
58 నెలల మన పాలనను మీరు చూశారు.. గత చంద్రబాబు పాలనను మీరు చూశారు

గతంలో ముగ్గురు(టీడీపీ, జనసేన, టీడీపీ) కలిసొచ్చారు.. 2014లో చంద్రబాబు గతంలో 95శాతం హామీలను ఎగ్గొట్టారు

ఎన్నికలు వచ్చేసరికి రంగు రంగుల మేనిఫెస్టోతో మళ్లీ ముగ్గురు మోసం చేసేందుకు వస్తున్నారు

మంగళగిరిలో చేనేతలు ఎక్కువుగా ఉన్నారని.. ఆర్కేను ఒప్పించి చేనేత మహిళకు సీటు ఇచ్చాం

బీసీలు ఎక్కువగా ఉన్నా... చంద్రబాబు మాత్రం బీసీలకు సీటు ఇవ్వరు.. మంగళగిరిలో చంద్రబాబు ఫ్యామిలే పోటీ చేస్తోంది.. కుప్పంలోనూ అదే పరిస్థితి

ఈ ఎన్నికల్లో 100 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చాం.. దేశ రాజకీయ చరిత్రలోనే ఇది ఒక రికార్డు

చంద్రబాబు కొడుకు దగ్గర ఉన్నంత డబ్బు మురుగుడు లావణ్య(మంగళగిరి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి) దగ్గర లేదు

వాళ్లు ఓటుకు రూ.4 వేలు కూడా ఇస్తారు.. టీడీపీ డబ్బు ఇస్తే తీసుకోండి

ఓటు వేసేటప్పుడు మాత్రం ఆలోచించి ఓటు వేయండి.. లేకపోతే మోసపోతాం

ఎవరికి అమ్మ ఒడి ఇస్తారో, చేయూత ఇస్తారో.. లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమం ఇస్తారో వాళ్లకే ఓటేయండి