breaking news
-
కడప కోర్టు ఉత్తర్వుల రద్దు కోరుతూ పిటిషన్లు
సాక్షి, అమరావతి: సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు పెండింగ్‌లో ఉన్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ నర్రెడ్డి సునీత, టీడీపీ నేత రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్ రవి) హైకోర్టును ఆశ్రయించారు. కడప జిల్లా కోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ వారు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం గురించి బీటెక్ రవి తరఫు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావించారు. అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. అత్యవసర విచారణ అవసరం లేదన్న ధర్మాసనం ఈ వ్యాజ్యంపై బుధవారం విచారణ జరుపుతామంది. ఈ వ్యాజ్యం విచారణ నుంచి తాము తప్పుకుంటామని ధర్మాసనం మౌఖికంగా తెలిపింది. ‘మా వాదన వినలేదు’ కడప జిల్లా కోర్టు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా, తమ వాదన వినకుండా ఏకపక్షంగా తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులిచ్చిందని బీటెక్ రవి, సునీత తమ వ్యాజ్యాల్లో పేర్కొన్నారు. బాధితులు సూట్ దాఖలు చేయాల్సి ఉండగా.. పార్టీ తరఫున దాఖలు చేశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కడప జిల్లా కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చి ఉండాల్సింది కాదన్నారు. ఆ ఉత్తర్వులు చెల్లుబాటు కావన్నారు. కడప కోర్టు తన పరిధి దాటి వ్యవహరించిందని పేర్కొన్నారు. మధ్యంతర ఉత్తర్వుల ద్వారా కడప కోర్టు తమ వాక్ స్వాతంత్య్రపు హక్కును నిరోధించిందని, ఇది సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమన్నారు. మధ్యంతర ఉత్తర్వుల పేరుతో జిల్లా కోర్టు తుది అభిప్రాయానికి వచ్చిందన్నారు. ఎన్నికల వేళ ప్రజాబాహుళ్యంలో ఉన్న వాస్తవాలను ప్రజలకు తెలియచేసే హక్కు తమకు ఉందన్నారు. -
Delhi High Court : జేమ్స్‌బాండ్ సీక్వెల్సా?
న్యూఢిల్లీ: కేజ్రీవాల్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలంటూ పదేపదే పిటిషన్లు దాఖలవడంపై ఢిల్లీ హైకోర్టు అసహనం వ్యక్తంచేసింది. ఆప్ మాజీ ఎమ్మెల్యే సందీప్ కుమార్ వేసిన ఈ తరహా పిటిషన్‌పై ఆగ్రహం వెలిబుచ్చింది. ‘‘దీనిపై ఢిల్లీ లెఫ్ట్గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని గతంలోనే స్పష్టం చేసినా పదేపదే అవే పిటిషన్లు వేస్తున్నారు. ఇవేమీ జేమ్స్‌బాండ్ సినిమా సీక్వెల్స్ కావు. వ్యవస్థను వెక్కిరించేలా పిటిషన్లు వేస్తే ఊరుకోం. మీకు రూ.50,000 జరిమానా వేస్తాం’’ అని సందీప్‌ను హెచ్చరించింది. ఆయన తరఫున లాయర్ వాదించబోయినా, ‘‘రాజకీయ ప్రసంగాలు ఇవ్వాలనుకుంటే వీధి చివరికెళ్లి ఇచి్చ రండి. మీ క్లయింట్ నేత కాబట్టి రాజకీయాలు చేస్తారు. మేం రాజకీయాల్లో మునగదల్చుకోలేదు’’ అని స్పష్టం చేసింది. -
‘సీఏఏ’పై వందల పిటిషన్లు.. నేడు సుప్రీంకోర్టు విచారణ
న్యూఢిల్లీ: కేంద్రం ఇటీవల అమలులోకి తీసుకువచ్చిన సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్(సీఏఏ)పై స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం(మార్చ్ 19)న విచారించనుంది. సీఏఏపై స్టే కోరుతూ సుప్రీంలో ఇప్పటివరకు ఏకంగా 230 పిటిషన్లు ఫైల్ అయ్యాయి. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధీవాలా, జస్టిస్ మనోజ్‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించనుంది. సీఏఏ కింద పౌరసత్వం పొందలేకపోయిన ముస్లిం వలసవాదులపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని, ఈ కారణం ఆధారంగా స్టే ఇవ్వాలని కేరళకు చెందిన ఇండియన్ ముస్లిం లీగ్ పిటిషన్లో కోరింది. సీఏఏ సెక్షన్ 6బి కింద ఎవరికి పౌరసత్వాలివ్వకుండా స్టే ఇవ్వాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లే కాక పలు సంస్థలు, ఇతర వ్యక్తులు సీఏఏపై సుప్రీంకు వెళ్లారు. ఇదీ చదవండి.. బాండ్ల నంబర్లేవి -
రేపు ఏపీ స్పీకర్ ముందుకు అనర్హత పిటిషన్లు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ముందు సోమవారం హాజరు కావడంపై ఉత్కంఠ నెలకొంది. రేపు(సోమవారం) ముగ్గురు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు విచారణకు హాజరుకానున్నారు. అయితే గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నట్లు తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు స్పీకర్ ముందుకు వైస్సార్సీపీ రెబల్ ఎమ్మెల్యేలు హాజరై, వివరణ ఇవ్వనున్నారు. ఇక.. వైఎస్సార్సీపీ, టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు విచారణకు రావాలని స్పీకర్ కార్యాలయం నోటీసులు చేసిన విషయం తెలిసిందే. అనర్హత పిటిషన్లపై విచారణకు 29వ తేదీన స్పీకర్ కార్యాలయంలో హాజరు కావాలని సూచించింది. వైఎస్సార్సీపీ రెబల్ ఎమ్మెల్యేల్లో ఆనం రాంనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు. చదవండి: గంటా రాజీనామా ఆమోదం.. టీడీపీలో కొత్త టెన్షన్! -
‘వార్షిక కౌలు’ వ్యాజ్యానికి విచారణార్హత ఉంది
సాక్షి, అమరావతి: రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లించేలా సీఆర్డీఏను, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య, రాజధాని రైతు పరిరక్షణ సమితి దాఖలు చేసిన వ్యాజ్యానికి విచారణార్హత ఉందని హైకోర్టుస్పష్టం చేసింది. ఈ విషయంలో సీఆర్డీఏ లేవనెత్తిన అభ్యంతరాలను హైకోర్టు తోసిపుచ్చింది. అయితే పిటిషన్లు దాఖలు చేసిన సంఘాల్లో ఉన్న సభ్యులందరి వివరాలను కోర్టు ముందుంచాలని పిటిషనర్లను ఆదేశించింది. అంతేకాక ఆ సంఘాల్లోని ప్రతి సభ్యుడి పేరు మీద కోర్టు ఫీజు చెల్లించాలని కూడా ఆదేశాలిచ్చింది. ఇందుకోసం పది రోజుల గడువు ఇచ్చింది. తదుపరి విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వార్షిక కౌలు చెల్లించేలా ఆదేశాలివ్వాలంటూ రైతుల తరఫున అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య, రాజధాని రైతు పరిరక్షణ సమితి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ వ్యాజ్యం విచారణార్హతపై సీఆర్డీఏ అభ్యంతరం లేవనెత్తింది. రైతుల తరఫున సంఘాల పేరుతో పిటిషన్ దాఖలు చేయడానికి వీల్లేదని సీఆర్డీఏ తరఫు న్యాయవాది కాసా జగన్మోహన్రెడ్డి వాదనలు వినిపించారు. రైతులే నేరుగా పిటిషన్ దాఖలు చేసుకోవాలన్నారు. విచారణార్హతపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ సుబ్బారెడ్డి గురువారం తన నిర్ణయాన్ని వెలువరించారు. సీఆర్డీఏ అభ్యంతరాలను తోసిపుచ్చారు. అయితే పిటిషన్ దాఖలు చేసిన రెండు సంఘాల్లో ఉన్న ప్రతీ సభ్యుడి పేరు మీద కోర్టు ఫీజు చెల్లించాలని ఆ సంఘాలను న్యాయమూర్తి ఆదేశించారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019