breaking news
-
అరెస్ట్ వారెంట్ జారీ, త్వరలో జైలుకి మాజీ సీఎం ‘లాలూ’?
పాట్నా : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఎదురు దెబ్బ తగిలింది. మధ్య ప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ నగర ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో ఆయన మరోసారి జైలు శిక్షను అనుభవించనున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్వాలియర్‌లోని కోర్టులో కొనసాగుతున్న అక్రమ ఆయుధాల కొనుగోలుకు సంబంధించిన కేసు నిందితుల్లో లాలూ ప్రసాద్ యాదవ్ ఒకరు. ఆయుధ చట్టం కింద 30 ఏళ్ల నాటి కేసుకు సంబంధించి గ్వాలియర్ ప్రత్యేక కోర్టు ఈ అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు చట్టపరమైన చిక్కుల్ని ఎదుర్కోనున్నారు. 30 ఏళ్ల నాటి కేసు 1997లో మధ్యప్రదేశ్ పోలీసులు అక్రమ ఆయుధాల కేసును నమోదు చేశారు. ఇందులో నిందితులుగా 22 మందిని చేర్చారు. అయితే, ఆ నిందితులు గ్వాలియర్‌లోని మూడు వేర్వేరు సంస్థల నుంచి ఆయుధాలను కొనుగోలు చేసి 1995 నుంచి 1997 మధ్య కాలంలో బీహార్‌లో విక్రయించినట్లు అభియోగాలు మోపారు పోలీసులు. అందుకు తగ్గ ఆధారాల్ని కోర్టు ముందుంచారు. అప్పటి నుంచి గ్వాలియర్ ప్రత్యేక కోర్టులో విచారణ కొనసాగుతుంది. నిందితుల్లో లాలూ ఒకరు మొత్తం 22 మంది నిందితుల్లో 14 మంది పరారీలో ఉండగా, ఆరుగురు విచారణలో ఉండగా, ఇద్దరు చనిపోయారు. ఈ కేసులో అభియోగాలు మోపబడి పరారీలో ఉన్న 14 మందిలో ఒకరే లాలూ ప్రసాద్ యాదవ్. తాజాగా, గ్వాలియర్‌లోని ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు అక్రమ ఆయుధాల కేసుపై విచారణ చేపట్టింది. విచారణ అనంతరం కోర్టు లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. -
చిరాగ్ పాశ్వాన్‌కు ఎదురుదెబ్బ.. 22 మంది నేతల రాజీనామా
పట్నా: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఎన్డీయే కూటమిలోని లోక్‌జనశక్తి పార్టీ (రామ్ విలాస్)(LJP)కి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి షాకిస్తూ పలువురు నేతలు రాజీనామా చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కబర్చిన 22 మంది నేతలకు టికెట్ లభించకపోవటంతో వారంతా రాజీనామా బాటపట్టారు. రాష్ట్ర మాజీ మంత్రి, జాతీయ ఉపాధ్యక్షురాలు రేణు కుష్వాహ, మాజీ ఎమ్మెల్యే, జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్, ఉపాధ్యక్షుడు సంజయ్ సింగ్, సంస్థాగత కార్యదర్శి రవీంద్ర సింగ్ రాజీనామా చేశారు. అదేవిధంగా వారి మద్దతుదారులు పెద్దఎత్తున రాజీనామాలను రాష్ట్ర అధ్యక్షుడు రాజు తివారీకి పంపించారు. శాంభవీ చౌదరీ( సమస్తిపూర్), రాజేశ్ వర్మ (ఖాగారియా), వీణా దేవి ( వైశాలీ) వంటి నేతలకు టికెట్లు కేటాయించటంపై రాజీనామా చేసిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి చిరాగ్ పాశ్వాన్, అతని సన్నిహితులు... డబ్బులకు పార్టీ టికెట్లు అమ్ముకున్నారని మండిపడ్డారు. అయితే ఈ సీట్లలో అభ్యర్థులను ఎంపిక చేసే సమయంలో సీనియర్ నేతల అభిప్రాయలు తీసుకోలేదని కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. ఇక.. నామినేషన్ల ప్రక్రియ సమయంలో తమ నేతలకు టికెట్ కేటాయించకుండా పక్కనపెట్టడంపై పార్టీ కార్యకర్తలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీయే కూటమి పొత్తులో భాగంగా ఎల్జేపీకి బీజేపీ ఐదు సీట్ల కేటాయించిన విషయం తెలిసిందే. కీలకమైన హాజీపూర్ స్థానంలో చిరాగ్ పాశ్వాన్ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా చిరాగ్ బంధువు అరుణ్ భార్తి జాముయి స్థానంలో బరిలోకి దిగుతున్నారు. రాష్ట్ర మంత్రి, జేడీ(యూ) సీనియర్ నేత అశోక్ చౌదరీ కుమార్తె ఈ శంభవీ చౌదరీ. ఆమె తొలిసారి పార్లమెంట్లో ఎన్నికల్లో పోటి చేసి తన అదృష్టం పరిక్షించుకోబోతున్నారు. అయితే ఆమెకు అక్కడి బ్రాహ్మణ, భూమిహార్స్ సామాజిక వర్గాల మద్దతు ఉండటం గమనార్హం. మెజార్టీ దళీతల ఒటర్లు సైతం ఆమెకు మద్దతు ఇవ్వనున్నారు. మరోవైపు... వీణా దేవీ మళ్లీ వైశాలీ సీటు దక్కించుకున్నారు. ఆమె 2019లో అభివక్త ఎల్జేపీ నుంచి ఎంపీగా గెలుపొందారు. అనంతరం చీలిక వర్గంలో పశుపతి కుమార్ పరాస్ వైపు మద్దతు పలికినా.. తర్వాత రామ్ విలాస్ పాశ్వాన్ కుటుంబం మీద గౌరవంతో చిరాగ్ వైపే ఉండటం గమనార్హం. ఇక.. గత 2019 ఎన్నికలో ఎల్జేపీ మొత్తం ఆరుస్థానాల్లో విజయం సాధించింది. హాజీపూర్, వైశాలీ, సమస్తీపూర్, జాముయి. నావాదాలో ఎల్జేపీ గెలుపొందింది. సీట్ల పంపకంలో భాగంగా నావాదా సీటు బీజేపీకి దక్కింది. అయితే, రాజీనామా చేసిన ఎల్జేపీ నేతలంతా ప్రతిపక్షాల ఇండియా కూటమిలో మద్దతు ఇవ్వనున్నట్ల ఊహాగానాలు వస్తున్నాయి. -
టీటీఈని రైలు నుంచి తోసేసిన ప్రయాణికుడు!
కేరళలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ములంగున్నాతుకావు, వడక్కంచెరి రైల్వే స్టేషన్ల మధ్య వెలప్పయ్య త్రిస్సూర్‌లో ఈ ఘటన జరిగింది. ఎర్నాకుళం-పాట్నా ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్ 11 కోచ్‌లో టీటీఈ వినోద్ ప్రయాణికుల టిక్కెట్ల తనిఖీలో భాగంగా ఒక ప్రయాణికుడిని టిక్కెట్ చూపించమని అడిగాడు. ఈ నేపధ్యంలో ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది. ఆగ్రహంతో ఆ ప్రయాణికుడు టీటీఈని వేగంగా వెళుతున్న రైలు నుండి కిందకు తోసేశాడు. దీంతో టీటీఈ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని కేరళ రైల్వే పోలీసులు మీడియాకు తెలిపారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ప్రయాణికుడు రజనీకాంత్ టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నాడు. ఇంతలో టీటీఈ వినోద్ అతనిని టిక్కెట్ అడిగాడు. ఈ నేపధ్యంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మద్యం మత్తులో డోర్ దగ్గర నిలుచున్న ప్రయాణికుడు టీటీఈ వినోద్‌ను కదులుతున్న రైలులో నుంచి కిందకు తోసివేశాడు. ఇంతలో అటువైపు నుంచి వస్తున్న మరో రైలు ఆ టీటీఈని ఢీకొంది. దీంతో టీటీఈ అక్కడకక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రయాణికుడు రజనీకాంత్‌ను పాలక్కడ్‌లో అరెస్టు చేశారు. -
పాట్నా సివిల్ కోర్టు వద్ద పేలుడు..
పాట్నా: బిహార్‌లోని పాట్నా సివిల్ కోర్టు వద్ద ట్రాన్స్ఫార్మర్ పేలడంతో ఇద్దరు మరణించారు. వీరిలో ఒకరు లాయర్ కూడా ఉన్నారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం మధ్యాహ్నం ఆ ఘటన వెలుగుచూసింది. సివిల్ కోర్టు కాంప్లెక్స్ వద్ద ఇటీవల ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. ఈ క్మంలో ఒక్కసారిగా ప్రమాదవశాత్తు ట్రాన్స్ఫర్మర్ పేలుడు సంభవించడంతో భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సివిల్ కోర్టు కాంప్లెక్స్‌లోని గేట్ నంబర్ వన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఓ న్యాయవాదితో పాటు మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. న్యాయవాదిని దేవేంద్ర ప్రసాద్‌గా గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.ప్రమాదంపై న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు రంగంలోకి దిగి న్యాయవాదులను శాంతింప జేశారు. ప్రమాదంలో భారీగానే నష్టం జరిగినట్లు తెలుస్తోంది. చదవండి: ‘సోదరుడిపై సీఎం మమత ఫైర్.. అన్ని బంధాలు తెంచుకున్నా’ -
మరో ‘వందే భారత్’ ట్రయల్ రన్ విజయవంతం
ఇది రామ భక్తులకు పండుగలాంటి వార్త. అయోధ్యలోని రాములోరిని చూసేందుకు యూపీ భక్తులు ఇకపై కాషాయ రంగులో మెరిసిపోయే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాల్సి ఉంటుంది. ఈ వందే భారత్ రైలు యూపీ రాజధాని పట్నా నుండి అయోధ్య మీదుగా లక్నో వరకు నడుస్తుంది. ఈ రైలుకు సంబంధించిన తుది ట్రయల్ రన్ కూడా పూర్తయింది. ఈ ట్రయల్ రన్లో ఈ రైలు నిర్ణీత సమయానికి ముందుగానే లక్నోకు చేరుకుంది. ఈ రైలును మార్చి 12న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. కాగా అధికారికంగా ఈ రైలు టైమ్ టేబుల్‌ను ఇంకా విడుదల చేయలేదు. పట్నా నుంచి అయోధ్య మీదుగా లక్నో వరకు నిర్వహించిన ఈ రైలు ట్రయల్ రన్లో నిర్ణీత సమయానికి 15 నిమిషాల ముందుగా వారణాసి, 12 నిమిషాల ముందుగా అయోధ్య , 20 నిమిషాల ముందుగా లక్నో చేరుకుంది. ట్రయల్ రన్లో ఈ రైలు ఉదయం 6:05 గంటలకు పట్నా నుంచి లక్నోకు బయలుదేరింది. ఈ సమయంలో రైలు వేగం 130 కి.మీ.గా ఉంది.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019