breaking news
-
జొకోవిచ్‌కు లారియస్ అవార్డు
పురుషుల టెన్నిస్ ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ ప్రతిష్టాత్మక లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ వార్షిక అవార్డుల్లో మెరిశాడు. 2023 సంవత్సరానికిగాను పురుషుల విభాగంలో ఈ సెర్బియా దిగ్గజం ‘ఉత్తమ క్రీడాకారుడు’ పురస్కారం గెల్చుకున్నాడు. జొకోవిచ్‌కు ఈ అవార్డు లభించడం ఇది ఐదోసారి. 2023లో జొకోవిచ్ ఆ్రస్టేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించడంతోపాటు వింబుల్డన్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచాడు. సీజన్‌ను టాప్ ర్యాంక్‌తో ముగించాడు. మహిళల విభాగంలో స్పెయిన్ ఫుట్‌బాల్ ప్లేయర్ బొన్మాటి ‘ఉత్తమ క్రీడాకారిణి’ అవార్డు అందుకుంది. -
జొకోవిచ్‌కు చుక్కెదురు
మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. 2015 తర్వాత ఈ టోర్నీలో మళ్లీ సెమీఫైనల్ ఆడిన జొకోవిచ్ 4–6, 6–1, 4–6తో కాస్పర్ రూడ్ (నార్వే) చేతిలో ఓడిపోయాడు. జొకోవిచ్పై రూడ్కిదే తొలి విజయం కావడం విశేషం. గతంలో ఈ సెర్బియా స్టార్‌తో ఆడిన ఐదుసార్లూ రూడ్ ఓటమి చవిచూశాడు. మరో సెమీఫైనల్లో సిట్సిపాస్ (గ్రీస్) 6–4, 3–6, 6–4తో యానిక్ సినెర్ (ఇటలీ)పై గెలిచాడు. -
‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’
మోంటెకార్లో: భారత ఆటగాడు రోహన్ బోపన్న 44 ఏళ్ల వయసులో టెన్నిస్ వరల్డ్ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ఇటీవలే నంబర్‌వన్‌కు చేరాడు. సింగిల్స్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ కూడా తాజా ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచిన అతి పెద్ద వయస్కుడిగా (36 ఏళ్లు) గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఇద్దరు ఆటగాళ్ల మధ్య తమ వయసుకు సంబంధించిన ఆసక్తికర సంభాషణ జరిగింది. ‘టెన్నిస్ మనకు ఎంతో నేర్పించింది. అనుభవం మంచి విజయాలు అందిస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సినంత ఉంది‘ అని బోపన్న వ్యాఖ్యానించగా... ‘అనుభవం మాత్రమే కాదు. ప్రతీ రోజు ఆట పట్ల అంకితభావం చూపడమే మనల్ని ఈ స్థానంలో నిలిపింది’ అని జొకోవిచ్ బదులిచ్చాడు. ఇద్దరు నంబర్‌వన్ ఆటగాళ్లు కలిసిన అరుదైన ఘట్టం సెర్బియా, భారత టెన్నిస్‌కు సంబంధించి ప్రత్యేకమైందన్న జొకోవిచ్...త్వరలోనే భారత గడ్డపై ఆడాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ తమ సంభాషణను నమస్తేతో జొకోవిచ్ ముగించాడు. -
Indian Wells: జొకోవిచ్ శుభారంభం
ఐదేళ్ల తర్వాత ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో బరిలోకి దిగిన సెర్బియా టెన్నిస్ స్టార్ జొకోవిచ్ శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ ఆడిన జొకోవిచ్ 6–2, 5–7, 6–3తో ప్రపంచ 69వ ర్యాంకర్ అలెగ్జాండర్ వుకిచ్ (ఆ్రస్టేలియా)పై గెలిచాడు. ‘మాస్టర్స్ సిరీస్’ ఈవెంట్స్‌లో జొకోవిచ్‌కిది 400వ విజయం కావడం విశేషం. కేవలం రాఫెల్ నాదల్ (స్పెయిన్) మాత్రమే మాస్టర్స్ టోర్నీల్లో 400కంటే ఎక్కువ మ్యాచ్‌ల్లో గెలుపొందాడు. -
క్వార్టర్ ఫైనల్లో కిరణ్ జార్జి పరాజయం
ఇండోనేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ప్లేయర్ కిరణ్ జార్జి పోరాటం ముగిసింది. జకార్తాలో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 36వ ర్యాంకర్ కిరణ్ జార్జి 14–21, 6–21తో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయాడు. ఫైనల్లో భారత మహిళల హాకీ జట్టు మహిళల హాకీ ఫైవ్స్ ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. మస్కట్‌లో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి రజని కెపె్టన్సీలోని భారత జట్టు 6–3తో దక్షిణాఫ్రికాపై నెగ్గింది. ఫైనల్లో నెదర్లాండ్స్‌తో భారత్ ఆడుతుంది. సెమీఫైనల్లో భారత్ తరఫున అక్షత, మరియానా, ముంతాజ్, రుతుజా, జ్యోతి అజ్మీనా ఒక్కో గోల్ చేశారు. ఈ టోర్నీలో తెలంగాణకు చెందిన యెండల సౌందర్య భారత జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తోంది. Australian Open 2024- మెల్బోర్న్: ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో కొత్త చాంపియన్ అవతరించడం ఖాయమైంది. ఇటలీకి చెందిన 22 ఏళ్ల యానిక్ సినెర్.. ఫైనల్లోమెద్వెదెవ్తో తలపడనున్నాడు. జొకోవిచ్‌ను ఓడించిన సినెర్.. జ్వెరెవ్ (జర్మనీ)పై గెలిచి మెద్వెదేవ్ ఫైనల్‌కు అర్హత సాధించాడు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019