breaking news
-
ఆ అనుమానాలు పోవాలంటే...
ఈవీఎంలతో అక్రమాలకు పాల్పడటం అసాధ్యమని భారత ఎన్నికల కమిషన్ చెబుతోంది. కానీ వీటిపై వస్తున్న సందేహాలను నివృత్తి చేయడంలో విఫలమవుతోంది. ఎన్నికలు అక్రమాలకు తావు లేకుండా జరగడమే కాదు, జరిగినట్లు కనిపించాలి కూడా! ఎన్నికలు పారదర్శకంగా జరిగాయా లేదా అన్నది తెలుసుకునేందు సులువైన పరిష్కారం, వీవీప్యాట్ స్లిప్‌లను అందివ్వడం!! స్పష్టంగా చెప్పాలంటే... ఓటర్లు ఓ బటన్ ను నొక్కడం ద్వారా ఓటేస్తారు. నొక్కినదానికే పడిందని నిర్ధారించే వీవీప్యాట్ స్లిప్ వీరికి భౌతికంగా అందుతుంది. ఓటరు ఈ స్లిప్‌ను సరి చూసుకుని మళ్లీ వీవీప్యాట్ బాక్స్‌లో వేయాలి. దీనివల్ల ఓట్లు రెండింటిలోనూ రికార్డు అవుతాయి. రెండింటినీ లెక్కించి, సరి చూసిన తరువాత ఫలితాలు ప్రకటించాలి. దేశంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై ప్రకటన చేస్తూ (మార్చి 16, 2024) భారత ఎన్నికల ప్రధాన అధికారి(సీఈసీ) రాజీవ్ కుమార్ చాలా ధీమాగా ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్)లతో అక్రమాలకు పాల్పడటం అసాధ్యమని స్పష్టం చేశారు. ఈవీఎంలన్నీ ఎన్నికల ప్రక్రియ, నియమ నిబంధనలకు అనుగుణంగా ప్రత్యేకంగా డిజైన్ చేసి తయారు చేసినవని వివరించారు. ఈవీఎం వ్యవస్థలో బ్యాలెట్ యూనిట్,కంట్రోల్ యూనిట్‌తో పాటు, వోటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రెయిల్ (వీవీప్యాట్) అనే మూడు భాగాలు ఉంటాయన్నది మనకు తెలుసు. ఎన్నికలు పారదర్శకంగా జరిగాయా లేదా అన్నది తెలుసు కునేందుకూ, ఈవీఎంలపై వస్తున్న అనుమానాల నివృత్తికీ వీవీ ప్యాట్లు కీలకమవుతాయి. కానీ ఎన్నికల కమిషన్ మాత్రం ఈవీఎంల పనితీరుపై ఎలాంటి సందేహాలు అవసరం లేదని బల్లగుద్ది మరీ చెబుతోంది. ఇంకోలా చెప్పాలంటే వీటిపై అనుమానాలు రేకెత్త డమే తప్పన్న చందంగా మాట్లాడుతోంది. ఈవీఎంల వల్ల ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, వేగంగా జరుగుతుందని, వీవీప్యాట్ స్లిప్పు లపై ఆధారపడాల్సిన అవసరం లేదన్నది ఎన్నికల కమిషన్ వాదనగా ఉంది. నమ్మమంటే నమ్మాల్సిందేనా? ఈవీఎంల దుర్వినియోగం అసాధ్యమని సీఈసీ చెబుతున్నా ఓటర్లలో చాలామందికి ఆ నమ్మకమైతే లేదు. ఈవీఎంలపై సందేహాలు వద్దు అని చెప్పేందుకు సీఈసీ తానే రాసిన ఓ ఉర్దూ ద్విపదను ఉటంకించారు. ఆరోపణలపై ఈవీఎంలే స్వయంగా స్పందిస్తే ఎలా ఉంటుందో వివరించారు. ‘‘తీరని కోరికలకు అన్ని వేళల్లో అందరిపై దూషించడం సరికాదు. మీరేంటో మీరే నిరూపించుకోలేనప్పుడే ఈవీఎంలపై తప్పు మోపుతారు’’ అన్నారు. ఈవీఎంల దుర్వినియోగం ఆరోపణలను నిర్ద్వంద్వంగా తిరస్కరించడం, ‘తీరని కోరికలు’గా అభివర్ణించడంతోనే ఈవీఎంలు విశ్వసనీయ మైనవి అయిపోవు. ఎన్నికలు పారదర్శకంగా, బాధ్యతాయుతంగా నిర్వహించాలన్న ఎన్నికల కమిషన్ బాధ్యత పూర్తయినట్టూ కాదు. ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగాలని కోరుతున్నది ప్రజాస్వామ్య వాదులు, రాజకీయ పార్టీలు, ఈవీఎం నిపుణులు. ఈవీఎంల విషయంలో పారదర్శకత లేదనీ, వాటిని నమ్మలేమనీ వీరందరూ పలు సందర్భాల్లో ముక్తకంఠంతో స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ ఈ సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం ఇప్పటివరకూ చేయలేదు. ఈ ధోరణి అనుమానాలు మరిన్ని రెకెత్తేలా చేసేందుకు మాత్రమే ఉపయోగపడుతోంది. దేశంలో పేదరికం తగ్గిపోయిందంటూ నీతి ఆయోగ్ విడుదల చేసిన సంఖ్యలను అస్సలు ప్రశ్నించకూడ దన్నట్టుగా ఉంది ఎన్నికల కమిషన్ ధోరణి. దేశ జనాభాలో 11 శాతం మంది మాత్రమే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారనీ, గడచిన తొమ్మిదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం కోరల నుంచి బయటపడ్డారనీ నీతి ఆయోగ్ చెబుతోంది. పారదర్శకత ఏమాత్రం లేని నేపథ్యంలో ఎవరైనా సరే ఎన్నికల కమిషన్ ఈవీఎంలపై చేస్తున్న ప్రకటనలను, ఇస్తున్న భరోసాలను ఎలా నమ్మగలరు? ఎన్నికలు అందరి వ్యవహారం... ఓటర్లు వేసిన ఓటును మార్చి చూపే అవకాశం కానీ, ఈవీఎంలు తప్పులు చేయడం కానీ అసాధ్యమని ఎన్నికల కమిషన్(ఈసీ) చెబు తోంది. కానీ చాలా కారణాల వల్ల అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉదాహరణకు ఈవీఎంలో పోలైన ఓట్లు, లెక్కించిన ఓట్లకు సంబంధించి 2019 సాధారణ ఎన్నికల్లో సుమారు 373 నియో జకవర్గాల గణాంకాల్లో తీవ్రమైన తేడాలున్నట్లు ‘ద క్వింట్’ వెబ్సైట్ గుర్తించింది. ఈ విషయంపై సీఈసీ, ఈసీ స్పందన నాస్తి. ఎన్నికల తరువాత ఎవరైనా అనుమానాలు వ్యక్తం చేస్తే, ఆరోపణలు చేస్తే వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ దే. తద్వారా మాత్రమే అది ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగిందన్న భరోసా సామాన్యుడికి ఇవ్వగలదు. ఎన్నికల్లో ఓడిపోయిన వారు మాత్రమే ఈవీఎంల విశ్వసనీ యతపై సందేహాలు లేవనెత్తుతారు అని సీఈసీ చేసిన వ్యాఖ్య రెండు విషయాలను సూచిస్తుంది. మొదటిది... ఎన్నికల్లో గెలిచేందుకు తమ వంతు శ్రమ చేయని వారు చెప్పే కుంటిసాకు అని చెప్పే ప్రయత్నం. రెండోది... ఎన్నికలు కేవలం రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు మాత్రమే పరిమితమని చెప్పడం. రెండూ తప్పే. ప్రజాస్వామ్యంలో సర్వాధికారి పౌరుడే. ఈ ప్రజాస్వామ్య సర్వాధికారి సార్వభౌమత్వాన్ని తనకు నచ్చిన వ్యక్తికి దఖలు పరచడమే ఓటింగ్. ఈ పని జరగాలంటే ఎన్నికలు, ఓటింగ్ వ్యవస్థ ప్రజాస్వామ్య సిద్ధాంతాలకు లోబడి ఉండాలి. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో, అక్రమాలకు తావు లేకుండా జరగడమే కాదు... అలా జరిగినట్లు కనిపించాలి కూడా. అంతేకాదు... తాము వేసిన ఓటు సక్రమంగా పడిందా లేదా ఓటరుకు స్పష్టంగా తెలిసేలా ఉండాలి. ఓటింగ్, లెక్కింపు వ్యవస్థలు రెండూ కూడా ఓటరు ఎవరికి ఓటేశారో వారికే ఓటు పడిందని ధ్రువీకరించేలా పనిచేయాలి. వేసిన వెంటనే రికార్డు కావాలి. రికార్డు అయిన విధంగానే లెక్క కూడా తేలాలి. ఈవీఎం యంత్రాలపై ఈసీ నిఘా అనేది రెండు కారణాల వల్ల అంత నమ్మదగ్గదిగా అనిపించదు. మొదటిది ఈవీఎం యంత్రాలను ప్రభావితం చేయగలమని, లేదా అవసరాలకు తగ్గట్టుగా పనిచేసేలా చేయగలమన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ఈసీ తగినంతగా ప్రయత్నించకపోవడం;ఓటర్లు, ప్రతిపక్ష రాజకీయ పార్టీల్లో ఈసీ విశ్వసనీయత అనేది అతి నిమ్న స్థాయికి చేరడం. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయి. వివక్ష లేకుండా ఎన్నికల కోడ్‌ను అమలు చేయలేకపోవడం వాటిల్లో ఒకటి మాత్రమే. ఈవీఎంలు సక్రమంగా పనిచేయవు అనేందుకూ, నిర్దిష్ట పార్టీకి అనుకూలంగా ఓట్లు వేయించుకోవచ్చు అనేందుకూ ఆధారాలు లేవు. అక్రమాలు జరిగే అవకాశం ఉన్నంతమాత్రాన జరిగినట్టూ కాదు. కానీ సాక్ష్యం లేకపోవడం అన్నది సంఘటనే జరగకపోవడం కాదు. వీవీప్యాట్ స్లిప్ ఇవ్వాలి! ఎన్నికల సమయంలో వ్యవస్థలు, వనరులన్నింటిపై పెత్తనం, అధికారం ఒక పార్టీదిగా ఉంటుంది. అందుకే ఓటింగ్ ప్రక్రియ సందర్భంగా అనుమానాలు, ఆరోపణలు వస్తూంటాయి. ఈవీఎంల విషయంలో ఓటర్లు, ప్రతిపక్ష పార్టీల అతిపెద్ద ఆందోళన ఏమిటంటే... తమ ఓటు రికార్డు అయ్యిందా, లేదా అన్నది. ఈ ఆందోళనకు సులువైన పరిష్కారం ఉంది. ఓటర్లకు వీవీప్యాట్ స్లిప్‌లను అందివ్వడం. ఓటరు తాను అనుకున్న పార్టీకే ఓటు పడిందని నిర్ధారించుకుంటే ఆ స్లిప్‌ను బాక్స్‌లో మళ్లీ వేస్తాడు. స్పష్టంగా చెప్పాలంటే... ఓటర్లు ఓ బటన్ ను నొక్కడం ద్వారా ఓటేస్తారు. ఆ తరువాత వీరికి భౌతికంగా వీవీప్యాట్ స్లిప్ అందుతుంది. ఓటరు ఈ స్లిప్‌ను సరి చూసుకుని మళ్లీ వీవీప్యాట్ బాక్స్‌లో వేయాలి. దీనివల్ల ఓట్లు రెండింటిలోనూ రికార్డు అవుతాయి. రెండింటినీ లెక్కించి సరి చూసిన తరువాత ఫలితాలు ప్రకటించాలి. గత ఏడాది డిసెంబరులో ఇండియా కూటమి కూడా ఇదే సూచన చేసింది. సుప్రీంకోర్టు విచా రణలోని అంశాల్లోనూ ఇది ఉంది. వీవీప్యాట్ స్లిప్స్‌ను లెక్కించి ఫలితాలను ప్రకటించడం వల్ల ఫలితాల వెల్లడిలో కొంత జాప్యం జరగవచ్చు కానీ... ఏడు దశల్లో నెలన్నర పాటు ఎన్నికలు జరగ్గా కానీ జాప్యం ఒకట్రెండు రోజులు ఫలితాలు వెల్లడించేందుకు అయితే నష్టమేమీ ఉండదు. ఎ ఎల్ ఐ చౌగులే వ్యాసకర్త ముంబై కేంద్రంగా పనిచేస్తున్న స్వతంత్ర జర్నలిస్టు (‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
‘400 మందితో నామినేషన్ వేయిస్తా’
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గంలో బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలను నిర్వహించే మార్గాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ సింగ్ చెప్పారు. రాజ్‌గఢ్‌లోని కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాను ఇక్కడి నుంచి 400 మంది నామినేషన్లు వేసేలా కృషి చేస్తున్నానని, తద్వారా బ్యాలెట్ పేపర్ ద్వారా పోలింగ్ నిర్వహించే అవకాశముందని పేర్కొన్నారు. రాజ్‌గఢ్‌లోని కచ్నారియా గ్రామంలో దిగ్విజయ్ సింగ్ మాట్లాడారు. ‘ఇక్కడ బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని మీరు కోరుకుంటే ఒక మార్గం ఉంది . ఒక స్థానం నుండి 400 మంది అభ్యర్థులు పోటీ చేస్తే, బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తారు . దానికి నేను సిద్ధమవుతున్నాను’ అన్నారు. పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు చెల్లించాల్సిన సెక్యూరిటీ డిపాజిట్ వివరాలను కూడా దిగ్విజయ్ సింగ్ తెలిపారు. "రిజర్వ్డ్ కేటగిరీకి చెందని వారు రూ. 25,000, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు రూ. 12,500 డిపాజిట్ చేయాలి. ఇది దేశంలో బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరిగే ఒక సీటుకు దారి తీస్తుంది" అని చెప్పారు. ప్రజలు ఈ ప్రభుత్వంతో విసిగిపోయారు కాబట్టి ఈసారి ఎన్నికల్లో విజయం సాధించగలమన్నారు. ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించడంపై దిగ్విజయ్ సింగ్ గతంలోనే అనుమానాలు లేవనెత్తారు. ఈవీఎంలపై ప్రజల అనుమానాలపై 2018లోనే ఏఐసీసీ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని, వచ్చే సార్వత్రిక ఎన్నికలను బ్యాలెట్ పేపర్ల ద్వారానే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నట్లు గత ఫిబ్రవరిలో దిగ్విజయ్ సింగ్ ఏఎన్ఐతో అన్నారు. -
అసెంబ్లీల వారీగా ఈవీఎంల తరలింపు
వేలూరు: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వేలూరు లోక్‌సభ నియోజవర్గంలోని పోలింగ్ సెంటర్లకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈవీఎం మిషన్లను తరలిస్తున్నారు. జిల్లా కలెక్టరేట్లోని గోడౌన్లో ఈవీఎం మిషన్లను భద్ర పరిచారు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు రావడంతో గోడౌన్లో సిద్ధంగా ఉంచిన ఈవీఎంలను వేలూరు జిల్లాలోని మొ త్తం ఐదు అసెంబ్లీ నియోజక వర్గాలకు కలెక్టర్, ఎన్నికల అధికారి సుబ్బులక్ష్మి అధ్యక్షతన గురు వారం ఉదయం పటిష్ట పోలీస్ బందోబస్తు నడుమ తరలించారు. ఆ సమయంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల ముందుగా ఈ ఈవీఎం మిషన్ల గోడౌన్‌ను పరిశీలించారు. వేలూరు జిల్లాలోని మొత్తం 1,303 పోలింగ్ కేంద్రాలకు గాను 1,561 ఈవీఎం మిషన్లు, 1,561 కంట్రోల్ మిషన్లు, వీవీ ప్యాడ్ వంటి వాటిని తరలించారు. ఈవీఎం మిషన్లను ఆయా అసెంబ్లీ స్థానాల్లోని తాలుకా కేంద్రాల్లో ప్రత్యేక గదిలో ఉంచి, సీల్ వేయనున్నట్లు తెలిపారు. ఆ గదులకు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆ సమయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు అధికారుల వద్ద పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు, జిల్లాలోని తహసీల్దార్లు పాల్గొన్నారు. -
‘‘ఈవీఎంల గోల్‌మాల్‌లో ప్రధాని హస్తం ఉండొచ్చు’’
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ పార్లమెంటులో చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ లోక్‌సభపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి విమర్శలు గుప్పించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి 370 సీట్లు వస్తాయని ప్రధాని అంత కచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారని ప్రశ్నించారు. అంత పక్కాగా చెప్పగలుగుతున్నారంటే ఈవీఎంల గోల్‌మాల్‌లో ప్రధాని హస్తం ఉన్నట్లు కనిపిస్తోందని అధిర్ అనుమానం వ్యక్తం చేశారు. ‘ఇప్పటివరకు ఈవీఎంల గోల్‌మాల్‌పై మాకు కచ్చితమైన సమాచారం లేదు. కానీ వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో ప్రధాని అంత పక్కాగా చెప్పడం చూస్తుంటే ఈవీఎంలలో ఏవో రహస్యాలు దాగి ఉన్నాయనిపిస్తోంది. కాశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370ని రద్దు చేసినందు వల్లే బీజేపీకి 370 సీట్లు వచ్చాయని వాళ్లు ప్రపంచానికి చూపించాలనుకుంటున్నారు. ఒక వ్యవస్థ తర్వాత మరొక వ్యవస్థను బీజేపీ కబ్జా చేసింది. ఈ దేశంలో ఎన్నికలను కూడా ఒక తమాషాలా తయారు చేశారన్న భావన కలుగుతోంది’ అని అధిర్ అన్నారు. #WATCH | On PM Modi's statement "370 to BJP, 400 to NDA", Congress MP AR Chowdhury says, "...Lagta hai ki EVM mein Modi ji ka koi haath chalega..." pic.twitter.com/0KK3AEEIiZ — ANI (@ANI) February 6, 2024 ఇదీచదవండి.. క్రాకర్స్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. ఐదుగురి మృతి -
'ఎమ్మెల్యేలకు సొంతూళ్లలో 50 ఓట్లు కూడా రాలేదు'
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేత కమల్ నాథ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొందరు ఎమ్మెల్యేలు తమ సొంతూళ్లలో కనీసం 50 ఓట్లు కూడా రాలేదని ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల అవకతవకలపై స్పందించడానికి ఆయన నిరాకరించారు. తమ నేతలతో సమీక్ష నిర్వహించిన తర్వాతే మాట్లాడతానని చెప్పారు. ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఇప్పటికే స్బందించారు. చిప్ ఉన్న ఎలాంటి యంత్రాన్నైనా హ్యాక్ చేయవచ్చని ఆయన అన్నారు. ఈవీఎంల విశ్వసనీయతపై ఆయన అనుమానాలను వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 సీట్లకు గాను బీజేపీ 163 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 66 సీట్లకే పరిమితమైంది. Any Machine with a Chip can be hacked. I have opposed voting by EVM since 2003. Can we allow our Indian Democracy to be controlled by Professional Hackers! This is the Fundamental Question which all Political Parties have to address to. Hon ECI and Hon Supreme Court would you… https://t.co/8dnBNJjVTQ — digvijaya singh (@digvijaya_28) December 5, 2023 మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీని సూచించాయి. కానీ వాస్తవంగా బీజేపీ పూర్తి ఏకపక్ష మెజారిటీని సాధించింది. ఈ ఫలితంపై కాంగ్రెస్ నాయకులతో పార్టీ ప్రచార సారథి ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. భారీ అపజయం వెనకు ఉన్న కారణాలను విశ్లేషించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పవనాలు వీస్తున్నట్లు కనిపించినప్పటికీ ఎన్నికల ఫలితాలు పూర్తి భిన్నంగా ఉన్నాయని కమల్ నాథ్ చెప్పారు. కొందరు ఎమ్మెల్యేలు తమ సొంతూళ్లలో కనీసం 50 ఓట్లు కూడా రాలేదని చెబుతున్నారు. నిజానికి ఇది ఎలా సాధ్యమైతుందని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: Rajasthan Politics : రాజస్థాన్‌కు యూపీ సీఎం.. కారణమిదే!
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019