
కన్నడ హీరో దర్శన్.. మొన్నటి దాకా అందరూ ఆయన్ను డి బాస్ అని పిలిచేవారు. అభిమాని రేణుకాస్వామి హత్యతో ఆయన్ను రౌడీ బాస్ అని పిలుస్తున్నారు.

తనను అంతలా ఆరాధించే అభిమానిని దర్శన్ చంపడానికి కారణం పవిత్ర గౌడ! నటి పవిత్రతో దర్శన్ పదేళ్లుగా రిలేషన్‌లో ఉన్నాడు.

పవిత్రకు గతంలో పెళ్లయి, ఓ కూతురు కూడా ఉంది. కానీ భర్తతో విడిపోయి దర్శన్‌తో కలిసి ఉంటోంది.

అటు దర్శన్‌కు విజయలక్ష్మి అనే భార్య కూడా ఉంది. ఇల్లాలిని గాలికొదిలేసి ప్రేయసి మీదే మోజు పెంచుకున్నాడు.

ఇది దర్శన్ అభిమాని రేణుకాస్వామికి గిట్టలేదు. అతడు భార్యకు దూరంగా ఉండటానికి కారణం నువ్వేనంటూ పవిత్రను తీవ్రంగా విమర్శించాడు. హద్దు దాటి మాట్లాడాడు.

ఇదంతా పవిత్ర.. దర్శన్‌కు చెప్పడం.. ఆయన కోపంతో తన గ్యాంగ్‌ను వెంటేసుకుని రేణుకాస్వామిని చిత్రహింసలకు గురిచేసి చంపడం తెలిసిందే!

ఈ కేసులో దర్శన్, పవిత్రతో పాటు పలువురినీ అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

రేణుకాస్వామి తనను ఇబ్బందిపెడుతున్నాడని చెప్పకపోయుంటే ఇదంతా జరిగేది కాదని పవిత్ర పోలీసుల ముందు విలపించిందట!

కాగా పవిత్ర గౌడ.. ఛత్రిగళు సార్ ఛత్రిగళు, 54321, ప్రీతి కితాబు, ఆగమ్య వంటి చిత్రాల్లో నటించింది.

