breaking news
-
డీకే అరుణతో నాకు పోటీ ఏంటి? పొంతనేంటి?: సీఎం రేవంత్
సాక్షి, నాగర్ కర్నూల్: లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్, బీజేపీ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కొడంగల్‌ను దొంగ దెబ్బ తీయాలని బీజేపీ, బీఆరెస్ నాయకులు కుట్ర చేస్తున్నారని.. ఈ కుట్రలను తిప్పి కొట్టాల్సిన బాధ్యత నియోజకవర్గ ప్రజలపై ఉందన్నారు. నారాయణ పేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బీజేపీ నేత, మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్ధి డీకే అరుణపై సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆనాడు మంత్రిగా ఉండి నారాయణపేట ఎత్తిపోతల రాకుండా అడ్డుకున్న డీకే అరుణ.. నేడు మళ్లీ ఓట్లు అడగడానికి వస్తున్నారని మండిపడ్డారు. తనను అవమానించానని డీకే అరుణ మాట్లాడుతున్నారని.. శత్రువు చేతిలో చుర కత్తిగా మారి పాలమూరు కడుపులో ఎందుకు పొడుస్తున్నవని మాత్రమే తాను ప్రశ్నించినట్లు పేర్కొన్నారు. నరేంద్రమోదీ చేతిలో కత్తిగా మారి పాలమూరు కడుపులో పొడవద్దని అన్నారు. ‘కొడంగల్ నియోజకవర్గంలో మీరు నాటిన మొక్క ఇవాళ మీ ఆశీర్వాదంతో తెలంగాణ ముఖ్యమంత్రి స్థాయికి చేరుకుంది. కొడంగల్ నియోజకవర్గానికి పీసీసీ అధ్యక్ష పదవి, ముఖ్యమంత్రి పదవి ఏక కాలంలో ఇచ్చిన ఘనత సోనియమ్మది. చేయి చాచి అడిగే పరిస్థితి నుంచి ఇవాళ ఎవరికి ఏం కావాలో ఇచ్చే స్థాయికి కొడంగల్‌కు కాంగ్రెస్ అవకాశం ఇచ్చింది. మీరే కథానాయకులై నన్ను 33 వేల మెజారిటీతో గెలిపించారు. పాలమూరు బిడ్డలు నూటికి నూరు శాతం నాకు అండగా నిలబడ్డారు. అలాంటి నాకు నీ మీద అసూయ ఎందుకుంటుంది.? ఎందుకు కోపం ఉంటుంది.? నాకు నీకు పోటీ ఏంటి..? పొంతనేంటి..? ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాకు శత్రువులు లేరు. ప్రత్యర్ధులు లేరు. పాలమూరు అభివృద్ధి కోసమే నా తపనంతా. 70ఏళ్ల తరువాత పాలమూరుకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నాకు అండగా నిలబడండి. పాలమూరును రాబోయే వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తా. పార్టీలకు అతీతంగా ముందుకు రండి.పాలమూరు అభివృద్ధి చేసి చూపిస్తా. వందరోజుల్లోనే మమ్మల్ని కేసీఆర్ దిగిపొమ్మంటున్నారు. పదేళ్లు ప్రజలను మోసం చేసిన నిన్ను చెంపలు వాయించాలి. తాగుబోతు కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. రూ. 3,900 కోట్ల లోటు బడ్జెట్‌తో నేను సీఎంగా బాధ్యత తీసుకున్నా. నేను వచ్చాక నాలుగు నెలలల్లో 26వేల కోట్లు వడ్డీలు కట్టా. అసెంబ్లీకి రా నేను లెక్కలు చూపిస్తా. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. రూ.10లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందిస్తున్నాం. రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తూ... 45 లక్షల ఇళ్లల్లో వెలుగు నింపుతున్నాం. సేవాలాల్ సాక్షిగా పంద్రాగస్టులోగా రూ.2లక్షలు రుణమాఫీ చేస్తాం. రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా అని హరీష్ మాట్లాడుతున్నాడు. ఈ వేదికగా నేను హరీష్ రావుకు సవాల్ విసురుతున్నా. పంద్రాగస్టులోగా రుణమాఫీ చేస్తే నీ పార్టీని రద్దు చేసుకుంటావా? ఈ సవాల్‌కు హరీష్ సిద్ధమా.? నేను మాట ఇస్తే ఎలా ఉంటుందో పోయి మీ మామను అడుగున. బీజేపీ నేతలకు పిచ్చి ముదిరి మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. వారి మాయలో పడొద్దు. కొడంగల్ నుంచి వంశీచంద్ రెడ్డికి 50వేల మెజారిటీ ఇవ్వండి’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. -
నీ చరిత్ర మర్చిపోకు రేవంత్: డీకే అరుణ
-
డీపీఆర్ మార్చితే.. నిధులు నేనే తెస్తా
పాలమూరు: పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు జూరాల నుంచి నీళ్లు తీసుకొచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి డీపీఆర్ మార్చితే.. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానని మహ బూబ్‌నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ప్రకటించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో తెలంగాణ ఎన్నికల ఇన్చార్జ్ చంద్రశేఖర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలమూరు జిల్లాకు ఏం చేశాడో చెప్పాలని నిలదీశారు. రేవంత్‌రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఎంపీటీసీగానే మాట్లాడుతున్నారని విమర్శించారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమ ణారెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌పై ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్ వైపు ఓటర్లు ఆసక్తి చూపారే తప్ప అది రేవంత్‌రెడ్డి గొప్పతనం ఏమా త్రం కాదన్నారు. ఆనాడు కేసీఆర్ కాంగ్రెస్ వాళ్లను కొనుగోలు చేస్తున్నాడని ఆరోపించిన రేవంత్ ఇప్పుడు ఇతర పార్టీల వారిని ఎందుకు చేర్చుకుంటున్నారో చెప్పాలన్నారు. సీఎం రేవంత్ ఇంకా జెడ్పీటీసీ స్థాయిలోనే ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇద్దరు సీఎం అభ్యర్థులపై తాను విజయం సాధించానంటే బీజేపీ కార్యకర్తల వల్లేనని చెప్పారు. -
నేడు బీజేపీ టిఫిన్ బాక్స్ బైఠక్‌లు
సాక్షి, హైదరాబాద్: శనివారం బీజేపీ 44వ సంస్థాపక దినోత్సవం సందర్భంగా.. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో ‘టిఫిన్ బాక్స్ బైఠక్’ల నిర్వహణకు పార్టీ సిద్ధమౌతోంది. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, పార్టీ సికింద్రాబాద్ అభ్యర్థి జి.కిషన్‌రెడ్డి మొదలు అన్ని స్థాయిల నేతలు, కార్య కర్తలు తమ తమ ఓటున్న సొంత పోలింగ్ బూత్ కేంద్రాల్లో జరిగే సమావేశాల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయాలు, పోలింగ్ బూత్‌ల వద్ద పార్టీ పతాకాలను ఆవిష్కరించనున్నా రు. కాగా రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్ల పరిధిలోని పోలింగ్ బూత్ కేంద్రాలకు ఎవరి అల్పాహారం (టిఫిన్) వారు తెచ్చుకుని, అక్కడే తింటూ ఉదయ ం నుంచి మ«ధ్యాహ్నం వరకు భేటీలు నిర్వహించను న్నారు. పార్లమెంట్ ఎన్నికలకు పార్టీపరంగా సన్నద్ధ తపై, పార్టీ చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించనున్నారు. పార్టీ కేడర్ మధ్య మెరుగైన సమన్వయ సాధన, కార్యాచరణ రూప కల్పనకు ఈ భేటీలు దోహదపడతాయని నేతలు చెబుతున్నారు. మూడు లక్ష్యాల సాధనకు సంకల్పం ఒక్కో పోలింగ్ బూత్‌లోని మూడు, నాలుగు పోలింగ్ స్టేషన్లలో ఆయా సామాజికవర్గాల ఓట్లు, వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, వారికి సంబంధించి సమాచారం, ఇతర అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, యువత, మహిళలు, రైతులు ఇలా వివిధ వర్గాల ఓటర్లను ఏవిధంగా చేరుకోవాలి, దళిత బస్తీలు, గిరిజన తండాల్లో ఎలాంటి ప్రచారాన్ని నిర్వహించాలన్న దానిపై అభిప్రాయ సేకరణ జరపను న్నారు. ఫిర్ ఏక్‌బార్ నరేంద్ర మోదీ సర్కార్ కోసం 370 సీట్ల సాధన, ప్రతి పోలింగ్ బూత్‌లో అదనంగా 370 ఓట్ల సాధన, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి బూత్‌లో 50 ఓట్ల సాధనకు ఈ సందర్భంగా సంకల్పం తీసుకోనున్నారు. కాచిగూడలో కిషన్‌రెడ్డి.. మహబూబ్‌నగర్‌లో డీకే అరుణ శనివారం ఉదయం అంబర్‌పేట నియోజ కవర్గం కాచిగూడలోని 214 పోలింగ్ స్టేషన్లో కిషన్‌రెడ్డి టిఫిన్ బాక్స్ బైఠక్‌లో పాల్గొంటారు. పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి అభయ్‌పాటిల్ సికింద్రాబాద్ అసెంబ్లీలోని మెట్టుగూడ 33–35 పోలింగ్ స్టేషన్లలో, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ అభ్యర్థి డీకే అరుణ నారాయణపేట అసెంబ్లీ కోయిల్‌కొండలోని 23–27 పోలింగ్ స్టేషన్లలో పాల్గొంటారు. ప్రధాన కార్యదర్శి కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ కరీంనగర్‌లోని సాధనా స్కూల్ 174వ పోలింగ్ స్టేషన్లో, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్ ముషీరాబాద్ నియోజక వర్గం చిక్కడపల్లిలోని 9వ పోలింగ్స్టేషన్లో, జాతీయ కార్యవర్గ సభ్యుడు, మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్ మల్కాజిగిరిలోని వినాయక్‌నగర్ 155–157 పోలింగ్స్టేషన్లలో, బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి నిర్మల్ అసెంబ్లీలోని గాజులపేట 192 పోలింగ్ స్టేషన్లో, ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి మహేశ్వరం అసెంబ్లీలోని నాదర్గుల్, బడంగ్‌పేట పోలింగ్ స్టేషన్లలో పాల్గొంటారు. -
డీకే అరుణ సోయి లేకుండా మాట్లాడుతున్నారు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: తనపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వ్యక్తిగతంగా, సోయిలేకుండా మాట్లాడటం తగదని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వనితుడు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. శనివారం డీసీసీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కేవలం కుటుంబ సభ్యుల వ్యాపారాలు, స్వలాభం కోసమే ఆమె రాజకీయాలు నడుపుతున్నారని ఆరోపించారు. 2014లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా తనను ఓడించేందుకు ఎన్నో కుట్రలు పన్నారని, అయినా అక్కడి ప్రజల ఆదరాభిమానాలతో గెలుపొందానని పేర్కొన్నారు. 2006 నుంచే ఏఐసీసీ సభ్యుడిగా ఉన్నానని, ఆమెకు 2014 వరకు కాంగ్రెస్‌లో సభ్యత్వమే లేదన్నారు. ఎన్నో పార్టీలు మారిన డీకే అరుణ బీసీ ద్రోహి అని విమర్శించారు. తాను నాన్–లోకల్ కాదని ఉమ్మడి పాలమూరు బిడ్డనని వంశీచంద్‌రెడ్డి చెప్పారు. అప్పట్లో పాన్‌గల్ జెడ్పీటీసీ సభ్యురాలిగా కాంగ్రెస్ నుంచి డీకే అరుణ గెలుపొందినప్పుడు ఆమెకు ఈ విషయం గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. కేవలం కాంట్రాక్టులు, లిక్కర్ దందాలు, ధనార్జన కోసమే రాజకీయాల్లో ఉన్న ఆమె బండారం బయటపెడతామన్నారు. ఈ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నుంచి ఓడిపోతాననే అక్కసుతో ఎలాంటి సోయి లేకుండా మాట్లాడుతున్నారని చెప్పారు. కనీసం తన పుట్టిన ఊరు ధన్వాడ మండలానికి గానీ, నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతలకుగానీ అరుణ ఏమీ చేయలేకపోయారని, రాజకీయ విలువలు లేని ఆమె తీరుపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఈ ప్రాంత సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానన్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019