క్యాన్సర్ కేర్ వంటిల్లూ పుట్టిల్లే!
క్యాన్సర్ రావడానికి కొన్ని పద్ధతుల్లో వంట కూడా కారణమవుతుంది. ఉదాహరణకు ఒకసారి వేడి చేసిన నూనెను మళ్లీ వాడకూడదనేది అందరికీ తెలిసిన విషయం. అలా మాటిమాటికీ నూనెను వేడి చేయడం వల్ల అందులో క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనాలు ఏర్పడతాయి. అందుకే అలా వాడకూడదని నిపుణులు సలహా ఇస్తుంటారు. ఇది మాత్రమే కాకుండా వంట విషయంలో క్యాన్సర్‌కు కారణమయ్యే అంశాలేమిటీ... వంటలో చేయకూడనివేమిటీ, చేయాల్సినవేమిటో తెలుసుకుందాం. 7 వాడిన నూనెను మళ్లీ మళ్లీ వేడి చేసి వాడకూడదు. 7 కొవ్వులు ఎక్కువ ఉన్న ఆహారం క్యాన్సర్ కారకమయ్యే అవకాశముంది. అందుకే వేట మాంసం (రెడ్ మీట్) వద్దని నిపుణుల సలహా. రెడ్ మీట్ ఎక్కువగా తినే దేశాల్లో కొలోన్ క్యాన్సర్, కొలోరెక్టల్ క్యాన్సర్లు ఎక్కువ. రెడ్ మీట్‌తో ΄్యాంక్రియాటిక్, ్ర΄ోస్టేట్, ΄÷ట్ట క్యాన్సర్ల ముప్పు కూడా పెరుగుతుంది. మామూలు కూరగాయలు, ఆకుకూరల ఆహారం తినేవారితో ΄ోలిస్తే ప్రతిరోజూ ప్రతి 100 గ్రాముల రెడ్‌మీట్ తినేవారిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు 17 శాతం పెరగడం కొందరు అధ్యయనవేత్తల పరిశీలనలో తేలిన విషయం. అయితే మాంసాహార ప్రియులకు న్యూట్రిషనిస్టులు, డాక్టర్లు ఇచ్చే సలహా ఏమిటంటే... మాంసాహార ప్రియులు రెడ్‌మీట్‌కు బదులు వైట్ మీట్ అంటే కొవ్వులు తక్కువగా ఉండే చికెన్, చేపలు తినడం మంచిది. చేపలైతే ΄ోషకాహారపరంగా కూడా మంచివి. అందులోని ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ క్యాన్సర్‌ను నివారిస్తాయి కూడా. 7 క్యాన్సర్ నివారణలో ఏం వండారన్నది కాదు... ఎలా వండామన్నది కూడా కీలకమే. ముఖ్యమే. ఒక వంటకాన్ని చాలా ఎక్కువ ఉష్ణోగ్రతతో వండటం కొన్నిసార్లు క్యాన్సర్ కారకాలైన రసాయనాలు వెలువడేందుకు అవకాశమివ్వవచ్చు. ఉదా: మాంసాన్ని చాలా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉడికిస్తున్నా... అంటే గ్రిల్డ్ ఐటమ్స్, ఫ్రైడ్ (వేపుడు) ఐటమ్స్‌గా చేస్తుంటే అందులోని కొన్ని పదార్థాలు హెటెరో సైక్లిక్ అరోమాటిక్ అమైన్స్ అనే రసాయనాలుగా మారవచ్చు. అవి క్యాన్సర్ కారకాలు. 7 విదేశీ తరహాలో ఇప్పుడు మనదేశంలోనూ స్మోక్డ్ ఫుడ్ తినడం మామూలుగా మారింది. స్మోకింగ్ ప్రక్రియకు గురైనా, నేరుగా చాలా ఎక్కువ ఉష్ణోగ్రత తగిలేలా మంట మీద వండిన ఆహారపదార్థాల్లోంచి వెలువడే ‘΄ాలీ సైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్’ అనే (పీఏహెచ్‌స్) అనే రసాయనాలు క్యాన్సర్ కారకాలు. అందుకే ఈ పద్ధతుల్లో వడటం సరికాదు.7 ఆహారాన్ని సరైన పద్ధతుల్లో నిల్వ చేసుకోడానికి వాడే కొన్ని రకాల పదార్థాల వల్ల క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. ఉదాహరణకు ఆహారాల నిల్వకు ఉప్పు వాడటం అనాదిగా వస్తున్న పద్ధతి. అయితే ఉప్పులో చాలాకాలం పాటు ఊరిన పదార్థాల వల్ల పోట్ట లోపలి లైనింగ్ దెబ్బతిని, అది ఇన్ఫ్లమేషన్కు గురికావచ్చు. అలా కడుపు లోపలి రకాలు (లైనింగ్) దీర్ఘకాలం ఒరుసుకుపోవడంతో కడుపులో ఒరుసుకు΄ోయిన లైనింగ్ రకాలు నైట్రేట్ల వంటి క్యాన్సర్ కారక రసాయనాల ప్రభావానికి గురయ్యే అవకాశముంది. అలాంటప్పుడు కడుపులో ‘హెలికోబ్యాక్టర్ పైలోరీ’ అనే సూక్ష్మజీవి ఉంటే అది ఆ ్రపాంతాల్లో పుండ్లు (స్టమక్ అల్సర్స్) వచ్చేలా చేస్తుంది. ఈ స్టమక్ అలర్స్ కొన్ని సందర్భాల్లో క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఉంది. అందుకే ఉప్పు ఎక్కువగా ఉండే చిప్స్, సాల్టెట్ పదార్థాలు, బేకరీ ఐటమ్స్‌ను చాలా పరిమితంగా తీసుకోవాలన్నది వైద్యనిపుణుల సలహా. ఆహారంలో ఉప్పు పెరుగుతున్నకొద్దీ్ద హైబీపీ కూడా పెరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ రోజుకు ఆరు గ్రాములకు మించి ఉప్పు వాడటం సరికాదు.