కోరు చేసింది. ఓపెనర్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (60 బంతుల్లో 108 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ శతకాన్ని నమోదు చేశాడు. ‘హిట్టర్’ శివమ్ దూబే (27 బంతుల్లో 66; 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) చెలరేగాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన లక్నో 19.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మార్కస్ స్టొయినిస్ (63 బంతుల్లో 124 నాటౌట్; 13 ఫోర్లు, 6 సిక్స్‌లు) అసాధారణ ఇన్నింగ్స్‌తో అజేయ సెంచరీ సాధించి లక్నోను విజయతీరాలకు చేర్చాడు. పూరన్‌తో నాలుగో వికెట్‌కు 70 పరుగులు, దీపక్ హుడాతో అబేధ్యమైన ఐదో వికెట్‌కు 55 పరుగులు జోడించిన స్టొయినిస్ లక్నోకు చిరస్మరణీయ విజయం అందించాడు. కెప్టెన్ ఇన్నింగ్స్... రహానే (1), వన్‌డౌన్‌లో మిచెల్ (11), జడేజా (16) చెన్నై టాప్–4 బ్యాటర్లలో ముగ్గురి స్కోరిది! పవర్ ప్లేలో చెన్నై చేసిన స్కోరు 49/2 తక్కువే! ఈ దశలో కెప్టెన్ రుతురాజ్ బౌండరీలతో పరుగుల వేగాన్ని అందుకున్నాడు. గైక్వాడ్ 28 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకోగా... జట్టు స్కోరు 11.3 ఓవర్లలో వందకు చేరింది. అదే ఓవర్లో జడేజా నిష్క్రమించడంతో వచ్చిన దూబే ఓ రకంగా శివతాండవమే చేశాడు. 15 ఓవర్లలో చెన్నై 135/3 స్కోరు చేసింది. కానీ ఆ తర్వాత దూబే పవర్‌ప్లే మొదలైంది. భారీ సిక్సర్లతో స్కోరు ఒక్కసారిగా దూసుకెళ్లింది. 16వ ఓవర్లో దూబే హ్యాట్రిక్ సిక్స్‌లతో 19 పరుగులు, 18వ ఓవర్లో గైక్వాడ్ 6, 4, 4లతో 16 పరుగులు, 19వ ఓవర్లో మళ్లీ దూబే దంచేయడంతో 17 పరుగులు, ఆఖరి ఓవర్లో 15 పరుగులతో స్కోరు 200 పైచిలుకు చేరింది. చివరి 5 ఓవర్లలో దూబే వికెట్ మాత్రమే కోల్పోయిన చెన్నై 75 పరుగులు సాధించింది. గైక్వాడ్ 56 బంతుల్లో శతకాన్ని, దూబే 22 బంతుల్లో అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నారు. బ్యాటింగ్ గేర్ మార్చి... కొండంత లక్ష్యం ముందున్న లక్నోకు ఆరంభంలో అన్ని ఎదురుదెబ్బలే తగిలాయి. ఓపెనర్లు డికాక్ (0), కేఎల్ రాహుల్ (14 బంతుల్లో 16; 1 ఫోర్, 1 సిక్స్), దేవదత్ పడిక్కల్ (19 బంతుల్లో 13) నిరాశపరిచారు. టాపార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన స్టొయినిస్ ఒక్కడే గెలిపించేదాకా మెరిపించాడు. ఈ క్రమంలో 26 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు. తర్వాత నికోలస్ పూరన్ (15 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) జోరు పెంచగానే... పతిరణ మరుసటి ఓవర్లోనే పెవిలియన్ చేర్చాడు. స్టొయినిస్ 56 బంతుల్లో సెంచరీ పూర్తిచేసుకున్నాడు. దీపక్ హుడా కూడా (6 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) బ్యాట్‌కు పని చెప్పడంతో అనూహ్యంగా లక్నో లక్ష్యం వైపు పరుగు పెట్టింది. 18 బంతుల్లో 47 పరుగుల కష్టమైన సమీకరణం ఇద్దరి దూకుడుతో సులువైంది. 18, 19వ ఓవర్లలో 15 పరుగుల చొప్పున వచ్చాయి. 6 బంతుల్లో 17 పరుగుల్ని స్టొయినిస్ 6, 4, నోబాల్4, 4లతో ఇంకో మూడు బంతులు మిగిల్చి ముగించాడు. స్కోరు వివరాలు చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: రహానే (సి) రాహుల్ (బి) హెన్రి 1; రుతురాజ్ (నాటౌట్) 108; మిచెల్ (సి) హుడా (బి) యశ్ 11; జడేజా (సి) రాహుల్ (బి) మోసిన్ 16; దూబే (రనౌట్) 66; ధోని (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 210. వికెట్ల పతనం: 1–4, 2–49, 3–101, 4–205. బౌలింగ్: హెన్రీ 4–0–28–1, మోసిన్ ఖాన్ 4–0–50–1, రవి బిష్ణోయ్ 2–0–19–0, యశ్ ఠాకూర్ 4–0–47–1, స్టొయినిస్ 4–0–49–0, కృనాల్ పాండ్యా 2–0–15–0. లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: డికాక్ (బి) దీపక్ 0; రాహుల్ (సి) రుతురాజ్ (బి) ముస్తఫిజుర్ 16; స్టొయినిస్ (నాటౌట్) 124; పడిక్కల్ (బి) పతిరణ 13; పూరన్ (సి) శార్దుల్ (బి) పతిరణ 34; హుడా (నాటౌట్) 17; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (19.3 ఓవర్లలో 4 వికెట్లకు) 213. వికెట్ల పతనం: 1–0, 2–33, 3–88, 4–158. బౌలింగ్: దీపక్ చహర్ 2–0–11–1, తుషార్ 3–0–34–0, ముస్తఫిజుర్ 3.3–0–51–1, శార్దుల్ 3–0–42–0, మొయిన్ అలీ 2–0–21–0, జడేజా 2–0–16–0, పతిరణ 4–0–35–2. ఐపీఎల్లో నేడు ఢిల్లీ X గుజరాత్ వేదిక: న్యూఢిల్లీ రాత్రి7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసకర సెంచరీ..12 ఫోర్లు, 3 సిక్స్‌లతో! వీడియో
ఐపీఎల్-2024లో చెపాక్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో గైక్వాడ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో లక్నో బౌలర్లను రుతురాజ్ ఓ ఆట ఆడుకున్నాడు. ఈ క్రమంలో కేవలం 54 బంతుల్లోనే గైక్వాడ్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 60 బంతులు ఎదుర్కొన్న గైక్వాడ్.. 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 108 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. గైక్వాడ్‌కు ఇది తన ఐపీఎల్ కెరీర్లో రెండో సెంచరీ కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి సీఎస్కే 210 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సీఎస్కే బ్యాటర్లలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు శివమ్ దూబే మరోసారి తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 27 బంతుల్లోనే 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 66 పరుగులు చేశాడు. లక్నో బౌలర్లలో మాట్ హెన్రి, యశ్ ఠాకూర్, మోహ్షిన్ ఖాన్ తలా వికెట్ సాధించారు. The Guiding Star! 🌟🦁#CSKvLSG #WhistlePodu 🦁💛 pic.twitter.com/aUsekAgySQ — Chennai Super Kings (@ChennaiIPL) April 23, 2024 -
Ruturaj Gaikwad: ఆ యువ వికెట్ కీపర్ వల్లే ఇదంతా.. అతడు కూడా అదుర్స్
మహేంద్ర సింగ్ ధోని.. 42 ఏళ్ల వయసులోనూ బ్యాట్‌తో దుమ్ములేపుతున్నాడీ వికెట్ కీపర్ బ్యాటర్. చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఈ దిగ్గజ సారథి.. ప్రస్తుతం 27 ఏళ్ల రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అవసరమైనప్పుడల్లా సలహాలు, సూచనలు ఇస్తూనే.. తనంతట తాను స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే వీలు కల్పిస్తూ రుతుకు ఎల్లవేళలా అండగా నిలుస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించడంలో ధోని తన వంతు పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఈ ‘జార్ఖండ్ డైనమైట్’ కేవలం నాలుగు బంతులు ఎదుర్కొని మూడు సిక్సర్ల సాయంతో 20 పరుగులతో అజేయంగా నిలిచాడు. తలా ఇన్నింగ్స్ చూడాలంటూ ఆశపడిన అభిమానులకు కన్నుల పండుగ చేశాడు. DO NOT MISS MSD 🤝 Hat-trick of Sixes 🤝 Wankhede going berserk Sit back & enjoy the LEGEND spreading joy & beyond 💛 😍 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #MIvCSK | @msdhoni | @ChennaiIPL pic.twitter.com/SuRErWrQTG — IndianPremierLeague (@IPL) April 14, 2024 శివం దూబే(38 బంతుల్లో 66 నాటౌట్)తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఇక ధోని సునామీ ఇన్నింగ్స్ కారణంగా సీఎస్కే 200 పరుగుల మార్కును దాటింది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి 206 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో తడబడిన ముంబై 186 పరుగులకే పరిమితం కావడంతో చెన్నై 20 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ నేపథ్యంలో విజయానంతరం చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ ధోనిని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘మా జట్టులో ఉన్న యువ వికెట్ కీపర్ ఆ మూడు సిక్స్‌లు బాదడం జట్టుకు ఎంతో ఉపయోగపడింది. వాంఖడే పిచ్ మీద కచ్చితంగా మాకు 10- 15 అదనపు పరుగులు అవసరమైన వేళ ఈ ఇన్నింగ్స్ వల్ల మేలు చేకూరింది’’ అని ధోనిని ప్రశంసించాడు రుతు. We agree with captain @Ruutu1331! ☺️#TATAIPL | #MIvCSK | @msdhoni | @ChennaiIPL pic.twitter.com/g5oHfgUH37 — IndianPremierLeague (@IPL) April 14, 2024 అదే విధంగా.. ‘‘మా జట్టులోని మలింగ(పతిరణ) ఈరోజు అద్బుతంగా బౌలింగ్ చేశాడు. యార్కర్లతో ప్రత్యర్థుల మతి పోగొట్టాడు. తుషార్, శార్దూల్ కూడా బాగా ఆడారు. ఇక నేను కూడా కేవలం ఓపెనర్‌గా కాకుండా ఏ స్థానంలో బ్యాటింగ్ చేయడానికైనా సిద్ధంగా ఉన్నా’’ అని రుతురాజ్ చెప్పుకొచ్చాడు. చెన్నై వర్సెస్ ముంబై స్కోర్లు ►టాస్: ముంబై.. బౌలింగ్ ►చెన్నై స్కోరు: 206/4 (20) ►ముంబై స్కోరు: 186/6 (20) ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మతీశ పతిరణ(4/28). 2⃣nd win on the bounce 4⃣th win of the season @ChennaiIPL bag 2⃣ more points after a victory over #MI, despite a heroic Rohit Sharma TON! Scorecard ▶️ https://t.co/2wfiVhdNSY#TATAIPL | #MIvCSK pic.twitter.com/5mZMPulaNn — IndianPremierLeague (@IPL) April 14, 2024 -
CSK Vs MI: రుతురాజ్ అరుదైన రికార్డు.. కోహ్లి, రోహిత్‌కు కూడా సాధ్యం కాలేదు! వీడియో
టీమిండియా యువ ఓపెనర్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో అత్యంత వేగంగా 2 వేల పరుగులు పూర్తి చేసిన తొలి భారత క్రికెటర్‌గా గైక్వాడ్ నిలిచాడు. ఐపీఎల్-2024లో భాగంగా వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 69 పరుగులు చేసిన రుతు.. ఈ అరుదైన ఫీట్‌ను తన పేరిట లిఖించుకున్నాడు. కేవలం 57 ఇన్నింగ్స్‌లలోనే రుతురాజ్ ఈ ఘనతను అందుకున్నాడు. ఇప్పటివరకు 58 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన గైక్వాడ్ 2,021 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో ఒక సెంచరీతో పాటు 16 ఫిప్టీలు ఉన్నాయి. అదే విధంగా ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా రుతురాజ్ నిలిచాడు. ఈ జాబితాలో దిగ్గజ ఆటగాళ్లు క్రిస్ గేల్ , షాన్ మార్ష్ ఉన్నారు. ఇక ఈ ఏడాది సీజన్లో గైక్వాడ్ కెప్టెన్‌గా, ఆటగాడిగా అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటివరకు ఈ ఏడాది సీజన్లో 6 మ్యాచ్‌లు ఆడిన రుతురాజ్ 224 పరుగులు చేశాడు. అతడి సారథ్యంలో సీఎస్కే 6 మ్యాచ్‌ల్లో నాలుగింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్దానంలో కొనసాగుతోంది. Shot of Authority from Ruturaj Gaikwad 🔥 pic.twitter.com/Hdp5z4cRvj — 🎰 (@StanMSD) April 14, 2024 -
గైక్వాడ్ ఈ ఒక్క ఏడాదే.. వచ్చే సీజన్లో CSK కెప్టెన్ అతడే!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఇంగ్లండ్ మాజీ సారథి మైకేల్ వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్-2025లో హిట్‌మ్యాన్ కచ్చితంగా జట్టు మారడతాడని అంచనా వేశాడు. ఇప్పటికే ఐదుసార్లు చాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్‌తో అతడు ప్రయాణం మొదలుపెట్టడం ఖాయమని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2024కు ముందే గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను ట్రేడ్ చేసుకున్న ముంబై ఇండియన్స్.. కెప్టెన్‌గా రోహిత్ శర్మపై వేటు వేసిన విషయం తెలిసిందే. ఐదుసార్లు ట్రోఫీ అందించిన హిట్‌మ్యాన్‌ను కాదని హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. ఈ క్రమంలో ఇప్పటికే ఫ్రాంఛైజీ నిర్ణయంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న రోహిత్ శర్మ జట్టును వీడాలని ఫిక్సయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కామెంటేటర్ మైకేల్ వాన్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ కేవలం ఈ ఒక్క ఏడాదే ‘‘రోహిత్ శర్మ చెన్నైకి వెళ్లిపోతాడా? ధోని స్థానాన్ని భర్తీ చేస్తాడా? రుతురాజ్ గైక్వాడ్ కేవలం ఈ ఒక్క ఏడాదే కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తాడా? వచ్చే ఏడాది రోహిత్ జట్టుతో చేరేంత వరకు తాత్కాలిక సారథిగా ఉంటాడా? నేనైతే రోహిత్‌ను చెన్నై జట్టులో చూస్తాననే అనుకుంటున్నా’’ అని ఓ పాడ్‌కాస్ట్‌లో మైకేల్ వాన్ చెప్పుకొచ్చాడు. హైదరాబాద్‌కు ఆడినా బాగానే ఉంటుంది అయితే, ఇందుకు హోస్ట్ బదులిస్తూ.. ‘‘రోహిత్ ముంబై జట్టును వీడితే అభిమానుల హృదయాలు ముక్కలైపోతాయి కదా?’’ అని పేర్కొనగా.. అవునంటూ వాన్ సమాధానమిచ్చాడు. సీఎస్కేకు కాకపోతే రోహిత్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు వెళ్లినా బాగానే ఉంటుందని.. గతంలో అతడు డెక్కన్ చార్జర్స్‌కు ఆడిన విషయాన్ని ఈ సందర్భంగా మైకేల్ వాన్ గుర్తు చేశాడు. కాగా కెప్టెన్ మార్పు విషయాన్ని ముంబై ఇండియన్స్, రోహిత్ ఫ్యాన్స్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. హార్దిక్ పాండ్యాపై ఆగ్రహం వెళ్లగక్కుతూ స్టేడియంలోనే అతడికి చుక్కలు చూపిస్తున్నారు. ఇక ఐపీఎల్-2024లో పాండ్యా సారథ్యంలో తొలి మూడు మ్యాచ్‌లు ఓడిన ముంబై.. తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌లు గెలచింది. మరోవైపు రోహిత్ శర్మ ఇంత వరకు ఒక్క అర్ధ శతకం కూడా బాదలేదు. ఆడిన ఐదు మ్యాచ్‌లలో కలిఇపి 156 పరుగులు చేశాడు. ఇక రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో చెన్నై ఐదింట మూడు విజయాలతో పట్టికలో మూడోస్థానంలో కొనసాగుతోంది. చదండి: IPL 2024 LSG Vs DC: అరంగేట్రంలోనే అదరగొట్టాడు.. ఎవరీ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } });
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019