
ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండకు ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టాలంటేనే జనాలు భయపడుతున్నారు.

ఈ ఎండాకాలంలో మంచుతో ఆడుకుంటే ఎలా ఉంటుంది? ఆ ఊహ ఎంత బాగుందో కదా!

అందుకే మహేశ్‌బాబు ఫ్యామిలీ సమ్మర్ వెకేషన్‌కు వెళ్లింది. వీలైనప్పుడల్లా ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్తూ ఉండం మహేశ్‌కు అలవాటే! అలా ఈ సారి కూడా తన కుటుంబంతో కలిసి ఫారిన్ వెళ్లాడు.

కానీ ఏ ఫోటోలో కూడా మహేశ్‌బాబు కనిపించకపోవడంతో మా హీరో ఎక్కడ? అని ప్రశ్నిస్తున్నారు అభిమానులు.

మహేశ్‌ను చూపించకపోవడంతో నిరాశచెందుతున్నారు. మా హీరోను కూడా కాస్త చూపించండి అని వేడుకుంటున్నారు.

ఈ వెకేషన్ పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత మహేశ్.. రాజమౌళితో చేయనున్న సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నాడు.
