కుండంత పొట్ట : ఇలా కొలుచుకొని జాగ్రత్త పడండి!
శరీరం బరువు ఉండాల్సినంతే ఉన్నప్పటికీ పొట్ట పెద్దగా ముందుకు వచ్చి కనిపిస్తుంటే అది కాస్తంత ప్రమాదకరమైన కండిషన్ అని గుర్తుంచుకోవాలి. ఇదెంత ప్రమాదకరం, పొట్టను ఏ మేరకు తగ్గించుకోవాలి అనే విషయాలు ఓ టేప్ సహాయంతో తెలుసుకోవచ్చు. ఇలా కొలిచే సమయంలో పొట్టను బొడ్డుకు ఒక అంగుళంపైనే కొలవాలి. ఆ కొలతకూ, పిరుదుల కొలతకు నిష్పత్తిని లెక్కగట్టాలి. అంటే నడుము కొలతని హిప్ కొలతతో భాగించాలి. అదెప్పుడూ ఒకటి కంటే తక్కువగానే (అంటే జీరో పాయింట్ డెసిమల్స్లో) వస్తుంది. సాధారణంగా నడుము కొలత, హిప్స్ భాగం కొలత కంటే తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. సాధారణంగా మహిళల్లో ఈ కొలత విలువ 0.85 కంటే తక్కువగా ఉండాలి. పురుషులకు ఇది 0.9 కంటే తక్కువగా రావాలి. ఈ నిష్పత్తినే డబ్ల్యూహెచ్ఆర్ (వేయిస్ట్ బై హిప్ రేషియో) అంటారు. పైన పేర్కొన్న ప్రామాణిక కొలతల కంటే ఎక్కువగా వస్తే ... అంటే... ఈ రేషియో విలువ... మహిళల్లో 0.86 కంటే ఎక్కువగానూ, పురుషులలో 0.95 కంటే ఎక్కువగా ఉంటే అది కాస్త ప్రమాదకరమైన పరిస్థితి అని గుర్తుంచుకోవాలి. అలా కొలతలు ఎక్కువగా ఉన్నాయంటే వారికి ‘అబ్డామినల్ ఒబేసిటీ’ ఉందనడానికి అదో సూచన. దీన్నే సెంట్రల్ ఒబేసిటీ అని కూడా అంటారు. (స్నానం చేయడు.. గంగాజలం చల్లుకుంటాడు.. నా కొద్దీ పెనిమిటి!)ఇలా అబ్డామినల్ ఒబేసిటీ లేదా సెంట్రల్ ఒబేసిటీ ఉన్నవారికి గుండెసమస్యలు / గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే ఈ నిష్పత్తి (వేయిస్ట్ బై హిప్ రేషియో) ఉండాల్సిన ప్రామాణిక విలువల కన్నా ఎక్కువగా ఉన్నవారు వాకింగ్ లేదా శరీరానికి మరీ ఎక్కువ శ్రమ కలిగించని వ్యాయామాలతో పొట్ట చుట్టుకొలతను (పొట్టని) తగ్గించుకోవడమన్నది గుండెకూ, ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది. ఇదీ చదవండి: పెళ్లైన ఇన్నాళ్లకు, ఇంటిపేరు మార్చుకున్న అలియా