
ఐక్య పోరాటాలతో ఏదైనా సాధించవచ్చని పలుమార్లు కార్మికులు నిరూపించారని సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు.

మేడే సందర్భంగా బుధవారం ఫిలిం ఫెడరేషన్ కార్యాలయం వద్ద ఆయన ఫిలిం ఫెడరేషన్, సినీ యూనియన్ల కార్మిక నేతలతో కలిసి మేడే జెండాను ఎగుర వేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రమ దోపిడీకి గురవుతున్న తరుణంలో కార్మికుల పోరాటంతోనే 8 గంటల పని విధానం అమల్లోకి వచ్చిందని గుర్తు చేశారు.

మనలో మనకు ఎన్ని గొడవలు ఉన్నా కూడా ఏదైనా సందర్భంగా వచ్చినప్పుడు కార్మికులంతా కలిసి కట్టుగా ఉండి పోరాడాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌కుమార్, సెక్రటరి పీఎస్‌ఎన్ దొర, కోశాధికారి సురేష్, డైరెక్టర్ వీర శంకర్, వివిధ యూనియన్ల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.




