breaking news
-
ఛా.. నిన్ను తీసుకుని తప్పు చేశా.. నటుడిపై సెటైర్లు
కబీర్ సింగ్.. కోట్లు కొల్లగొట్టిన ఈ మూవీ కొందరికి నచ్చింది. మరికొందరికి నచ్చలేదు. ఇందులో కాలేజీ డీన్‌గా నటించిన అదిల్ హుస్సేన్‌కు కూడా సినిమా నచ్చలేదట! తన సినీ కెరీర్లో ఎందుకు నటించాన్రా దేవుడా.. అని ఫీలైన సినిమా ఏదైనా ఉందంటే.. అదే కబీర్ సింగ్ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. 'అందులో యాక్ట్ చేయనని చెప్తే కేవలం ఒక్క రోజే రమ్మని అడిగారు. భారీ పారితోషికం డిమాండ్ చేస్తే వాళ్లే సైలెంట్‌గా ఉంటారనుకున్నాను. డబ్బులెక్కువ డిమాండ్ చేశా కానీ నేను డిమాండ్ చేసిన మొత్తం ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. దీంతో తప్పనిపరిస్థితిలో నేను సినిమా చేశాను. నేను నటించిన సన్నివేశం బాగానే ఉంది. సినిమా అంతా కూడా అలాగే ఉంటుందనుకున్నాను. మూవీ రిలీజైన తర్వాత చూస్తే.. ఇలాంటి సినిమా చేశానా? అని సిగ్గుతో చచ్చిపోయాను. నా భార్యను కూడా సినిమా చూడమని అడగలేదు. తను చూసుంటే ఇలాంటి మూవీలో యాక్ట్ చేశావా? అని నాపై కోప్పడేది' అని చెప్పుకొచ్చాడు. ఒక్క బ్లాక్‌బస్టర్‌తో గుర్తింపు ఇది చూసిన కబీర్ సింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియాలో సదరు నటుడిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. 'మీరు గొప్పగా భావించి యాక్ట్ చేసిన 30 సినిమాలతో రాని గుర్తింపు.. ఎందుకు నటించానా? అని బాధపడుతున్న ఈ ఒక్క బ్లాక్‌బస్టర్ చిత్రంతోనే వచ్చింది. మిమ్మల్ని సినిమాలోకి తీసుకున్నందుకు నేను బాధపడుతున్నాను. మీకు నటనపై అభిరుచి కంటే దురాశే ఎక్కువుందని అర్థమవుతోంది. మీరు బాధపడక్కర్లేదు మీరు సిగ్గుతో తలదించుకోకండి.. మీ ముఖాన్ని ఏఐ సాయంతో రీప్లేస్ చేస్తాను.. అప్పుడు మనసారా నవ్వుకోండి' అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. దీనిపై అదిల్ హుస్సేన్ ఓ మీడియాతో మాట్లాడుతూ.. కబీర్ సింగ్ సినిమా చూసి నేను షాకైన మాట వాస్తవం. ఇప్పటికీ ఆ మూవీలో నటించినందుకు రిగ్రెట్‌గా ఫీలవుతున్నాను. అభిప్రాయాన్ని మార్చుకునే ఉద్దేశ్యం నాకు లేదు అని చెప్పుకొచ్చాడు. Ur 'belief' in 30 art films didn't get as much fame to u as ur 'regret' of 1 BLOCKBUSTER film did 👏https://t.co/BiJIV3UeyO I regret casting u,knwing that ur greed is bigger than ur passion. NOW I'll save U from the shame by replacing Ur face with AI help👍 Now smile properly 🙂 — Sandeep Reddy Vanga (@imvangasandeep) April 18, 2024 చదవండి: డ్రగ్స్ కేసులో షారుఖ్ కుమారుడికి క్లీన్ చిట్ ఇచ్చిన అధికారి సంచలన నిర్ణయం -
Shankar Daughter Reception Photos: శంకర్ కుమార్తె రిసెప్షన్ హైలైట్స్.. దిల్‌రాజు, సిద్దార్థ్, బేబమ్మ సహా ఎందరో.. (ఫోటోలు)
-
టాలీవుడ్ డైరెక్టర్ అరుదైన ఘనత..!
ఆర్ఎక్స్ 100 మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ డైరెక్టర్ అజయ్ భూపతి. గతేడాది మంగళవారం సినిమాతో మరో సూపర్ హిట్ కొట్టారు. పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో తెరకెక్కించి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ మూవీ అభిమానుల ఆదరణ దక్కించుకుంది. తాజాగా అజయ్ భూపతికి అరుదైన అవార్డ్ వరించింది. ఇండియన్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ దర్శకుడిగా ఆయన ఘనత దక్కించుకున్నారు. మంగళవారం సినిమా హిట్ కావడంతోనే ఈ అవార్డ్‌కు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అవార్డ్ రావడం పట్ల సంతోషం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘ కాగా.. అజయ్ భూపతి ఆర్ఎక్స్ 100తో టాలీవుడ్లో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తెరకెక్కించిన మహాసముద్రం పెద్దగా హిట్ కొట్టలేకపోయింది. గతేడాది మంగళవారం మూవీతో మళ్లీ సక్సెస్ బాట పట్టారు. ఈ చిత్రంలో ప్రియదర్శి, నందిత శ్వేత, దివ్య పిళ్లై కీలక పాత్రలు పోషించారు. Elated to receive BEST DIRECTOR Award for #Mangalavaaram at "INDIAN WORLD FILM FESTIVAL 2024" 🔥 Thankyou @miniboxoffice Team for the honour 😇 pic.twitter.com/8gTebipvqu — Ajay Bhupathi (@DirAjayBhupathi) April 16, 2024 -
ఆ ఆరోపణలతో నాకు సంబంధం లేదు: నటుడు
దర్శకుడు, నటుడు అమీర్ ఇటీవల పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మాదక ద్రవ్యాల కేసులో అరెస్టయిన సినీ నిర్మాత జాఫర్ సాధిక్తో దర్శకుడు అమీర్‌కు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో మంగళవారం నాడు ఎన్సీబీ, ఈడీ అధికారులు అమీర్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సంఘటన కోలీవుడ్‌లో తీవ్ర కలకలానికి దారి తీసింది. కాగా బుధవారం మధురైలో జరిగిన రంజాన్ కార్యక్రమంలో పాల్గొన్న అమీర్ మీడియాతో మాట్లాడుతూ.. తనపై వస్తున్న ఆరోపణలకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తన ఇంట్లో అధికారులు 11 గంటలపాటు సోదాలు నిర్వహించిన విషయం నిజమేనన్నారు. అయితే ఈ సోదాల్లో ఎలాంటి ఆధారాలు లభించాయన్నది వారే చెప్పాలన్నారు. ఈ వ్యవహారంలో తాను విచారణకు పూర్తిగా సహకరిస్తానన్నారు. అలాగే తనను లక్ష్యంగా చేసుకుని విచారణ జరుపుతున్నారా? అన్న ప్రశ్నకు తన వద్ద సమాధానం లేదన్నారు. అయితే ఈ విషయమై ఒక రోజు కచ్చితంగా వివరంగా మాట్లాడతానన్నారు. ఈ వ్యవహారం గురించి తాను ఒక నెలరోజులుగా మాట్లాడలేని పరిస్థితి అని.. ఆ దేవుడు చూసుకుంటాడనే మౌనంగా రోజులు గడిపానన్నారు. చదవండి: మీకు నచ్చకపోతే అలా చేస్తారా?.. ట్రోల్స్‌పై మండిపడ్డ నటి! -
ఆల్రెడీ పెళ్లయిన వ్యక్తితో వివాహం.. అందుకే సీక్రెట్‌గా..: నటి
బాబీ, రోటి కపడా ఔర్ మకాన్, రాకీ, లవ్ స్టోరీ, బేటా, కర్తవ్య.. ఇలా పలు హిందీ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది అరుణ ఇరానీ. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలు పెట్టిన ఆమె తర్వాతి కాలంలో సహాయక పాత్రలతో ఫేమస్ అయింది. సినిమాలే కాకుండా సీరియల్స్ కూడా చేసింది. తాజాగా ఆమె అరుణ ఇరానీ ఓ ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. 'కోహ్రాం సినిమా షూటింగ్లో తొలిసారి డైరెక్టర్ కుకును కలిశాను. అప్పటికే నా ఇల్లు గడవడం కోసం చాలా సినిమాలు చేస్తున్నాను. కానీ అవేమీ పెద్దగా గుర్తింపు ఉన్న పాత్రలు కావు. ఒకరంటే ఒకరికి కోపం చెన్నైలో సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో కుకు ఓ నెలరోజులపాటు నా డేట్స్ అడిగారు. సరేనని సినిమాలో భాగమయ్యాను. అయితే బిజీ షెడ్యూల్స్ వల్ల అన్నీ మేనేజ్ చేయలేకపోయాను. నా వల్ల కావడం లేదని, వేరే ఆప్షన్ చూసుకోమని చెప్పాను. అప్పుడు కుకుకి విపరీతమైన కోపం వచ్చింది. నాపై సీన్లు ఉన్నా, లేకపోయినా నాకు కొన్ని డేట్స్ ఇచ్చి రమ్మనేవారు. నాపై సీన్ షూట్ లేనప్పుడు ఎందుకు రమ్మంటున్నారని కోపమొచ్చింది. ఒక్కోసారైతే రోజంతా కూర్చోబెట్టి ఒక చిన్న షాట్ తీసేవారు. ఆయనను చూస్తేనే ఒళ్లు మండిపోయింది. తనకు కూడా నేనంటే అంతే కోపం ఏర్పడింది. ప్రేమలో పడిపోయాం ఏమైందో తెలీదు కానీ ఉన్నట్లుండి సాఫ్ట్‌గా మారిపోయాడు. కూల్‌గా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం. అప్పుడు తనే నా డేట్లు అడ్జస్ట్ చేశాడు. అలా మేము ప్రేమలో పడ్డాం.. పెళ్లి చేసుకున్నాం. కానీ ఎవరికీ ఆ విషయం చెప్పలేదు. ఎందుకంటే అతడికి ఆల్రెడీ పెళ్లయింది. నాకు ఆ విషయం తెలియదని అంతా అనుకున్నారు. అతడి భార్య, పిల్లలు సెట్స్‌కు వచ్చేవారు.. కాబట్టి తనకు ఇదివరకే ఓ కుటుంబం ఉందని నాకు ముందే తెలుసు. అయినా సరే కలిసుండాలనుకున్నాం. అందరితో పోరాడి మరీ అతడు నన్ను పెళ్లి చేసుకున్నాడు. అయితే పిల్లల్ని వద్దనుకున్నాం.. ఈ నిర్ణయం తీసుకోవడమే మేము చేసిన పెద్ద తప్పు' అని చెప్పుకొచ్చింది. చదవండి: పాతికేండ్లుగా సినిమాలకు దూరం.. రీఎంట్రీపై తెలుగు హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019