breaking news
-
అప్రమత్తతే అతి ముఖ్యం
సాక్షి, హైదరాబాద్: ఎండాకాలం నేపథ్యంలో అగ్నిప్రమాదాలకు అవకాశాలు పెరిగాయి. అప్రమత్తతతో ఉంటేనే అగ్ని ప్రమాదాలను నియంత్రించడంతోపాటు ప్రమాదాలు జరిగినా తక్కువ నష్టంతో బయటపడొచ్చు. ఇందుకు ప్రజల్లో అవగాహన అతి ముఖ్యమని అగ్నిమాపకశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రమాదాల నియంత్రణలో భాగంగా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈనెల 14 నుంచి 20 వరకు అగ్నిమాపక సేవల వారోత్సవాలు చేయనున్నట్టు ఫైర్ డీజీ వై.నాగిరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. రద్దీ ఎక్కువగా ఉండే బస్స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు, నివాససముదాయాలు, మల్టీప్లెక్స్, మాల్స్‌లో వీటిని నిర్వహిస్తారు. ఎండల తీవ్రత పెరగడంతో అగ్నిప్రమాదాల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ తెలంగాణ అగ్నిమాపకశాఖ కొన్ని మార్గదర్శకాలు వెల్లడించింది. ఈ విషయాల్లో జాగ్రత్త ► వేసవి తీవ్రత పెరగడంతో ఫ్యాన్లు, ఏసీలు, ఇతర విద్యుత్ ఉపకరణాల వాడకం పెరుగుతుంది. దీనివల్ల ఓవర్‌లోడ్‌తో షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు పెరిగే అవకాశం ఉంటుంది. విద్యుత్ వైరింగ్‌లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ► ఇంట్లో మంటల వ్యాప్తికి ప్రధాన అంశాల్లో వంటింట్లో మంటలు అంటుకోవడం కూడా.. అందువల్ల వంటగదిలో మంటలు అంటుకునే వస్తువులు లేకుండా చూసుకోవాలి. వీలైనంత గాలివెలుతురు ఉండేలా చూసుకోవాలి. ► అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యునిటీలు, బహుళ అంతస్థుల భవనాల్లో ఉండే వారు తప్పకుండా ఫైర్ ఆడిటింగ్ నిర్వహించాలి. అగ్నిమాపక నియంత్రణ పరికరాలు, మంటలార్పేందుకు నీటి పైప్‌లైన్ వ్యవస్థ, ఫైర్ అలార్మ్లు పనిచేస్తున్నాయా..ఇలా అన్నింటినీ ఒకసారి సరిచూసుకోవాలి. ► కారు ప్రయాణంలోనూ అగ్ని ప్రమాదాల నుంచి రక్షణకు పోర్టబుల్ ఫైర్ ఎక్ట్సింగ్విషర్ (మంటలు ఆర్పేది) పెట్టుకోవాలి. ► ఇళ్లలో ఎలక్ట్రికల్ వస్తువులు వాడకపోతే వాటిని వెంటనే స్విచ్ఆఫ్ చేయడం అలవాటు చేసుకోవాలి. ► కార్యాలయాల్లో ఫైర్ స్ప్రింక్లర్ వ్యవస్థ, ఫైర్ అలార్మ్లు, ఎమర్జెన్సీ లైటింగ్ ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పటి వరకు 2,550 ఫైర్ కాల్స్ రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది జనవరి నుంచి మార్చి చివరి వరకు అగ్నిప్రమాదాలకు సంబంధించి అన్ని రకాల ఫిర్యాదులు కలిపి 2,550 ఫైర్ కాల్స్ వచి్చనట్టు అగ్నిమాపకశాఖ అధికారులు వెల్లడించారు. గతేడాదిలో 8151 ఫైర్ కాల్స్ వచి్చనట్టు తెలిపారు. ఇందులో 141 తీవ్రమైన ప్రమాదాలు, 175 మధ్యతరహా అగ్నిప్రమాదాలు ఉన్నట్టు తెలిపారు. -
త్వరలో కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు
రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ లబ్దిదారులకు కొత్తగా కార్డులివ్వాలని నిర్ణయించింది. ప్రతి కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకొని యూనిక్ నంబర్‌తో కార్డులు ఇవ్వనుంది. కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ ఒక్కో సబ్ నంబర్ ఇస్తారు. ఇదే కార్డును హెల్త్ ప్రొఫైల్‌కు లింక్ చేసి, స్టేట్ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌ను తయారు చేస్తారు. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్టు కసరత్తు చేస్తోంది. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటివరకు కొందరు పేదలకు ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి. అంతేకాకుండా అనేకమంది తెల్ల రేషన్‌కార్డును ఆధారం చేసుకొనే ఆరోగ్యశ్రీ సేవలు పొందుతున్న సంగతి తెలిసిందే. ఇక నుంచి ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డుకు లింకు పెట్టకూడదని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల జారీ అంశంపై ఆరోగ్యశ్రీ ట్రస్టు దృష్టిసారించింది. ఈ మేరకు లబ్దిదారుల గుర్తింపుపై మార్గదర్శకాలు రూపొందిస్తోంది. అందరికీ ఆరోగ్యశ్రీని వర్తింప చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై వైద్య, ఆరోగ్యశాఖ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కోసం ఏటా రూ.1,100 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అందరికీ వర్తింప చేయడం వల్ల అదనంగా రూ.400 కోట్ల భారం పడే అవకాశం ఉందని, ఇది పెద్ద భారం కాదన్న భావనలో సర్కారు ఉంది. మధ్యతరగతి ప్రజల్లో చాలామందికి, ఉద్యోగులకు, ఇతరులకు పలు పథకాలు ఉన్నాయి. అలాగే ప్రైవేట్ ఆరోగ్య బీమాతో ఆరోగ్య సేవలు పొందుతున్న వారూ చాలామంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ కార్డులతో అందరికీ సార్వజనీన ఆరోగ్య సేవలు అందించవచ్చని సర్కారు యోచిస్తోంది. వంద శస్త్రచికిత్సలు చేర్చే అవకాశం రాష్ట్రంలో 293 ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు, 198 ప్రభుత్వ పెద్దాసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. అలాగే గత ఏడాది 809 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)లోనూ ఆరోగ్యశ్రీ కింద సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. మొత్తంగా రాష్ట్రంలో 1,310 ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీకి అర్హులుగా 77.19 లక్షల మంది పేదలు ఉన్నారు. ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని కూడా ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా అమలు చేస్తున్నారు. లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు, జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ఈజేహెచ్ఎస్ కిందకు వస్తారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద 1,376 శస్త్రచికిత్సలు, 289 వైద్య సేవలున్నాయి. ఆయుష్మాన్ భారత్ కింద 1,949 వ్యాధులకు వైద్యం అందుతోంది. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్‌లో ఈ రెండింటిలో ఉన్న వ్యాధులను కలిపి అమలు చేస్తున్నారు. వీటికి సుమారు మరో వంద శస్త్రచికిత్సలను చేర్చే అవకాశం ఉంది. ఒక్కో కుటుంబానికి 10 లక్షల కవరేజీ ఆయుష్మాన్ భారత్ పథకం కింద కేంద్రం 2022లో ప్యాకేజీలను సవరించింది. గతంలో ఆరోగ్యశ్రీ కింద కవరేజీ రూ. 2 లక్షలు ఉండగా, ఆయుష్మాన్ భారత్ పథకం రావడంతో దాన్ని రూ. 5 లక్షలు చేశారు. కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రూ.10 లక్షలు చేసిన సంగతి తెలిసిందే. ఏడాదికి ఈ పథకాల కింద ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల వరకు కవరేజీ వర్తిస్తుంది. దీనికి ప్యాకేజీ సొమ్ము కూడా పెంచితే ఏటా రూ.1,500 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈహెచ్ఎస్ పథకంపై తేలని నిర్ణయం ఈహెచ్ఎస్ పథకంపై ఉద్యోగులు కంట్రిబ్యూషన్ ఇస్తామని పేర్కొన్న సంగతి విదితమే. గత అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌కు ముందు రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంప్లాయి హెల్త్ కేర్ ట్రస్ట్ (ఈహెచ్సీటీ) ఏర్పాటు చేసి అమలు చేయాలని నిర్ణయించింది. పథకం అమలుకు ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి కొంత మొత్తాన్ని, అంతే మొత్తంలో ప్రతి నెలా ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్‌గా జమ చేయాలని పేర్కొన్నది. ఈ మేరకు తమ మూల వేతనంలో ఒక శాతం కాంట్రిబ్యుషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి గతంలో విజ్ఞప్తి చేశాయి. ఆసుపత్రుల్లో తమకు వైద్యం అందనందున ఈ ప్రక్రియకు ఉద్యోగులు కూడా ముందుకు వచ్చారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల బకాయిల చెల్లింపునకు ఏర్పాట్లు ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు మాత్రం ఆరోగ్యశ్రీ రోగులకు వైద్యం చేయడంపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. బ కాయిలు పేరుకుపోవడంతో పాటు ఆరో గ్యశ్రీ కింద ఆసుపత్రులకు ఇచ్చే ప్యాకేజీ సొమ్ము సరిపోవడం లేదని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నా యి. దీంతో ఆరోగ్యశ్రీ లబ్దిదారులు, ఈ హెచ్ఎస్ బాధితులు డబ్బులు చెల్లించి వైద్యం పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా తర్వాత అనారోగ్య సమస్యలు పెరగడంతో చాలామంది ప్రైవేట్ ఆరోగ్య బీమా తీసుకుంటున్నారు. ఉద్యోగులైతే రీయింబర్స్మెంట్ పద్ధతిలో ముందుగా డబ్బులు చెల్లించి వైద్యం పొందుతున్నా రు. అయితే బిల్లుల సొమ్ము మాత్రం పూ ర్తి స్థాయిలో రావడంలేదని ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. పెద్దఎత్తున బిల్లులు పే రుకుపోవడం వల్లే తాము వైద్యం అందించలేకపోతున్నామని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు నెట్వర్క్ ఆసుపత్రుల లెక్క ప్రకా రం దాదాపు రూ.500 కోట్లు ఆరోగ్యశ్రీ నుంచి తమకు రావాల్సిన బిల్లుల బకా యిలు పెండింగ్‌లో ఉన్నాయని అంటున్నాయి. మరోవైపు వివిధ వ్యాధులకు 2013లో నిర్ధారించిన ప్యాకేజీ ప్రకారమే ఆసుపత్రులకు సొమ్ము అందుతోంది. అంటే తెలంగాణ ఏర్పడ్డాక ఇప్పటివరకు ఒక్కసారి కూడా వ్యాధులు, చికిత్సలకు ప్యాకేజీ సవరణ జరగలేదు. ఈ రెండు కారణాల వల్ల తాము ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ పథకాల కింద వైద్యం చేయలేకపోతున్నామని ఆసుపత్రుల యాజమాన్యాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో పెండింగ్ బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. -
BAPS అబుదాబి హిందూ మందిర్ : కఠిన నిబంధనలు, డ్రెస్ కోడ్
అబుదాబిలో ఇటీవల (ఫిబ్రవరి 14, 204) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ మందిరంలో డ్రెస్‌కోడ్ వార్తల్లో నిలిచింది. మార్చి ఒకటో తేదీనుంచి ఇక్కడ ప్రజల దర్శనాలకు అనుమతినిచ్చిన నేపథ్యంలో నియమ నిబంధనలు, భక్తుల డ్రెస్ కోడ్‌కు సంబంధించిన నియమాలు, మార్గదర్శకాలను జారీ చేసింది. ముఖ్యంగా క్యాప్స్, టీషర్ట్లు, అభ్యంతరకరమైన దుస్తులకు అనుమతి ఉండదు. డ్రెస్ కోడ్, ఇతర నిబంధనలు అబుదాబి మందిర్ ట్విటర్లో షేర్ చేసిన వివరాల ప్రకారం ప్రతి మంగళవారం - శనివారం, ఉదయం 9 నుండి రాత్రి 8 గంటల వరకు భక్తుల సందర్శనార్థం ఈ మందిర్ తెరిచి ఉంటుంది. సోమవారం మాత్రం ఆలయాన్ని మూసివేస్తారు. The wait is over!#AbuDhabiMandir is now open for all visitors and worshipers. Opening hours: Tuesday to Sunday: 9am-8pm Every Monday: Closed for visitors pic.twitter.com/JnYvZoVSPk — BAPS Hindu Mandir (@AbuDhabiMandir) March 1, 2024 ముస్లిం దేశంలో అబుదాబిలో తొలి హిందూ దేవాలయంబాప్స్లో డ్రెస్ కోడ్, మార్గదర్శకాల విషయంలో కఠినంగా వహరించనున్నారు. ఆలయ నిబంధనల ప్రకారం, మెడ, మోచేతులు, మడమల వరకూ కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి. టైట్‌గా ఉన్న దుస్తులు, స్లీవ్‌లెస్, షార్ట్స్‌కు అనుమతించరు. శబ్దాలు చేసే ఉపకరణాలనూ ఆలయంలోకి అనుమతించరు. బయటి ఆహారాన్ని ఆలయంలోకి తీసుకు రాకూడదు. పెంపుడు జంతువులకు కూడా ఆలయంలోకి ప్రవేశం నిషిద్ధం. అంతేకాదు దేవాలయం పరిసరాల్లో డ్రోన్స్ వినియోగంపై కూడా నిషేధం విధించారు. ఫోటోలకు అనుమతి ఉందా? వ్యక్తిగత అవసరాల కోసమే ఫోటోలు తీసుకోవచ్చు. ఎవరైనా వాణిజ్య అవసరాల నిమిత్తం వీడియోను రికార్డ్ చేయాలనుకుంటే, వారు తప్పనిసరిగా అధికారుల అనుమతి తీసుకోవాలి. ఆలయంలోని ఆధ్యాత్మిక, ప్రశాంత వాతావరణానికి ఎటువంటి ఇబ్బందీ రాకుండా భక్తులు నియమాలను పాటించి సహకరించాలని ఆలయ అధికారులు కోరారు. కాగా 700 కోట్ల రూపాయల వ్యయంతో 27 ఎకరాల్లో బాప్స్ సంస్థ ఆధ్వర్యంలో అబూ మారేఖ్ ప్రాంతంలో ఆలయ నిర్మాణం జరిగింది. శిల్పకళ ఉట్టిపడేలా నిర్మించిన ఈ ఆలయంలో ఒకేసారి 5 వేల మంది ప్రార్థనలు చేసేలా ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. -
విసిగిస్తున్న కాల్స్.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!
న్యూఢిల్లీ: ప్రమోషనల్ లేదా అవాంఛిత కాల్స్ సమస్య పరిష్కారానికి మార్గదర్శకాలను రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ నేతృత్వంలో ఫిబ్రవరి 14న జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీలో టెలికం శాఖ, ఆర్థిక సర్వీసుల విభాగం, గృహ .. పట్టణ వ్యవహారాల శాఖ, రిజర్వ్ బ్యాంక్, బీమా రంగ నియంత్రణ .. అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ), టెలికం రంగ నియంత్రణ సంస్థ (ట్రాయ్) సహా పరిశ్రమ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. మరోవైపు, అవాంఛిత కాల్స్ అనేవి యూజర్ల గోప్యతకు మాత్రమే కాకుండా వారి హక్కులకు కూడా భంగం కలిగిస్తాయని సమావేశంలో పాల్గొన్న వారు అభిప్రాయపడినట్లు కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఆర్థిక సేవల సంస్థలు.. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి ఇలాంటి కాల్స్ ఎక్కువగా ఉంటున్నాయని గుర్తించినట్లు తెలిపింది. అంతే కాకుండా కస్టమర్లను పోంజీ స్కీములు, క్రిప్టో పెట్టుబడుల వైపు ఆకర్షించేందుకు స్పామ్ కాలర్లు ఇప్పుడు వాట్సాప్ మొదలైన యాప్స్ ద్వారా ఇంటర్నెట్ కాల్స్ కూడా చేస్తున్నట్లు వివరించింది. రిజిస్టర్డ్ టెలీమార్కెటర్ల నుంచి స్పామ్ మెసేజీలు, అవాంఛిత కాల్స్ సమస్యను పరిష్కరించేందుకు టెలికం శాఖ, ట్రాయ్ ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. -
రూ. 500 గ్యాస్ సిలిండర్.. ఈ కేవైసీ అవసరం లేదు..!
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎన్నికల ప్రణాళికలో రూ. 500లకే వంట గ్యాస్ అందజేస్తామని ప్రకటించింది. దీంతో గ్యాస్ వినియోగదారులు ఈ కేవైసీ (నో యువర్ కస్టమర్) చేయించుకునేందుకు గ్యాస్ ఏజెన్సీల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఈ కేవైసీతో సంబంధం లేదని అధికారులు, డీలర్లు చెబుతున్నా ఏజెన్సీల వద్ద మహిళలు బారులు తీరుతున్నారు. తమ పనులు వదులుకొని వినియోగదారులు ఉదయం 8 గంటల నుంచే గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూలు కడుతున్నారు. హైదరాబాద్: ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ, ఖైరతాబాద్, షేక్‌పేట, రహమత్‌నగర్, యూసుఫ్‌గూడ, ఎర్రగడ్డ, బోరబండ, వెంగళ్రావునగర్, శ్రీనగర్ కాలనీ డివిజన్ల పరిధిలో తొమ్మిది గ్యాస్ ఏజెన్సీలు ఉండగా 3.40 లక్షల మంది గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. ► ఇందులో తెల్ల రేషన్ కార్డు ఉన్న వారు 83,127 మంది ఉండగా, అన్నపూర్ణ అన్నయోజన కార్డు కలిగిన వారు 3368 మంది కలిగి ఉన్నారు. ► ప్రభుత్వం రూ. 500 గ్యాస్ సిలిండర్‌పై ఇంత వరకు ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయకున్నా తెల్లరంగు రేషన్ కార్డుదారులకు వర్తిస్తుందని సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులలో వార్తలు వైరల్ అవుతుండటంతో ఇటు తెల్లకార్డుదారులు, అటు సాధారణ గ్యాస్ వినియోగదారులు ఈ కేవైసీ కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు. ► ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద రూ. 500కే వంట గ్యాస్ అందిస్తామని చెప్పింది. ఈ పథకానికి ఈ కేవైసీకి సంబంధం లేదని దీనికి నిర్దిష్టగడువు కూడా ఏమీ లేదని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చేవరకు వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్దకు రావొద్దని ఏజెన్సీల నిర్వాహకులు ఏకంగా బ్యానర్లే కడుతున్నారు. ఉజ్వల పథకానికి మాత్రమే... ► కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉజ్వల పథకానికి మాత్రమే ఈ కేవైసీ చేయాల్సి ఉంటుంది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద గతంలో మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. ఈ పథకంలోని లబి్ధదారులకు ప్రభుత్వం రాయితీపై గ్యాస్ అందజేస్తుంది. ఈ పథకంలో మృతి చెందిన వారి వివరాలు తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కేవైసీని ప్రవేశ పెట్టింది. మహిళలు బయోమెట్రిక్ చేయించి నమోదు చేయించుకోవాలని వేలి ముద్రలు పడకపోతే ఐరిష్ విధానంలో ఈ కేవైసీని పూర్తి చేస్తారు. వాస్తవాలు తెలియని వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీలకు పరుగులు తీస్తున్నారు. రెండేళ్లకోసారి ఈ కేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం సూచిస్తున్నది. లబి్ధదారుల సంఖ్య, మృతులు, ఏజెన్సీ నుంచి మరో ఏజెన్సీకి బదిలీ చేయించుకోవడం, కనెక్షన్ రద్దు చేసుకోవడం, తదితర కారణాలు తెలుసుకునేందుకు ఇది వీలవుతుంది. ఇందులో భాగంగానే కచి్చతమైన సంఖ్య తెలుసుకోవడానికి లబి్ధదారుల వేలిముద్రలు సేకరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి మార్గర్శకాలు వచి్చన వెంటనే వినియోగదారులకు, గ్యాస్ ఏజెన్సీలకు సమాచారం అందిస్తామని అధికారులు పేర్కొంటున్నా వినియోగదారులు వినిపించుకోకుండా గ్యాస్ ఏజెన్సీలకు పరుగులు తీస్తున్నారు. ఇంటి వద్దకే డెలివరీ బాయ్స్ వస్తారు గ్యాస్ వినియోగదారులు ఈ కేవైసీ కోసం గ్యాస్ ఏజెన్సీల కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదు. మా డెలివరీ బాయ్స్ ఇంటికే వచ్చి ఈ కేవైసీ నమోదు చేయించుకుంటారు. ఇందులో భాగంగా సెల్ఫోన్లు, ఐరిష్ విధానంలో కళ్లను స్కాన్ చేస్తారు. దీనికి అంతరాయం ఏర్పడితేనే గ్యాస్ ఏజెన్సీలకు రప్పిస్తాం. గృహ వినియోగదారులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. రూ. 500 సిలిండర్ కోసం చాలా మంది ఏజెన్సీలకు వస్తున్నారు. తప్పుడు సమాచారం సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాప్తి చెందుతోంది. దీంతో వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. సదరు పథకం కింద లబ్ధి పొందాలని కాంక్షిస్తూ ఏజెన్సీలకు పరుగులు పెడుతున్నారు. వదంతులు నమ్మవద్దు, ఇంకా మార్గదర్శకాలు రాలేదు. ప్రస్తుతం జరుగుతున్న ఈ కేవైసీ ప్రక్రియకు రాయితీ సిలిండర్‌కు ఎలాంటి సంబంధం లేదు. వినియోగదారులు అనవసరంగా ఆందోళనకు గురికావొద్దు. – బి.శ్రీనివాస్, గ్యాస్ డీలర్, జూబ్లీహిల్స్
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019