
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫిబ్రవరిలో పెళ్లిపీటలెక్కింది. ప్రియుడు జాకీ భగ్నానీతో ఏడడుగులు వేసింది.

పెళ్లి చేసుకున్న రెండు నెలలకే గుడ్ న్యూస్ చెప్పిందీ బ్యూటీ.

హైదరాబాద్‌లో ఫుడ్ బిజినెస్ ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.

ఏప్రిల్ 16న కావూరి హిల్స్‌లో ఆరంభం పేరిట మిల్లెట్స్ రెస్టారెంట్‌ను ప్రారంభించింది.

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్‌లో పండించిన చిరుధాన్యాలనే వంటల్లో ఉపయోగించనున్నారు.

కాస్త వెరైటీగా ప్రజల ఆరోగ్యం కోరుతూ బిజినెస్ ప్రారంభించిన రకుల్ ప్రీత్ సింగ్‌కు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.






