breaking news
-
Check Indexing article homepage garvit
Check Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing articleCheck Indexing article -
పక్కా సమాచారం.. పకడ్బందీ వ్యూహం
మృతి చెందిన మావోయిస్టుల్లో గుర్తించింది వీరినే.. 1. సిరిపల్లె సుధాకర్ అలియాస్ శంకర్ రావు (మావోయిస్టు పార్టీ డీకే టాప్ కమాండర్), డీవీసీ మెంబర్, నార్త్ బస్తర్ మాస్ ఇన్చార్జి, భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె 2. దాశశ్వర్ సుమన అలియాస్ రజిత, డీసీఎస్, సిరిపల్లె సుధాకర్ అలియాస్ శంకర్ భార్య, ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూరు 3. లలిత, డీవీసీ మెంబర్, జన తన సర్కార్ కమిటీ ఇన్చార్జి 4. మాధవి, నార్త్ బస్తర్ మెంబర్ 5. జగ్ను అలియాస్ మాలతి, పర్థాపూర్ ఏరియా కమిటీ 6. రాజు సలామ్ అలియాస్ సుఖాల్, పర్థాపూర్ ఏరియా కమిటీ మెంబర్ 7. వెల సోను అలియాస్ శ్రీకాంత్ సోను, పర్థాపూర్ ఏరియా కమిటీ మెంబర్ 8. రాణిత అలియాస్ జయమతి, రూపి, ప్రాగ్ ఎల్వోసీ కమాండర్ 9. రామ్ షీలా, నార్త్ బస్తర్ డివిజన్ కమిటీ మెంబర్ సాక్షి ప్రతినిధి, వరంగల్: పక్కాగా అందిన సమాచారం, పకడ్బందీ వ్యూహం నేపథ్యంలోనే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బస్తర్ డివిజన్లో భారీ ఎన్కౌంటర్ జరిగినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. సోమవారం సాయంత్రం పోలీస్ ఇన్ఫార్మర్ పేరిట కాంకేర్ జిల్లాలో ఒకరిని హతమార్చిన మావోయిస్టులు.. అదే ప్రాంతంలో సమావేశం అయ్యారన్న సమాచారంతో బలగాలు ప్రత్యేక వ్యూహంతో కూంబింగ్ చేపట్టాయి. ఈ సందర్భంగా జరిగిన ఎన్కౌంటర్లోనే 29 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసు అధికారులు ప్రకటించారు. వీరిలో 15 మంది మహిళలు కాగా, 14 మంది పురుషులు ఉన్నారు. ఘటనా స్థలంలో ఏకే–47, ఎల్ఎంజీ, ఇన్సాస్ లాంటి అత్యాధునిక ఆయుధాలను స్వాదీనం చేసుకున్నట్లు బస్తర్ ఐజీ సుందర్రాజ్, కాంకేర్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఇంద్ర కళ్యాణ్ ఎల్లిసెల బుధవారం రాత్రి వెల్లడించారు. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను వారు తెలియజేశారు. ఇప్పటివరకు 9 మంది మావోయిస్టులను గుర్తించామన్నారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం వడ్ల రామపురానికి చెందిన సుగులూరి చిన్నన్న అలియాస్ శంకర్రావు ఉన్నట్లు భావించామని, అయితే బుధవారం రాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగెకు చెందిన సిరిపల్లె సుధాకర్ అలియాస్ మురళి, అలియాస్ శంకర్‌గా గుర్తించినట్లు వెల్లడించారు. ఆయనతో పాటు ఇప్పటివరకు గుర్తించిన మొత్తం 9 మంది పేర్లను తెలిపారు. మిగతా వారిని గుర్తించే పనిలో ఉన్నట్లు చెప్పారు. ఆపరేషన్ యాంటీ మావోయిస్టులు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఛత్తీస్‌గఢ్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఆపరేషన్ యాంటీ మావోయిస్టులు పేరిట ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు గతంలోనే కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో అందిన సమాచారం మేరకు.. మంగళవారం ఉదయం నుంచి కాంకేర్ జిల్లా అటవీ ప్రాంతంలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పోలీసులు (డీఆర్జీ), కేంద్ర భద్రతా బలగాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టినట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు బుధవారం ప్రకటించారు. లోక్‌సభ మొదటి విడత ఎన్నికల్లో భాగంగా ఈనెల 19న 102 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఇందులో దండకారణ్య ప్రాంతంలోని బస్తర్, మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న మహారాష్ట్రలోని గడ్చిరోలి స్థానాలు కూడా ఉన్నాయి. ఎన్కౌంటర్ జరిగిన కాంకేర్ పార్లమెంట్ స్థానానికి రెండో విడతలో ఈ నెల 26న పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో నెల రోజులుగా నిఘా వేసిన పోలీసు వర్గాలకు అందిన పక్కా సమాచారంతో కూంబింగ్ చేపట్టగా ఎన్కౌంటర్ జరిగినట్లు చెబుతున్నారు. మృతి చెందిన వారిలో ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ పోలీసుల దృష్టిలో మోస్ట్ వాంటెడ్‌లుగా ఉన్న పలువురు టాప్ కమాండర్లు ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. నాలుగైదు రోజుల ముందే అగ్రనేతలు, ఆర్కేబీ డివిజన్ కమిటీ ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన నేపథ్యంలో రావ్‌ఘాట్ ఏరియా కమిటీ (పర్థాపూర్)మాత్రమే ఛోటె బెటియా పోలీసుస్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో చిక్కుకుపోయి పోలీసుల ఎదురుకాల్పుల్లో పూర్తిగా తుడిచిపెట్టుకు పోయినట్లు సమాచారం. ముగిసిన 25 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం చిట్యాల: విప్లవ గీతాలకు ఆకర్షితుడై 25 ఏళ్లక్రితం అడవి బాటపట్టిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగెకు చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్ విగతజీవుడై గ్రామానికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. సిరిపెల్లి రాజపోశమ్మ–ఓదెలు దంపతుల కుమారుడు సుధాకర్ 1996లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఆ తరువాత లొంగిపోయి జైలు జీవితం గడిపాడు. 1998లో మళ్లీ అడవి బాట పట్టాడు. దళ సభ్యుడి నుంచి నిజామాబాద్ జిల్లా కమిటీ సభ్యుడిగా, అనంతరం శంకర్ పేరుతో ఛత్తీస్‌గఢ్ ఏరియాలో జిల్లా కార్యదర్శిగా ఎదిగాడు. సుధాకర్ తండ్రి చనిపోగా, తల్లి వృద్ధాప్యంలో ఉంది. బస్తర్ ఎన్కౌంటర్లో సుధాకర్ చనిపోయాడని తెలియడంతో తల్లి, బంధువులు ఛత్తీస్‌గఢ్ వెళ్లి మృతదేహాన్ని గుర్తించారు. సుధాకర్ భార్య సుమన మృతదేహాన్ని ఆమె బంధువులకు అప్పగించినట్లు తెలిసింది. ఎన్కౌంటర్ మృతుల్లో చిన్నన్న లేడు ధ్రువీకరించిన సోదరులు ఆత్మకూరు రూరల్: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మరణించిన 29 మంది మావోయిస్టుల్లో ఏపీలోని నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం వడ్ల రామాపురం గ్రామానికి చెందిన సుగులూరి చిన్నన్న అలియాస్ శంకర్రావు, అలియాస్ నాగన్న అలియాస్ విజయ్ కూడా ఉన్నాడనే ప్రచారం జరుగుతోంది. అయితే స్థానిక పోలీసులు చూపించిన ఎన్కౌంటర్ మృతుల ఫొటోల్లో చిన్నన్న లేడని ఆయన సోదరులు ధ్రువీకరించారు. సుగులూరి చిన్నన్న 1996లో అప్పటి పీపుల్స్‌వార్‌లో పూర్తికాల సభ్యుడిగా చేరారు. తొలుత కర్నూలు జిల్లాలో అప్పటి భవనాసిదళం సభ్యుడిగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన..2006 తర్వాత దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీలోకి వెళ్లినట్లు సమాచారం. తదనంతర కాలంలో దండకారణ్యం స్పెషల్ జోనల్ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, రాజ్‌నంద్‌గావ్–కాంకేర్ డివిజన్ కార్యదర్శిగా విజయ్ పేరుతో కొనసాగుతున్నట్లు పోలీసు రికార్డుల ఆధారంగా తెలుస్తోంది. -
Bastar Encounter: 29 మంది మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ బస్తర్ అడవుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మృతిచెందిన 29 మంది నక్సలైట్ల మృతదేహాలకు శవపరీక్ష జరుగుతోందని బస్తర్ రేజం్ ఐజీ సుందరరాజన్ తెలిపారు. ఎన్ కౌంటర్ మృతుల్లో 15 మంది మహిళా మావోయిస్టులు, 14 మంది పురుషు నక్సల్స్ ఉన్నారని పేర్కొన్నారు. డీఆర్జీ, బీఎస్ఎఫ్ జవాన్లు సంయుక్తంగా నక్సల్స్‌ను చుట్టు ముట్టి మంచి ఫలితాలు సాధించారన్నారు. నాలుగు గంటల పాటు హోరా హోరిగా ఎదురు కాల్పులు జరిగాయని చెప్పారు. దండకారణ్యం మరోమారు నెత్తురోడింది. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ అడవుల్లో భారీ ఎన్కౌటర్లో భారీ ఎన్కౌటర్తో 29 మంది మావోయిస్టులు మరణించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు కూడా గాయపడ్డారు. బస్తర్ అడవుల్లోని కాంకేరు జిల్లా ఛోట్ బెటియా ప్రాంతంలో ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో ఏపీకి చెందిన అగ్రనేత సుగులూరి చిన్నన్న అలియాస్ శంకర్రావు ఉన్నారు. ఈయన పై 25 లక్షల రివార్డు ఉంది. ఇద్దరు తెలంగాణ వాసులను కూడా గుర్తించారు. జయశంకర్-భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగకు చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్రావు, ఆయన భార్య, ఆదిలాబాద్ జిల్లా హత్నూర్‌కు చెందిన దాసర్వర్ సుమన అలియాస్ రజిత కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో ఏడు ఏకే–47లు, మూడు ఎల్ఎంజీలు, ఇతర ఆయుధాలు స్వాదీనం చేసుకున్నారు. నెలరోజుల్లో 79 మంది లోక్‌సభ ఎన్నికల ముంగిట బస్తర్ అడవుల్లో భీతావహ పరిస్థితి నెలకొంది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా దళాలు పట్టుదలగా అడవుల్లోకి చొచ్చుకెళ్తున్నాయి. గడిచిన 30 రోజుల్లో జరిగిన వివిధ ఎన్కౌంటర్లలో మావోయిస్టు పార్టీకి చెందిన 79 మంది మరణించారు. వరుస ఎదురుదెబ్బలతో కేంద్ర మావోయిస్టు పార్టీ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇక ఛత్తీస్‌గఢ్‌లో ఈనెల 19న లోక్‌సభ ఎన్నికల తొలి విడత, 26న రెండో దశ పోలింగ్ జరగనుంది. -
Lok Sabha Elections 2024: 20 ఏళ్ల తర్వాత ఓటు
న్యూఢిల్లీ: మావోయిస్టు ప్రభావిత జార్ఖండ్‌లోని సింగ్భూమ్ లోక్‌సభ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలు రెండు దశాబ్దాల అనంతరం మొదటిసారిగా 2024 ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఓటర్ల సౌలభ్యం కోసం మావోయిస్టులకు కంచుకోటల్లాంటి మారుమూల ప్రాంతాల్లో 118 బూత్‌లను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కుల్దీప్ చౌదరి చెప్పారు. ఆసియాలోనే అత్యంత దట్టమైన సాల్ అడవుల్లో ఉన్న సరండా వంటి 118 గ్రామాల్లోకి మే 13వ తేదీన జరిగే పోలింగ్‌కు సిబ్బందితోపాటు సామగ్రిని హెలికాప్టర్ల ద్వారా పంపుతామన్నారు. నుగ్డి గ్రామంలోని మిడిల్ స్కూల్, బొరెరో గ్రామంలోని మధ్య విద్యాలయలో మొదటిసారిగా పోలింగ్ బూత్‌లను నెలకొల్పామన్నారు. కొన్ని ప్రాంతాల్లోకి సిబ్బంది నాలుగైదు కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి ఉంటుందని వివరించారు. ఏ ప్రాంతాన్నీ వదలకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ‘ఆపరేషన్ అనకొండ’ ద్వారా భద్రతా బలగాలు తల్కోబాద్ వంటి 25 వరకు గ్రామాల్లో 15 కొత్త క్యాంపులను ఏర్పాటు చేసి, భద్రతను కట్టుదిట్టం చేశాయని పేర్కొన్నారు. 121 పోలింగ్ బృందాలను రైళ్ల ద్వారా పంపించామన్నారు. దివ్యాంగులు, 85 ఏళ్లు పైబడిన వారికి ఇళ్ల వద్దే ఓటు వేసే సదుపాయం కలి్పంచినట్లు చెప్పారు. ఎస్టీ్ట రిజర్వుడు స్థానమైన సింగ్భూమ్లో బీజేపీ నుంచి మాజీ సీఎం మధు కోడా భార్య, సిట్టింగ్ ఎంపీ గీతా కోడా రంగంలో ఉన్నారు. ఇండియా కూటమి అభ్యరి్థని ప్రకటించాల్సి ఉంది. -
ముగిసిన అన్నె సంతోష్ అంత్యక్రియలు
కాటారం: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్ సమీపంలోని కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు అన్నె సంతోష్ అలియాస్ సాగర్ అలియాస్ శ్రీధర్ అంత్యక్రియలు ఆదివారం ఆయన స్వగ్రామం కాటారం మండలం అంకుషాపూర్ జీపీ పరిధిలోని దస్తగిరిపల్లిలో పూర్తయ్యాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, పలు సంఘాలు, మాజీ మావోయిస్టు నేతలు అన్నె సంతోష్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు. అంతకుముందు విప్లవ గీతాలు, నినాదాలతో అంకుషాపూర్ నుంచి దస్తగిరిపల్లిలోని తన ఇంటి వరకు సంతోష్ మృతదేహాన్ని ర్యాలీగా తీసుకువచ్చారు. 23 ఏళ్ల తర్వాత సంతోష్ విగతజీవిగా రావడం చూసి గ్రామస్తులు బోరున విలపించారు. కాగా, అమరుల బంధు మిత్రుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శాంతక్క, సత్యవతి, విరసం నాయకులు బలసాని రాజయ్య, మహేందర్, శంకర్, ప్రగతిశీల నాట్యమండలి కళాకారులు నవత, పౌరహక్కుల సంఘం నాయకుడు వినోద్, ప్రజాఫ్రంట్ నాయకులు కొంరయ్య, రవి, తదితరులు.. సంతోష్‌కు నివాళులర్పించారు. సాయంత్రం స్వగ్రామం చేరుకున్న సంతోష్ మృతదేహం.. కర్రెగుట్ట అడవుల్లో శనివారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో అన్నె సంతోష్ అలియాస్ సాగర్ మృతి చెందినట్లు బీజాపూర్ పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న కాటారం పోలీసులు సాయంత్రం అధికారికంగా నిర్ధారించారు. సంతోష్ మృతదేహాన్ని గుర్తించడానికి ఆదివారం అర్ధరాత్రి ఓ ప్రజాప్రతినిధి ద్వారా తల్లిదండ్రులు అన్నె ఐలయ్య, సమ్మక్కను బీజాపూర్‌కు పంపించారు. వారు ఉదయం అక్కడికి చేరుకునే లోగా సంతోష్‌గా భావించే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రుల గుర్తింపు కోసం ఉంచారు. వారు తమ కుమారుడే అని గుర్తించడంతో మృతదేహాన్ని అప్పగించారు. దీంతో సంతోష్ మృతదేహం స్వగ్రామానికి చేరుకోవడానికి సాయంత్రమైంది. కొనసాగిన పోలీసుల నిఘా.. సంతోష్ అంత్యక్రియల సమయంలో అడుగడుగునా పోలీసులా నిఘా కొనసాగింది. ఇంటెలిజెన్స్, సివిల్ పోలీసులు మఫ్టీలో సంతోష్ అంత్యక్రియలను పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ నిఘా పెట్టారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019