breaking news
-
సారా.. నారా అండతో దోపిడీకి C/O సీఎం రమేష్
దోచుకో.. పంచుకో.. సూత్రం సారా వ్యాపారంలో ఆరితేరిపోయిన సీఎం రమేష్‌ను చంద్రబాబు నాయుడుకు దగ్గర చేసింది. సారా వ్యాపారంతో మొదలైన ఆర్జన ఇరిగేషన్ కాంట్రాక్టుల వరకు వెళ్లింది. టీడీపీ ప్రభుత్వం ఉన్నంతకాలం ఈ అక్రమార్జనపరుడికి ఎదురే లేకుండా పోయింది. రిత్విక్ కన్స్ట్రక్షన్స్ పేరుతో హంద్రీ –నీవా, వెలిగొండ, తెలుగుగంగ,గుంతకల్లు బ్రాంచి కెనాల్, వంశధార.. ఒకటేమిటి.. అధికారంలో బాబు అండతో సీఎం రమేష్ అక్రమాల్లో చెలరేగిపోయారు. బాబు– సీఎం రమేష్లది ఆర్థిక రాజకీయ బంధం. ఈ బంధం ఫెవికాల్ అంతదృఢంగా పెనవేసుకుపోయింది. బాబుతో ముడిపడిన ఆర్థిక బంధం రెండు టర్మ్‌ల్లో సీఎం రమేష్‌ను రాజ్యసభ సభ్యుడిని చేసింది. రాజకీయ చక్రం బాగా తిప్పుతారని సదరు బాబు సూచనతో బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఇతనికి ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగాలనిపించింది. స్థానికంగా అంత సీన్ లేనందున తన అక్రమాల నేపథ్యం తెలియని కోస్తాంధ్ర వైపు దృష్టి సారించారు. సాక్షి ప్రతినిధి, కడప : స్వయం కృషితో కష్టపడి ఉన్నత స్థాయికి చేరేవారు కొందరైతే, రాజకీయ అండ దొరకబుచ్చుకుని చెలరేగిపోయే వారు ఇంకొందరు. ఇందులో రెండో కోవకు చెందిన నేత చింతకుంట మునెయ్యగారి (సీఎం) రమేష్ నాయుడు. ఉరఫ్ సీఎం రమేష్. చిత్తూరు జిల్లా సారా వ్యాపారంలో చంద్రబాబుతో ఏర్పడ్డ సాన్నిహిత్యం ఉన్నత స్థాయికి ఎదిగేలా చేసింది. అదీ ఏ స్థాయిలో అంటే సొంత తమ్ముడు నారా రామ్మూర్తినాయుడినే బాబు పక్కన పెట్టే స్థాయిలో సంబంధాలు పెనువేసుకున్నాయని పరిశీలకుల అభిప్రాయం. విభజిత ఏపీలో సీఎం రమేష్‌నాయుడు కాంట్రాక్టు సంస్థ దినదినాభివృద్ధి చెందింది. చంద్రబాబు ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని అనేక అక్రమ కార్యకలాపాలను శరవేగంగా నడిపారు. ఎంతలా అంటే 2019 ఎన్నికల నోటిఫికేషన్‌కు కేవలం ఒక్క రోజు ముందే ఈయన కాంట్రాక్టు సంస్థకే ఇరిగేషన్ పనులు దక్కేలా చక్రం తిప్పారు. ఒక్కమాటలో చెప్పాలంటే టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్నాళ్లూ సీఎం రమేష్ ఆర్థిక సామ్రాజ్యం విస్తరించింది. ఎవరీ సీఎం రమేష్‌నాయుడు? వైఎస్సార్ జిల్లా యర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామానికి చెందిన చింతకుంట మునెయ్యగారి (సీఎం) సుబ్బానాయుడు మాజీ మంత్రి ఎంవీ మైసూరారెడ్డి అనుచరుడు. సారా వ్యాపారంలో రాణించారు. కడప జిల్లాలో పలుపాంత్రాల్లో ఈ వ్యాపారాన్ని విస్తరించారు. ఆయనకు నలుగురు కుమారులు. మునిస్వామినాయుడు, గోవర్ధన్‌నాయుడు, సత్యనారాయణనాయుడు, గోపాల్‌నాయుడు. తండ్రి సుబ్బానాయుడు వారసత్వంగా కుమారులు పలువ్యాపారాలను విస్తరించారు. ఈ క్రమంలో మునిస్వామినాయుడు సారా వ్యాపారాన్ని కొనసాగించారు. అప్పట్లో కడప జిల్లాలో వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న సారా కాంట్రాక్టును చిత్తూరు జిల్లాకు విస్తరించారు. ఈ జిల్లాలో సారా కాంట్రాక్టు కార్యకలాపాలను మునిస్వామినాయుడు కుమారుడు సీఎం రమేష్‌నాయుడు కొనసాగించారని ఈ వ్యవహారం మొత్తం తెలిసిన పలువురు వివరిస్తున్నారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లాలో అప్పటికే క్రియాశీలకంగా ఉన్న చంద్రబాబుతో సాన్నిహిత్యం కోసం తొలుత తమ్ముడు నారా రామ్మూర్తినాయుడితో సీఎం రమేష్ దోస్తీ చేశారు. క్రమంగా వీరి సాన్నిహిత్యం పెరిగి, తుదకు నారా రామ్మూర్తినాయుడినే చంద్రబాబు నుంచి దూరం పెట్టేలా చేసింది. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన యువతిని సీఎం రమేష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దాంతో వెలమ సామాజిక వర్గానికి చెందిన సీఎం రమేష్ బాబుకు మరింత దగ్గరైనట్లు సమాచారం. అనంతరం 1994 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఆయనకు చంద్రగిరి, కుప్పం నియోజకవర్గాల సమన్వయ బాధ్యతలు అప్పగించినట్లు పలువురు చెబుతున్నారు. 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో సీఎం రమేష్ సారా వ్యాపార సామ్రాజ్యం వేగంగా విస్తరించినట్లు సమాచారం. అప్పటి సాన్నిహిత్యమే అంచెలంచెలుగా ఎదిగి టీడీపీ నుంచి రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యే స్థాయికి చేరుకుందని విశ్లేషకులు వివరిస్తున్నారు. టీడీపీ హయాంలో రూ.3,658 కోట్ల పనులు రాష్ట్ర విభజన అనంతరం టీడీపీ అధికార పగ్గాలు చేపట్టింది. రిత్విక్ కన్స్ట్రక్షన్స్కు ఇదో వరంగా పరిణమించింది. అప్పటి వరకూ వివిధ రాష్ట్రాల్లో కాంట్రాక్టు పనులు చేస్తూ ఆర్థిక లోటుపాట్లతో ఇబ్బందులు పడుతున్న ఆ సంస్థకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదరించి అండగా నిలిచింది. ఈ క్రమంలో ఈ సంస్థకు కాంట్రాక్టు పనుల వరద పారిందని పలువురు వివరిస్తున్నారు. అందులో ప్రధానంగా కుప్పం బ్రాంచ్ కెనాల్ రూ.522 కోట్లు, హంద్రీ–నీవా సుజల స్రవంతి ఫేజ్–2 రూ.1000 కోట్లు, హెచ్ఎన్ఎస్ఎస్ విస్తరణ పనులు రూ.195 కోట్లు, హెచ్ఎన్ఎస్ఎస్ 34వ ప్యాకేజీ రూ.234 కోట్లు, జీఎన్ఎస్ఎస్ ప్రాజెక్టులో రూ.350 కోట్లు, వెలిగొండ టన్నెల్ రూ.270 కోట్లు, తెలుగుగంగ లైనింగ్ పనులు రూ.289 కోట్లు, గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ రూ.172 కోట్లు, వంశధార ప్రాజెక్టు పనులు రూ.120 కోట్లు, ఆర్టీపీపీ 6వ ప్లాంటు నిర్మాణ పనులు రూ.400 కోట్లు, గండికోట ప్రాజెక్టు పునరావాస నిర్మాణం పనులు రూ.106 కోట్ల పనులు దక్కినట్లు పలు కాంట్రాక్టు సంస్థలు వెల్లడిస్తున్నాయి. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో దాదాపు రూ.3,658 కోట్ల పైబడిన కాంట్రాక్టులను ఆ సంస్థ కొనసాగిస్తున్నట్లు పలువురు కాంట్రాక్టర్ల విశ్వసనీయ సమాచారం. అదే విషయాన్ని ప్రొద్దుటూరు నియోజకవర్గ అప్పటి టీడీపీ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి (ప్రస్తుత టీడీపీ అభ్యర్థి) సైతం పలుమార్లు స్పష్టం చేశారు. ఎంపీ రమేష్‌నాయుడుకు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్ దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు. ఆర్టీపీపీలో అడ్డగోలు టీడీపీ ఎంపీ హోదాలో రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రమేష్ దందా నిర్వహిస్తే, సోదరుడు సీఎం సురేష్‌నాయుడు స్థానికంగా ఆర్టీపీపీ (రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్) కేంద్రంగా దోపిడీ చేశారు. ఇనుము (స్క్రాప్), సిమెంటు, కంకర యథేచ్ఛగా తరలించారు. తన దారికి అడ్డు లేకుండా మరో రహదారి (అనధికారిక గేట్) ఏర్పాటు చేసి మరీ తరలించారు. మూడేళ్ల పాటు జెన్కో డైరెక్టర్లు చోద్యం చూడటం మినహా కట్టడి చేయలేని దుస్థితి. ఆర్టీపీపీలో అధికారికంగా రెండుగేట్లు ఉన్నాయి. వాటి పరిధిలో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు(ఎస్పీఎఫ్) బందోబస్తు ఉంటుంది. ప్రతిదీ అక్కడ రికార్డు అవుతుంది. ఈ క్రమంలో అనధికారికంగా మూడో గేటు వెలసింది. అందుకు అప్పటి సీఈ, ఓ డైరెక్టర్ స్థాయిలో సహకరించారు. 6వ యూనిట్ నిర్మాణ పనుల నేపథ్యంలో వాహనాల రాకపోకలకు మూడో గేట్ ఏర్పాటు చేసినట్లు యంత్రాంగం సమర్థించుకుంది. ఆ గేటులో ఎలాంటి సిబ్బంది లేకపోవటంతో అవినీతి అక్రమాలకు నిలయంగా మారింది. యథేచ్ఛగా ఈదారి గుండా వాహనాలు ఆర్టీపీపీలోకి వెళ్లడం, బయటికి రావడంతో అందులో ఉన్న కోట్లాది రూపాయల స్క్రాప్, కంకర, సిమెంటు బయటకు వెళ్లింది. విజిలెన్సు విభాగం యాజమాన్యానికి అప్పట్లో ఈ విషయమై నివేదించినా ఫలితం లేకపోయింది. చంద్రబాబు అండ చిత్తూరు జిల్లాలో సారా వ్యాపారంతో అరంగేట్రం చేసిన సీఎం రమేష్ కుటుంబానికి అప్పటి నుంచే చంద్రబాబునాయుడు అండగా నిలిచి ఆదరించారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో గుడిమల్లం దేవాలయ భూములు 303 ఎకరాలు వేలానికి వచ్చాయి. అప్పటి రాజకీయ సంబంధాల కారణంగా సీఎం రమేష్ కుటుంబం తక్కువ ధరలకు ఆ భూములను వేలంలో దక్కించుకున్నట్లు సమాచారం. ఆ భూముల ఆధారంగా 90వ దశకం చివర్లో అప్పటి రాజకీయ పలుకుబడితో బ్యాంకులో దాదాపు రూ.400 కోట్ల రుణం తీసుకున్నట్లు తెలుస్తోంది. తర్వాత రిత్విక్ కన్స్ట్రక్షన్స్ సంస్థ కార్యకలాపాలు చురుగ్గా సాగినట్లు వాటి కార్యకలాపాలే చెబుతున్నాయి. వ్యక్తిపై దాడి కేసు అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న సీఎం రమేష్నాయుడుపై 2019 ఏప్రిల్ 11న వైఎస్సార్ కడప జిల్లా యర్రగుంట్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 2019 ఎన్నికల సమయంలో యర్రగుంట్లలోని ఓ ఎన్నికల బూత్‌లోకి నిబంధనలకు విరుద్ధంగా ఒకరికంటే ఎక్కువ మంది వెళ్లడంతోపాటు ఓ వ్యక్తిపై దాడి చేసి గాయపరిచారు. బాధితుడు పడిగపాటి వెంకటసుధాకర్ తండ్రి బాల సుబ్బిరెడ్డి ఇచి్చన లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు సీఎం రమేష్‌పై 100/2019 ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, ఐపీసీ సెక్షన్ 323, 324/ఆర్/డబ్లు 34 కింద కేసు నమోదు చేశారు. ప్రభుత్వ నిధులతో భూములకు ప్రొటెక్షన్ వాల్ అపోట్లదుర్తి గ్రామంలో నీరు–చెట్టు పథకం కింద ఫ్లడ్ ప్రొటెక్షన్ బ్యాంక్స్ ఏర్పాటు చేసేందుకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ జీఓ జారీ చేసింది. జీఓ ఆర్టీ నంబర్ 74 ను 2019 జనవరి, 29న జారీ చేశారు. ఆ మేరకు నీరు–చెట్టు పథకం కింద ఫ్లడ్ ప్రొటెక్షన్ బ్యాంక్స్ నిర్మించేందుకు ఫిబ్రవరి 1న ఈ–ప్రొక్యూర్మెంట్ టెండర్లను ఆ శాఖ ఎస్ఈ ఆహా్వనించారు. అంటే విషయం గ్రహించేలోపు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యేలా వ్యవహరించారు. ఎన్నికల కోడ్‌కు ముందే టెండర్లకు పిలిచిన నేపథ్యంలో ఫిబ్రవరి 19న టెండర్లు ఫైనల్ చేశారు. పలు కాంట్రాక్టు సంస్థలు పోటీపడ్డా ఆయా సంస్థలను డిస్క్వాలిఫై చేసి రిత్విక్ సంస్థకు మాత్రమే టెండర్‌ను 4 శాతం ఎక్సెస్ రేట్లకు ఖరారు చేశారు. అవే పనులను రూ.3.08 కోట్లతో రమేష్‌నాయుడు కుటుంబ సభ్యుల స్వా«దీనంలో ఉన్న ప్రభుత్వ భూమి చుట్టూ నిరి్మంచడం విశేషం. అఇకోస్తాంధ్రలోనే ఎందుకంటే.. సీఎం రమేష్‌నాయుడు ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నా, రాయలసీమలో అందునా కడప జిల్లాలో రాజకీయంగా గ్రామానికి ఎక్కువ, మండలానికి తక్కువ స్థాయి. అదే విషయాన్ని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అనేక పర్యాయాలు చెప్పుకొచ్చారు. అలాంటి స్థాయిలేని నాయకుడికి అనధికారికంగా జిల్లా బాధ్యతలు అప్పగించి ప్రజాధనం దోపీడీకి పాల్పడుతున్నారని అప్పట్లో తీవ్రంగా ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రజాబలం లేని కడప నుంచి పోటీ చేయలేక, కోస్తాంధ్రలోని అనకాపల్లి బీజేపీ అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. ఎన్నికల్లో ఖర్చు చేయగల సామర్థ్యం, పైగా టీడీపీ అధినేత చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యం వల్లే అక్కడ పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. -
అయ్యన్న..హన్నన్న..నేరాల ప్రీతిపాత్రుడు
సాక్షి, అనకాపల్లి: ఏజెన్సీ ముఖద్వారమైన నర్సీపట్నం నియోజకవర్గంలోని నాతవరం మండల పరిధిలో వేలాది హెక్టార్లలో ఉన్న విలువైన ఖనిజం లేటరైట్. ఈ ఖనిజం అంటే మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడికి ఎంతో ప్రీతి. టీడీపీ హయాంలో తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఖనిజ నిల్వలను అక్రమంగా తవ్వుకుని రూ.వందల కోట్లు ఆర్జించారు. ఇందులో ఆయన తనయుడు విజయ్ ప్రధాన భాగస్వామి. అప్పట్లో ఖనిజ సంపద తవ్వకాల అనుమతులు రద్దు చేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలిచ్చినా అమలు కాలేదు. తవ్వకాలను వ్యతిరేకించిన గిరిజనులపై తప్పుడు కేసులు పెట్టించి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. చివరికి శివపురంలోని పంట కాలువనూ అయ్యన్న వదల్లేదు. కాలువను ఆక్రమించి మరీ తన ఇంటి నిర్మాణం చేపట్టారు. తొలగించేందుకు వచ్చిన అధికార యంత్రాంగంపై దాడికి తెగబడ్డారు. అప్పటి సరుగుడు సర్పంచ్‌పై ఒత్తిడి బమిడికలొద్ది ఏరియాలో 110 హెక్టార్ల లీజుదారుడైన జర్తా లక్ష్మణరావును తన బినామీకి 80 శాతం వాటా ఇవ్వాలని అయ్యన్న తనయుడు అప్పట్లో డిమాండ్ చేశారు. దీనికి ఆయన నిరాకరించాడు. దీంతో మైనింగ్ లీజు రద్దు చేయించేందుకు తీర్మానం చేయాలంటూ ప్రస్తుత ఎంపీపీ, అప్పటి సరుగుడు పంచాయతీ సర్పంచ్ లక్ష్మణ్మూర్తిపై విజయ్ ఒత్తిడి చేశారు. దీంతో లక్ష్మణ్‌మూర్తి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే సరుగుడు పంచాయతీలో జర్తా లక్ష్మణరావుకు మైనింగ్ కోసం ఇచ్చిన పంచాయతీ తీర్మానం సరైనది కాదని, రికార్డులు తారుమారు చేశారంటూ అప్పటి మంత్రి అయ్యన్న పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా తక్షణ విచారణ చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. విచారణ చేపట్టిన జిల్లా అధికారులు పంచాయతీ తీర్మానానికి రెండు పుస్తకాలను వినియోగించటమే కాకుండా కొన్ని పొరపాట్లు చేశారని పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శికి నివేదించారు. అయ్యన్న ఒత్తిడితో ఆ రోజు చేసిన తీర్మానాలన్నింటినీ రద్దు చేయాలని కలెక్టర్‌ను పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశించారు. అప్పటి కలెక్టర్ యువరాజ్ సరుగుడు ప్రాంతంలో మైనింగ్ తవ్వకాలు జరగకుండా చూడాలని తొమ్మిది శాఖల అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులిచ్చారు. టీడీపీ హయాంలో లేటరైట్ అనుమతుల కోసం మైనింగ్ మాఫియా బినామీలైన సింగం భవాని పేరిట 5 హెక్టార్లు, కిల్లో లోవరాజు పేరుతో 35 హెక్టార్లలో లేటరైట్ తవ్వకాలకు ప్రభుత్వం నుంచి అనుమతులు పొందారు. చట్టంలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని అయ్యన్న తనయుడు విజయ్ సహకారంతో కాకినాడకు చెందిన అబ్బాయిరెడ్డి, బుజ్జి, తోట నవీన్, శ్రీనివాస్ అలియాస్ నల్లశ్రీను ఏకమై తవ్వకాలు చేపట్టారు. రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్ల విలువైన ఖనిజాన్ని అక్రమంగా తవ్వి, సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. కలెక్టర్ అనుమతులు రద్దు చేసినా నిరాటంకంగా తవ్వకాలు సాగించారు. అక్రమ నిర్మాణంపై ప్రశ్నిస్తే దౌర్జన్యం నర్సీపట్నంలోని శివపురంలో 10 అడుగుల ఇరిగేషన్ పంట కాలువను అయ్యన్నపాత్రుడు కబ్జా చేసి, అక్రమంగా ఇంటిని నిర్మించారని జిల్లా అధికారులు గుర్తించారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఆక్రమణను తొలగించాలని నోటీసులిచ్చినా ఆయన స్పందించలేదు. దీంతో నిబంధనలు ఉల్లంఘించి చేపట్టిన నిర్మాణాన్ని తొలగించేందుకు 2022 జూన్ 20న అధికారులు ప్రయతి్నంచారు. దీన్ని అయ్యన్న కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. జేసీబీ ఆపరేటర్లను బెదిరించడంతో వారు జేసీబీ వదిలి వెళ్లిపోయారు. టీడీపీ కార్యకర్తలు భారీ ఎత్తున చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌పై దాడి చేసి, అతని చేతిలో కెమెరా లాక్కున్నారు. జాయింట్ సర్వే చేయించి ఆక్రమణలు నిరూపిస్తే తామే తొలగిస్తామని అప్పటి ఆర్డీవో గోవిందరావుకు అయ్యన్న రెండో కొడుకు రాజేష్ వినతిపత్రం అందించారు. ఆర్డీవో ఆదేశాలతో రెవెన్యూ అధికారులు రీసర్వే చేపట్టారు. సర్వే చేస్తుండగా టీడీపీ కార్యకర్తలు సర్వేను అడ్డుకుని కొలత చెయిన్ లాక్కున్నారు. రికార్డులు పట్టుకుపోయారు. పోలీసుల హెచ్చరికలతో సర్వే రికార్డులను తిరిగి అప్పగించారు. టీడీపీ కార్యకర్తలు జేసేబీ అద్దాలు పగులగొట్టడంతోపాటు టైర్లలో గాలి తీసేశారు. ఇప్పటికీ ఆ జేసీబీ అక్కడే ఉత్సవ విగ్రహంలా దర్శనమిస్తోంది. ఈ గొడవ జరుగుతుండగానే అయ్యన్న కోర్టును ఆశ్రయించి అదే రోజు సాయంత్రానికి కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో నలుగుతోంది. రేప్ కేసు సహా 23 ఎఫ్ఐఆర్లు ► అయ్యన్నపై ఇప్పటివరకూ రేప్ సహా 23 కేసులు నమోదయ్యాయి. బట్టలూడదీసి కొడతానని మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణిని ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై 2020లో క్రైమ్ నెం. 777/2020 యు/ఎస్ 354(ఏ), 500, 504, 505(1)(బి), 505(2), 506, 509 ఐపీసీ కింద నర్సీపట్నం టౌన్ స్టేషన్లో రేప్ కేసు నమోదైంది. ► దళితులను దూషించినందుకు క్రైమ్ నెం. 690/2020 యు/ఎస్ 3(ఐ)(ఆర్), 3(ఐ)(యు) ఆఫ్ ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. ► తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి ఇరిగేషన్ కాలువను ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టినందుకు అమరావతి సీఐడీ పోలీసులు క్రైమ్ నెం.64/2022 యు/ఎస్ 464, 467, 471, 474 ఆర్/డబ్ల్యూ 120–బి, 34 ఐపీసీ సెక్షన్ల కింద ఫోర్జరీ కేసు నమోదు చేశారు. ► ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించటంపై క్రైమ్ నెం.542/2019 యు/ఎస్ 179, 186, 189, 353, 500, 504 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ► పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించి వారి విధులకు ఆటంకం కలిగించినందుకు క్రైమ్ నెం. 10/2020 యు/ఎస్ 341, 188, 189, 504, 505,(1)(బి) ఐపీసీ కింద కేసు నమోదైంది. -
రేవంత్ ఇంటి దగ్గర్లోనూ ఓ వార్‌రూమ్!
సాక్షి, హైదరాబాద్: ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోపాటు ఆయన కుటుంబీకులు, అనుచరులపై నిఘా ఉంచడానికి ఓ గెస్ట్‌హౌస్ తీసుకున్నట్టు తెలిసింది. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసానికి సమీపంలో ఉన్న దీంట్లో ప్రణీత్‌రావు వార్‌రూమ్ నిర్వహించాడు. ఈ గెస్ట్‌హౌస్ కేంద్రంగానే భారీ సెటిల్మెంట్లు కూడా జరిగినట్టు తెలిసింది. పోలీసు కస్టడీలో ఉన్న హైదరాబాద్ టాస్‌్కఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు విచారణలో ఈ విషయాలు గుర్తించిన అధికా రులు ఆదివారం రాత్రి ఆ గెస్ట్‌హౌస్‌లో సోదాలు చేశారు. మరోపక్క రాధాకిషన్‌రావు కస్టడీ బుధవారంతో ముగి యనుండటంతో సిట్ అధికారులు తమ దర్యా ప్తు, విచారణ ముమ్మరం చేశారు. నిఘా అధికారులు చేసిన ఫోన్ ట్యాపింగ్ కారణంగానే 2015 నాటి ‘ఓటుకు కోట్లు’వ్యవహారం, 2022లో చోటు చేసుకున్న ‘ఎమ్మెల్యేలకు ఎర’అంశం వెలుగులోకి వచ్చాయి. ప్రభాకర్‌రావు ఎస్ఐబీ చీఫ్‌గా మారిన తర్వాత ట్యాపింగ్ దుర్వినియోగం కావడం మొదలైంది. తొలినాళ్లలో ఈ విభాగం నిబంధనల ప్రకారమే అవసరమైన ఫోన్‌నంబర్లను లీగల్ ఇంటర్సెప్షన్గా (ఎల్ఐ) పిలిచే చట్టబద్ధమైన విధానం ద్వారానే ట్యాప్ చేసింది. అయితే 2018 ఎన్నికల నుంచి వీరి ట్యాపింగ్ పంథా మారిపోయింది. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఫోన్లతోపాటు సోషల్‌మీడియాను ట్యాప్ చేయాలని భావించారు. ప్రణీత్‌రావు, తిరుపతన్న, వేణుగోపాల్‌రావు తదితరులను ఎస్ఐబీలోకి తీసుకున్న తర్వాత, భుజంగరావు పొలిటికల్ ఇంటెలిజెన్స్ బాధ్యతలు చేపట్టడంతో ప్రభాకర్‌రావు ట్యాపింగ్‌ను కొత్త పుంతలు తొక్కించారు. దీనికోసం విదేశాల నుంచి ఉపకరణాలు, సాఫ్ట్వేర్స్ అక్రమంగా దిగుమతి అయ్యాయి. టెక్నాలజీ కన్సల్టెంట్ రవిపాల్ అలియాస్ పాల్ రవికుమార్ సహకారంతో ఇజ్రాయెల్ నుంచి సాఫ్ట్వేర్స్, ఎంసీ క్యాచర్స్ సమీకరించుకున్నారు. సూట్‌కేస్‌లో ఇమిడిపోయి ఉండే ఈ ట్యాపింగ్ పరికరం మ్యాన్ ఇన్ ది మిడిల్ (ఎంఐటీఎం) ఎటాక్స్‌కు వినియోగించారు. దీన్ని ప్రణీత్‌రావు టీమ్ ఓ వాహనంలో పెట్టుకొని టార్గెట్ చేసిన వ్యక్తి ఇల్లు, కార్యాలయ సమీపంలో మాటు వేసేది. ఈ పరికరానికి ఓ కృత్రిమ సెల్‌ఫోన్ టవర్గా మారిపోయి 300 మీటర్ల పరిధిలో పనిచేస్తున్న ప్రతి ఫోన్ ద్వారా జరిగే కమ్యూనికేషన్ తెలుసుకునే సామర్థ్యం ఉంది. వాటిలో తమకు కావాల్సిన దాన్ని ఎంచుకొని, దానికి సంబంధించిన సోషల్‌మీడియా సహా ప్రతి కమ్యూనికేషన్‌ను ట్యాప్ చేసే అవకాశం దానిని ఆపరేట్ చేసే వ్యక్తికి ఉంటుంది. ఇలాంటి ఓ ఉపకరణాన్నే ప్రణీత్‌రావు బృందం రేవంత్‌రెడ్డి ఇంటికి సమీపంలో తీసుకున్న గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసింది. అక్కడ నుంచే రేవంత్‌తోపాటు ఆయన కుటుంబీకులు, ప్రధాన అనుచరుల ఫోన్లపై నిఘా ఉంచింది. రాధాకిషన్‌రావు, భుజంగరావులు ఇదే గెస్ట్‌హౌస్ కేంద్రంగా కొన్ని సెటిల్మెంట్లు కూడా చేశారని తెలుస్తోంది. ఈ వ్యవహారాలను ప్రభాకర్‌రావు నేరుగా పర్యవేక్షించి భారీ వసూళ్లకు తెర లేపినట్టు పోలీసులు గుర్తించారు. -
సీఎం రమేష్ సారా అక్రమాల చరిత్ర ఇది
టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, ఆయన నమ్మిన బంటు.. కూటమి తరఫున అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ అక్రమాల బాగోతాలు అన్నీ ఇన్నీ కావు.. సీఎం రమేష్‌పై తాజాగా పోలీస్ కేసు నమోదైంది. ‘‘నా సంగతి మీకు తెలియదంటూ..’’ జీఎస్టీ తనిఖీల కోసం వెళ్లిన డీఆర్ఐ అధికారులపై గుండాయిజం ప్రదర్శించిన సీఎం రమేష్ అక్రమాల చరిత్రను పరిశీలిస్తే.. కుప్పంలో ఒకప్పుడు సీఎం రమేష్ తన తండ్రితో పాటు సారా వ్యాపారం చేశారు. రాయదుర్గం నుంచి అక్రమంగా సారా ప్యాకెట్లు తెప్పిస్తుంటే సీఎం రమేష్‌ను, ఆయన తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. మరొక కేసులో సీఎం రమేష్ తండ్రిని పీడీ యాక్ట్ కింద అరెస్టు అయ్యారు. అధికారంలో ఉన్నవాళ్లను ఎలా ఆకట్టుకోవాలో సీఎం రమేష్‌కు బాగా తెలుసు. 1989–94లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కేసుల నుంచి బయట పడడానికి సీఎం రమేష్ ఆయన కుటుంబం కడపలో ఉన్న ఓ మంత్రి సాయం తీసుకునే వారు. చంద్రబాబు చంద్రగిరి నుంచి కుప్పం వెళ్లాక సీఎం రమేష్ పోట్లదుర్తి నుంచి కొంతమందిని తీసుకెళ్లి కుప్పంలో దొంగ ఓట్లు నమోదు చేయించారు. కుప్పంలో ఓటు మేనేజ్మెంట్ అంతా సీఎం రమేష్ ఆయన తీసుకెళ్లిన పోట్లదుర్తి మనుషులే చూసుకునేవాళ్లు. అప్పటి నుంచి చంద్రబాబుతో సీఎం రమేష్‌కు వ్యక్తిగత, ఆర్థిక, రాజకీయ సాన్నిహిత్యం ఏర్పడింది. ఇప్పుడు సీఎం రమేష్ రూ.వేల కోట్లకు అధిపతిగా ఉన్నాడు. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రమేష్ అనకాపల్లిలో సుమారు 200 మందిని తీసుకెళ్లి జీఎస్టీ అధికారులను భయభ్రాంతులకు గురి చేశారు. వీటికి బీజేపీ ఏమి సమాధానం చెబుతుంది.? కోల్‌కత్తాలో ఈడీ అధికారులపై అక్కడి టీఎంసీ నేతలు దాడికి దిగితే ఖండించిన బీజేపీ ఇప్పుడు సీఎం రమేష్ చేసిన ఈ దౌర్జన్యానికి ఏం సమాధానం చెబుతుంది? అక్రమ సారా నుంచి రూ.3 వేల కోట్లకు ఎదిగాడు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సీఎం రమేష్ తనకు ఏం కావాలో చెప్పి చేయించుకునేవారు. అనకాపల్లిలో ప్రస్తుత ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు చేయడానికి ఉన్నాడు. పోట్లదుర్తి నుంచి తన మనుషులను అనకాపల్లికి తీసుకొచ్చాడు. నీతులు చెబుతున్న చంద్రబాబు... సీఎం రమేష్ ఎదుగుదలలో ఆయన పాత్ర ఎంటో చెప్పగలరా?. గతంలో విజయమ్మ పోటీ చేసినప్పుడు కడప నుంచి మనుషులను తీసుకొచ్చారని టీడీపీ వాళ్లు అసత్య ప్రచారాలు చేయించారు. ఆమె ఓటమికి కారణమయ్యారు. కడప ప్రాంతానికే చెందిన రమేష్ ఇప్పుడు అనకాపల్లిలో చేస్తున్న దౌర్జన్యానికి ఏం సమాధానం చెబుతారు. -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
518 ఎకరాలు.. హాంఫట్!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అవి పంటలు పండించుకుని జీవనాధారం పొందేందుకు పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములు.. క్రయ విక్రయాలు, వ్యవసాయేతర పనులు చేయడానికి వీల్లేని భూములు.. కానీ ధరణి పోర్టల్‌లో రికార్డులను తారుమారు చేశారు. అసైన్డ్ భూములను పట్టా భూములుగా మార్చేశారు. దీనితో ఒకటీ, రెండూ కాదు.. ఏకంగా 518 ఎకరాల అసైన్డ్ భూములు బడాబాబుల చేతుల్లోకి వెళ్లిపో యాయి. సంగారెడ్డి జిల్లా కంది మండలంలో చోటుచేసుకున్న ఈ భూదందా.. తాజాగా ప్రభుత్వ భూముల వెరిఫికేషన్ సందర్భంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉండటం, రెండు జాతీయ రహదారులు, ఐఐటీ ఉండటంతో కంది మండలంలో భూముల ధర ఎకరా రూ.ఐదు కోట్ల వరకు పలుకుతోంది. అంటే అక్రమాలు జరి గిన 518 ఎకరాల భూముల విలువ రెండున్నర వేల కోట్లకుపైనే ఉంటుందని అంచనా. 11 గ్రామాల పరిధిలో.. సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ భూముల వెరిఫి కేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములున్నాయి, ఎక్కడైనా అన్యా క్రాంతం అయ్యాయా? వాటి రికార్డుల పరిస్థితే మిటనే అంశాలను పరిశీలిస్తున్నారు. ఇద్దరు అదనపు కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓ స్థాయి అధికారులకు ఒక్కో మండలం చొప్పు న బాధ్యతను అప్పగించారు. ఈ క్రమంలోనే కంది మండలం పరిధిలోని 11 గ్రామాల్లో 518 ఎకరాల అసైన్డ్ భూములను పట్టా భూము లుగా రికార్డులను మార్చేసినట్టు తేలింది. అత్య ధికంగా బ్యాతోల్‌లో 181 ఎకరాలు, చిద్రుప్ప లో 154 ఎకరాలు, జుల్కల్లో 57 కాశీపూర్‌లో 41 ఎకరాలు, ఉత్తర్‌పల్లిలో 17 ఎకరాలు మిగ తాచోట్ల కలిపి 68 ఎకరాల అసైన్డ్ భూముల రికార్డులను మార్చేసినట్టు గుర్తించారు. ఈ మండలంలో మొత్తం 17 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. మరో ఆరు గ్రామాల రికార్డులను వెరిఫికేషన్ చేయాల్సి ఉంది. వాటిలోనూ తని ఖీ పూర్తయితే.. మరిన్ని అక్రమాలు వెలుగు లోకి వస్తాయని అధికారులు చెప్తున్నారు. ధరణి పోర్టల్‌లో మార్చేసి.. అధికారులు, దళారులు కుమ్మక్కై ధరణి పోర్ట ల్ను ఆసరాగా చేసుకుని ఈ భూదందాకు తెరలేపారు. అసైన్డ్భూములను ధరణి పోర్టల్‌లో పట్టా భూము లుగా మార్చేశారు. ఈ మేరకు పట్టాదారు పాసు పుస్తకాలు కూడా జారీ చేశారు. తర్వాత ఆ పాసు పుస్తకాల ఆధారంగా.. చాలావరకు భూముల క్రయవిక్రయాలు చేతులు మారాయి. బడాబాబుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. రాజకీయ నేతలు, బడాబాబులకు భూములు దక్కేలా చేసిన కొందరు రెవెన్యూ అధికారులు భారీగా దండుకున్నారని.. కోట్లకు పడగలెత్తారని ఆరోపణలు ఉన్నాయి. వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది కలెక్టర్ ఆదేశాల మేరకు కంది మండలంలో ప్రభుత్వ భూముల వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టాం. భూములకు సంబంధించిన రికా ర్డులను క్షుణ్నంగా పరిశీలిస్తున్నాం. అసైన్డ్ భూములను పట్టాభూములుగా మార్చి నట్టు గుర్తించాం. అన్ని గ్రామాల్లో వెరిఫి కేషన్ పూర్తిచేసి నివేదిక ఇస్తాం. – విజయలక్ష్మి, కంది మండల తహసీల్దార్.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019