గోల్ఫర్ సాహిత్ రెడ్డికి నిరాశ
కాలిఫోర్నియా: ప్రొకోర్ చాంపియన్‌షిప్ గోల్ఫ్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్, భారత సంతతి అమెరికా గోల్ఫర్ తీగల సాహిత్ రెడ్డి ఈసారి టైటిల్ నిలబెట్టుకోలేకపోయాడు. ఈ టోర్నీలో సాహిత్ 12 అండర్ 276 పాయింట్లతో మరో నలుగురితో కలిసి సంయుక్తంగా ఐదో స్థానంలో నిలిచాడు. ప్యాటన్ కిజైర్ (అమెరికా) 20 అండర్ 268 పాయింట్లతో చాంపియన్‌గా అవతరించాడు. డేవిడ్ లిప్స్కీ (అమెరికా) రెండో స్థానంలో, ప్యాట్రిక్ ఫిష్‌బర్న్ (అమెరికా) మూడో స్థానంలో నిలిచారు.విజేతగా నిలిచిన ప్యాటర్ కిజైర్కు 10,80,000 డాలర్లు (రూ. 9 కోట్ల 5 లక్షలు), రన్నరప్ లిప్‌స్కీకి 6,54,000 డాలర్లు (రూ. 5 కోట్ల 48 లక్షలు), సెకండ్ రన్నరప్ ఫిష్బర్న్కు 4,14,000 డాలర్లు (రూ. 3 కోట్ల 47 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. సంయుక్తంగా ఐదో స్థానంలో నిలిచిన తీగల సాహిత్ 1,76,100 డాలర్ల (రూ. 1 కోటి 47 లక్షలు) ప్రైజ్‌మనీని దక్కించుకున్నాడు.హైదరాబాద్‌కు చెందిన తీగల సాహిత్ తల్లిదండ్రులు 1980 దశకంలో అమెరికాలో స్థిరపడ్డారు. సాహిత్ అమెరికాలోనే పుట్టి పెరిగి గోల్ఫర్గా రాణిస్తున్నాడు.