breaking news
-
నూడుల్స్‌లో డైమండ్స్ : ఏం తెలివితేటలు రా అయ్యా!
బంగారం, విలువైన వజ్రాలను అక్రమంగా రవాణా చేసేందుకు కేటుగాళ్లు అనుసరిస్తున్న పద్దతులు అధికారులను సైతం విస్మయపరుస్తున్నాయి. కానీ చివరకుఅధికారుల తనిఖీల్లో అడ్డంగా దొరికి పోతున్నారు. తాజాగా ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ డిపార్ట్మెంట్ కోట్లరూపాయల విలువైన వజ్రాలను, బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. ముఖ్యంగా నూడుల్స్ ప్యాకెట్లలో డైమండ్స్ దాచిన తీరు హాట్ టాపిక్‌గా నిలిచింది. ముంబైనుంచి బ్యాంకాక్‌కు వెళ్తున్న భారతీయుడు ట్రాలీ బ్యాగ్‌లో నూడుల్స్ ప్యాకెట్లో డైమండ్లను తరలిస్తూ గుట్టుగా అధికారుల కన్నుగప్పాలని చేశాడు. కానీ తనిఖీల్లో అడ్డంగా బుక్కయ్యాడు. రూ.2.02 కోట్ల విలువైన 254.71 క్యారెట్ల నేచురల్ లూజ్ డైమండ్, 977.98 క్యారెట్ ల్యాబ్ గ్రోన్ డైమండ్ లభ్యమయ్యాయి. మరో ఘటనలో కొలంబో నుండి ముంబైకి ప్రయాణిస్తున్న ఒక విదేశీ మహిళను తనిఖీ చేయగా ఆమె లోదుస్తుల లోపల దాచిన 24 క్యారెట్ల గోల్డ్ బిస్కట్లు కనుగొన్నారు. వీటి మొత్తం బరువు 321గ్రాములు. మరో వైపు ఫేస్ మాస్క్‌లోనూ డైమండ్స్ తరలిస్తున్నట్లు గుర్తించారు. దుబాయ్ నుంచి ఇద్దరు, అబుదాబి ఇద్దరు, బహ్రెయిన్ ఇద్దరు, దోహానుఎంచి ఇద్దరు రియాద్ ఇద్దరు మస్కట్ బ్యాంకాక్ ,సింగపూర్ నుంచి ఒక్కొక్కరు చొప్పున 10 మంది అనుమానితులను తనిఖీ చేయగా, రెక్టమ్, ఇతర శరీర భాగాల్లో దాచిన రూ.4.04 కోట్ల విలువైన 6.199 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మొత్తం గా 13 వేర్వేరు కేసుల్లో రూ.6.46 కోట్ల విలువైన అక్రమ రవాణా బంగారం, డైమండ్స్,తదితరాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేశారు. During 19-21 April, 2024, Airport Commissionerate, Mumbai Customs Zone-III seized over 6.815 Kg Gold valued at Rs. 4.44 Cr & Diamonds valued at Rs. 2.02 Cr total amounting to Rs. 6.46 Cr across 13 cases. Diamonds were found concealed in noodle packets. Four pax were arrested. pic.twitter.com/j5wAPV5jAk — Mumbai Customs-III (@mumbaicus3) April 22, 2024 #WATCH | Maharashtra: During 19-21 April, 2024, Mumbai Customs seized over 6.815 Kg of gold valued at Rs 4.44 crores and diamonds valued at Rs 2.02 crores, total amounting to Rs 6.46 crores across 13 cases. Diamonds were found concealed in noodle packets. Four Passengers were… pic.twitter.com/02LzDS1aDZ — ANI (@ANI) April 22, 2024 -
రూ.10 కోట్ల వజ్రాలు రూ.3 కోట్లకే
దొడ్డబళ్లాపురం: రూ.10 కోట్ల విలువైన వజ్రాలను రూ.3 కోట్లకే ఇస్తామని నమ్మించి వ్యాపారిని మోసం చేయడానికి యత్నించిన నలుగురిని బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయం పోలీసులు అరెస్టు చేసారు. రవి, నవీన్‌కుమార్, అహ్మద్, అబ్దుల్ దస్తగిరి పట్టుబడ్డ నిందితులు. లక్ష్మినారాయణ అనే వజ్రాల వ్యాపారికి వాట్సాప్ కాల్ చేసి పై విధంగా ప్రలోభపెట్టారు. డీల్ కుదుర్చుకోవడానికి నిందితులు, వ్యాపారి ఎయిర్‌పోర్టు వద్ద తాజ్ హోటల్లో కలిశారు. వ్యాపారి ఆ వజ్రాలను పరిశీలించగా అవి నకిలీవని తెలిసింది. దీంతో ఎయిర్‌పోర్టు పోలీసులకు సమాచారం ఇవ్వగా నిందితులను అరెస్టు చేసి నకిలీ వజ్రాలను సీజ్ చేశారు. -
అతిపెద్ద గొయ్యి.. ఇక్కడ తవ్వే కొద్ది వజ్రాలు!
తూర్పు సెర్బియాలో ఉన్న వజ్రాల గని ఇది. భూమ్మీద అతిపెద్ద గోతుల్లో ఒకటిగా ఇది రికార్డులకెక్కింది. దీని వ్యాసం 1200 మీటర్లు, లోతు 525 మీటర్లు. తొలిసారిగా ఈ ప్రాంతంలో వజ్రాల నిక్షేపాలు ఉన్నట్లు 1955లో నాటి సోవియట్ భూగర్భ శాస్త్రవేత్త యూరీ ఖబార్దిన్ గుర్తించారు. వజ్రాలను వెలికి తీసేందుకు అప్పటి సోవియట్ ప్రభుత్వం 1957లో ఇక్కడ మిర్నీ మైన్ పేరిట గనిని ప్రారంభించింది. ఈ గని నుంచి ఏకధాటిగా 2001 వరకు వజ్రాల వెలికితీత కొనసాగింది. తర్వాత కొన్నాళ్లు ఇది మూతబడింది. ఇది రష్యన్ వజ్రాల కంపెనీ ‘ఎయిరోసా’ చేతుల్లోకి వెళ్లడంతో 2009 నుంచి మళ్లీ వజ్రాల వెలికితీత కొనసాగుతోంది. ఇక్కడ వజ్రాల గని ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు ఏటా సగటున కోటి కేరట్ల (రెండువేల కిలోలు) వజ్రాల వెలికితీత జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. మరో నలబై ఏళ్లకు పైగా ఇక్కడి నుంచి వజ్రాలను వెలికితీసే అవకాశాలు ఉన్నాయని ఎయిరోసా కంపెనీ భావిస్తోంది. -
ఒకే రోజు రూ.78 కోట్ల జప్తు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ సాధారణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు గురువారం రికార్డు స్థాయిలో రూ.78.03 కోట్లు విలువ చేసే నగదు, మద్యం, ఇతర వస్తువులను జప్తు చేశారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో జప్తు చేసిన నగదు, ఇతర వస్తువుల మొత్తం విలువ రూ.243.76 కోట్లకు పెరిగిపోయింది. కాగా, ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న మొత్తం నగదు రూ.87.92 కోట్లు. ఒక్క రోజు 6వేల లీటర్ల మద్యం జప్తు తాజాగా రూ.1.21 కోట్లు విలువ చేసే 6132 లీటర్ల మద్యం జప్తు చేశారు. దీంతో ఈ నెల 9 నుంచి ఇప్పటి వరకు జప్తు చేసిన మొత్తం మద్యం 65,223 లీటర్లు కాగా, దీని విలువ రూ.10.21 కోట్లు. గురువారం రూ.16.77లక్షలు విలువ చేసే 103.165 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోగా, ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న గంజాయి 2950 కిలోలకు పెరిగింది. దీని విలువ రూ.7.72 కోట్లు. ఇప్పటి వరకు మరో రూ.7.72 కోట్లు విలువ చేసే ఇతర మత్తు పదార్థాలను జప్తు చేశారు. గురువారం రూ.57.67 కోట్లు విలువ చేసే బంగారం, వెండి, ఇతర వస్తువులు పట్టుకున్నారు. 83కిలోల బంగారం పట్టివేత అందులో 83.046 కిలోల బంగారం, 212 కిలోల వెండి, 112.195 క్యారట్ల వజ్రాలు, 5.35 గ్రాముల ప్లాటినం ఉంది. దీంతో ఇప్పటి వరకు పట్టుబడిన బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువుల విలువ రూ.120.40 కోట్లకు ఎగబాకింది. ఇందులో 181 కిలోల బంగారం, 693కిలోల వెండి, 154.45 క్యారెట్ల వజ్రాలున్నాయి. గురువారం రూ.8.84 కోట్లు విలువ చేసే ల్యాప్‌టాప్‌లు, వాహనాలు, కుక్కర్లు, చీరలు, క్రీడా సామగ్రి తదితర వస్తువులను పట్టుకున్నారు. దీంతో ఇప్పటి వరకు పట్టుబడిన ఇలాంటి వస్తువుల విలువ రూ.17.84 కోట్లకు చేరింది. హైవేపై రూ.750 కోట్ల నగదు కలకలం అలంపూర్: జోగుళాంబ గద్వాల జిల్లా సరిహద్దులోని 44వ జాతీయ రహదారిపై ఏకంగా రూ.750 కోట్ల నగదు పట్టుబడినట్లు సామాజిక మాధ్యమాల్లో గురువారం వైరల్ అయింది. దీంతో జిల్లా ఎన్నికల అధికారి వల్లూరు క్రాంతి ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఓ ప్రకటనలో వెల్లడించారు. ’’రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు కేరళ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి హైదరాబాద్ యూబీఐకి నగదును బదిలీ చేస్తున్నట్టు మంగళవారం రాత్రి సమాచారం వచ్చింది. ఈ మేరకు జిల్లా నుంచి ఆర్డీఓ, లీడ్ బ్యాంక్ మేనేజర్, డీఎస్పీ అధికారులు విచారణ చేసేందుకు స్పాట్‌కు వెళ్లి, నగదుకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. ఆ తర్వాత పోలీస్ ఎస్కార్ట్‌తో నగదును హైదరాబాద్‌లోని యూబీఐకి చేరినట్లు నిర్ధారణ చేసుకున్నాము’’’ అని క్రాంతి ఆ ప్రకటనలో వివరించారు. అయితే ఎంత మేరకు నగదు ఉందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. -
అరుదైన పెన్ను రూ.66.6 కోట్లు! ప్రపంచంలో అత్యంత ఖరీదైన కలం ఇదే..
World's most expensive pen: ప్రపంచ వ్యాప్తంగా అరుదైన వస్తువులను వేలం వేస్తుంటారు. ఆయా వస్తువులు కోట్లాది రూపాయలు పలకడం గురించి వింటుంటాం. ఇలాగే ఓ అరుదైన పెన్నును వేలం వేయగా 8 మిలియన్ డాలర్లు (రూ.66.6 కోట్లు) పలికింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. టిబాల్డి కంపెనీ తయారు చేసిన ఈ పెన్ను పేరు ‘ఫుల్గోర్ నోక్టర్నస్’. ఇది లాటిన్ పేరు. దీనికి అర్థం నైట్ గ్లో. నల్ల వజ్రాలు పొదిగిన ఈ అసాధారణ ఫౌంటెన్ పెన్‌కి ఇది సముచితమైన పేరు. 123 కెంపులు, 945 నల్ల వజ్రాలు, బంగారం అసాధారణమైన ఫుల్గోర్ నోక్టర్నస్ పెన్ నిర్మాణం, డిజైన్ ఫై రేషియోలో ఉంటాయి. దీన్ని దైవిక నిష్పత్తిగా పేర్కొంటారు. ఫుల్గోర్ నోక్టర్నస్ బాడీ, క్యాప్‌పై నల్ల వజ్రాలు విలాసంగా పొదిగి ఉంటాయి. అలాగే అద్భుతమైన బ్లడ్ రెడ్ కెంపులు పెన్ను క్యాప్‌ని అలంకరించి ఉంటాయి. మొత్తంగా ఇందులో 945 నల్ల వజ్రాలు, 123 కెంపులు పొదిగారు. 18-క్యారెట్ల బంగారంతో దాని నిబ్‌ను తయారు చేశారు. అత్యంత ఖరీదైన పెన్ను ఈ పెన్నును ప్రత్యేక ఉంచేది దాని దైవిక ఫై నిష్పత్తి. ఈ పెన్నును క్యాప్తొ మూసేసినప్పుడు అవి 1.618 ఫై నిష్పత్తిలో ఉంటాయి. ఇలాంటి పెన్ను మరొకటి లేదు. 2020లో ఫుల్గోర్ నోక్టర్నస్ పెన్ను షాంఘైలో వేలం వేయగా అది 8 మిలియన్ డాలర్లు పలికింది. ఇంతవరకూ ఏ పెన్ను కూడా ఈ స్థాయిలో ధర పలకలేదు. దీంతో ఇదే ప్రపంచ అత్యంత ఖరీదైన పెన్నుగా నిలిచింది. ఇదీ చదవండి: Dr Ranjan Pai: నాడు అద్దె ఇల్లు.. నేడు 6 యూనివర్సిటీలు, 28 ఆస్పత్రులు
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019