
ఈయన సంగీతం వింటే ఎవరికైనా జోష్ రావాల్సిందే.. దుమ్మురేపే మాస్ బీట్స్, హుషారెత్తించే ఐటం సాంగ్స్.. ఏవైనా సరే సంగీతంతో కట్టిపడేస్తాడు.

ఎనర్జీకి మారు పేరు కాబట్టే ఈయనను అందరూ రాక్‌స్టార్ అని పిలుచుకుంటాడు. అతడే దేవిశ్రీప్రసాద్.

నేడు (ఆగస్టు 2) డీఎస్పీ బర్త్‌డే.. అమ్మమ్మ పేరులోని దేవి, తాతయ్య పేరులోని ప్రసాద్‌ను తీసుకుని ఈయనకు దేవిశ్రీప్రసాద్ అని నామకరణం చేశారు.

చిన్నప్పటి నుంచే సంగీత దర్శకుడు కావాలని కోరుకున్నాడు. తొలిసారి దేవి సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌కు పని చేశాడు.

శంకర్ దాదా ఎంబీబీఎస్, అందరివాడు, ఖైదీ నెంబర్ 150, జయ జానకి నాయక, రంగస్థలం, భరత్ అనే నేను, నాన్నకు ప్రేమతో, సరిలేరు నీకెవ్వరు, ఉప్పెన, పుష్ప, వాల్తేరు వీరయ్య.. ఇలా అనేక సినిమాలకు బ్లాక్‌బస్టర్ సంగీతం అందించాడు.

ప్రస్తుతం పుష్ప 2, తండేల్, ఉస్తాద్ భత్ సింగ్, కుబేర చిత్రాలకు మ్యూజిక్ అందిస్తున్నాడు.
















